నీటి పారుదల సౌకర్యాలు
1. కాలువలు
2. బావులు
3. చెరువులు
4. ఇతర ఆధారాలు
తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఆధారాల కంటే బోరుబావుల ద్వారా లభించే నీటి పారుదల సౌకర్యాలే ప్రధానమైనవిగా ఉన్నట్లు పట్టిక ద్వారా గమనించవచ్చు.
- 1960-61లో చెరువుల కింద సేద్యం చేస్తున్న భూమి 60 శాతం ఉండగా, 2013-14 నాటికి ఇది 8.94 శాతానికి తగ్గింది.
- 1960-61లో బావుల ద్వారా సేద్యం చేసే భూమి 19.01 శాతం ఉండగా 2013-14 నాటికి ఇది 73.83 శాతానికి పెరిగింది.
- కాలువల ద్వారా సాగయ్యే భూమి ఎక్కువగా ఉన్న జిల్లాలు.. 1. నల్లగొండ, 2. కరీంనగర్; తక్కువగా ఉన్న జిల్లాలు.. 1. రంగారెడ్డి, 2. మెదక్.
- చెరువుల ద్వారా సాగయ్యే భూమి ఎక్కువగా ఉన్న జిల్లాలు.. 1. వరంగల్, 2. ఖమ్మం; తక్కువగా ఉన్న జిల్లాలు.. 1. రంగారెడ్డి, 2. నిజామాబాద్
- బావుల ద్వారా సాగయ్యే భూమి ఎక్కువగా ఉన్న జిల్లాలు.. 1. కరీంనగర్, 2. వరంగల్; తక్కువగా ఉన్న జిల్లాలు.. 1. రంగారెడ్డి, 2. మెదక్
నీటి పారుదల సౌకర్యాల్లో ముఖ్యమైనవి కాలువలు. వీటి నిర్మాణం, నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్నదైనప్పటికీ ఎక్కువ విస్తీర్ణంలో భూమికి సాగునీటిని అందిస్తాయి. కాలువల కింద ఉన్న సేద్యపు భూమి 1960-61లో 19 శాతం ఉండగా, 2011-12 నాటికి ఇది క్రమంగా 16 శాతానికి తగ్గింది.
కాలువలు ప్రధానంగా మూడు రకాలు. అవి: 1) శాశ్వత కాలువలు, 2) ఇనన్డేషన్ కాలువలు, 3) నిల్వ నీటి కాలువలు
బావులు
బావులు సాధారణంగా రెండు రకాలు. అవి: సాధారణ బావులు, గొట్టపు బావులు. గొట్టపు బావులు తెలంగాణలో సాగునీటికి అత్యంత ప్రధాన ఆధారం. ప్రభుత్వ, వాణిజ్య బ్యాంకులు గొట్టపు బావుల తవ్వకానికి రుణ సౌకర్యాలు కల్పించడం వల్ల భూగర్భ నీటిని వినియోగించుకోగలుగుతున్నారు. గొట్టపు బావుల నిర్మాణం ఖర్చుతో కూడిన ప్రక్రియ అయినప్పటికీ వీటి ద్వారా సాగు చేసే భూమి ఎక్కువగా ఉంది.
1960-61లో బావుల ద్వారా 19.01 శాతం నీటి పారుదల సౌకర్యాలు అందుబాటులో ఉండగా 2013-14 నాటికి ఇది 73.83 శాతానికి పెరిగింది. ప్రస్తుతం బావుల ద్వారా 21 లక్షల హెక్టార్ల భూమి సాగు చేస్తున్నారు.
చెరువులు
సాధారణంగా చెరువులు వర్షం నీటితో నిండి రైతులకు అవసరమైన సాగునీటిని అందిస్తున్నాయి. దీంతోపాటు చేపలు, రొయ్యల పెంపకానికి కూడా దోహదపడుతున్నాయి. చెరువులు రెండు రకాలు. అవి:
1) సహజంగా ఏర్పడేవి
2) మానవ నిర్మితమైనవి.
