MBA & MCA: 99.89 శాతంసీట్ల కేటాయింపు
2022 ఐసెట్‌లో మొత్తం 61,613 మంది అర్హత సాధించారు. వీరికోసం అక్టోబర్ 10వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. 31,258 మంది 4,30,006 ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 261 ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలున్నాయి. వీటిల్లో 26,201 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: ISB: ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకుల్లో ఐఎస్‌బీ టాప్
తాజా కౌన్సెలింగ్ ద్వారా 23,001 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 3,192 భర్తీ చేయాల్సి ఉంది. 77 కాలేజీల్లో వందశాతం సీట్ల కేటాయింపు జరిగినట్లు సాంకేతిక విద్య విభాగం పేర్కొంది. ఎంబీఏలో 23,525 సీట్లు అందుబాటులో ఉంటే 20,336 సీట్లు భర్తీ చేశారు. ఎంసీఏలో 2,676 సీట్లుంటే 2,673 భర్తీ చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెలాఖరులోగా అన్ని ధ్రువపత్రాలతో కాలేజీలో రిపోర్టు చేయాలని తెలిపింది.
చదవండి: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం..డిమాండ్ ఉంటేనే అనుమతి..