రాష్ట్రంలో అతిపెద్ద చెరువుల నుంచి ఊట చెరువులు, చిన్న కుంటల వరకు దాదాపు 46,000 నీటి సంరక్షణ నిర్మాణాలున్నాయి. ఇవన్నీ రాష్ట్రంలో సాగునీరు, వాణిజ్య, గృహావసరాలకు కావాల్సిన నీటిని అందిస్తున్నాయి.
చెరువుల కింద సేద్యం చేసే భూమి విస్తీర్ణం 1960-61లో 60 శాతం ఉండగా, 2013-14 నాటికి 8.94 శాతానికి తగ్గింది. 2010 నాటికి దాదాపు 3 లక్షల హెక్టార్ల భూమికి చెరువుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు అందుతున్నాయి.
- మిగతా ఆధారాలతో పోల్చినప్పుడు రాష్ట్రంలో బోరు బావుల ద్వారా లభించే నీటి పారుదల సౌకర్యాలు ప్రధానమైనవిగా ఉన్నాయి.
- 1960-61లో చెరువుల కింద సేద్యం చేస్తున్న భూమి 60 శాతం ఉండగా, 2013-14 నాటికి ఇది 8.94 శాతానికి తగ్గింది.
- 1960-61లో బావుల ద్వారా సేద్యం చేసే భూమి 19.01 శాతం ఉండగా 2013-14 నాటికి ఇది 73.83 శాతానికి పెరిగింది.
- కాలువల ద్వారా సాగయ్యే భూమి ఎక్కువగా ఉన్న జిల్లాలు.. 1. నల్లగొండ, 2. కరీంనగర్; తక్కువగా ఉన్న జిల్లాలు.. 1. రంగారెడ్డి, 2. మెదక్.
- చెరువుల ద్వారా సాగయ్యే భూమి ఎక్కువగా ఉన్న జిల్లాలు.. 1. వరంగల్, 2. ఖమ్మం; తక్కువగా ఉన్న జిల్లాలు.. 1. రంగారెడ్డి, 2. నిజామాబాద్
- బావుల ద్వారా సాగయ్యే భూమి ఎక్కువగా ఉన్న జిల్లాలు.. 1. కరీంనగర్, 2. వరంగల్; తక్కువగా ఉన్న జిల్లాలు.. 1. రంగారెడ్డి, 2. మెదక్
రాష్ట్రంలోని ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు: ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీన్ని కృష్ణానదిపై నల్లగొండ, గుంటూరు (ఏపీ) జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 1.113 మిలియన్ హెక్టార్ల భూమికి, ఎడమ కాలువ ద్వారా తెలంగాణలోని 0.32 మిలియన్ హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు: దీన్ని కృష్ణానదిపై మహబూబ్‌నగర్, కర్నూల్ (ఏపీ) జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. ఎడమ కాలువ ద్వారా 4.20 లక్షల ఎకరాల భూమికి సాగునీరు లభిస్తోంది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు: దీన్ని గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద నిర్మించారు. దీని ముఖ్య లక్ష్యం రాష్ట్రంలోని 5 జిల్లాలకు (కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం) తాగు, సాగు నీటిని అందించడం. ఈ ప్రాజెక్టు కింద 4.011 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తోంది.
కడెం ప్రాజెక్టు: దీన్ని శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో 25,000 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తోంది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు: కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఎల్లంపల్లి వద్ద గోదావరి నదిపై దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రస్తుతం 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తోంది.
పులిచింతల ప్రాజెక్టు: నల్లగొండ, గుంటూరు (ఏపీ) జిల్లాల మధ్య కృష్ణానదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు కింద 2.7 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు.
దిగువ మానేరు డ్యాం: కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కాకతీయ కాలువకు మళ్లించాల్సిన నీటిని ఆనకట్ట ద్వారా నిల్వ చేస్తూ క్రమబద్ధంగా నీటిని విడుదల చేస్తారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు 5.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.
కొమరం భీం ప్రాజెక్టు: ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సమీపంలో పెద్దవాగు నదిపై ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద 2,000 ఎకరాలు, కుడి కాలువ కింద 2,500 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. భవిష్యత్తులో సుమారు 7 జిల్లాలకు 180 టీఎమ్సీల నీటిని అందించాలనే ఉద్దేశంతో దీన్ని గోదావరి నదిపై నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16.40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించనున్నారు.
నక్కల గండి ప్రాజెక్టు: నల్లగొండ జిల్లాలోని తీవ్రమైన ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని కరవు ప్రాంతాలకు కావాల్సిన సాగునీటిని అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 3.41 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం: దీన్ని కృష్ణానదిపై నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించడం.
జూరాల-పాకాల వరద నీటి కాలువ: ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరుగుతోంది. జూరాల ప్రాజెక్టు ముందు గట్టు నుంచి వరంగల్ జిల్లాలోని పాకాల రిజర్వాయర్ వరకు ఈ వరద కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. వరద సమయంలో 70 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతాల్లో ఉన్న దాదాపు 700 చెరువులకు నీటిని అందించాలనేది దీని లక్ష్యం.
నిజాం సాగర్ డ్యాం: నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట, భంజపల్లి గ్రామాల మధ్య గోదావరి ఉపనది మంజీరా నదిపై నిర్మించారు. ఈ డ్యాం ద్వారా 2.31 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలోని బాన్స్ వాడ, బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాలు లబ్ధి పొందుతున్నాయి.
దేవాదుల ఎత్తి పోతల పథకం: భారతదేశంలోని ముఖ్యమైన ఎత్తిపోతల పథకాల్లో ఇది ఒకటి. ఇది ఆసియాలో రెండో అతిపెద్ద ఎత్తిపోతల పథకం. దీన్ని వరంగల్ జిల్లాలోని దేవాదుల వద్ద నిర్మించారు. ఇది ప్రత్యేకంగా గోదావరి నది నుంచి నీటిని ఎత్తడానికి రూపొందించిన పథకం. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాలైన వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటిని అందించడంతో పాటు, 6.21 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నారు.
వివిధ నీటిపారుదల సదుపాయాల కింద ఉన్న భూ విస్తీర్ణం
సంవత్సరం | కాలువలు (శాతం) | బావులు (శాతం) | చెరువులు (శాతం) | ఇతర ఆధారాలు (శాతం) | నికర భూమి (హెక్టార్లలో) | మొత్తం భూ విస్తీర్ణం (హెక్టార్లలో) |
1960-61 | 19 | 19.1 | 60 | 1.99 | 6,90,000 | 7,96,000 |
1980-81 | 28 | 33.08 | 36 | 2.92 | 9,82,000 | 12,46,000 |
2007-08 | 14.02 | 74.78 | 08.78 | 2.68 | 17,49,000 | 24,46,000 |
2010-11 | 16.8 | 70.39 | 10.17 | 2.64 | 20,05,000 | 29,99,000 |
2013-14 | 14.85 | 73.83 | 08.94 | 2.38 | 22,89,000 | 31,64,000 |
జిల్లాల వారీగా వివిధ నీటి పారుదల సౌకర్యాల కింద ఉన్న భూ విస్తీర్ణం హెక్టార్లలో (2009-10 ప్రకారం)
జిల్లా | కాలువల ద్వారా సేద్యమయ్యే భూమి | చెరువుల ద్వారా సేద్యం చేసే భూమి | బావుల ద్వారా సేద్యం చేసే భూమి | ఇతర ఆధారాల ద్వారా సేద్యపు పరిమాణం | మొత్తం భూమి |
ఖమ్మం | 89,340 (32.0%) | 58,522 (21.0%) | 10,77,46 (38.6%) | 23,443 (8.4%) | 27,90,51 |
నల్లగొండ | 1,48,021 (31.0%) | 28,197 (5.9%) | 2,79,389 (58.6%) | 22,633 (4.73%) | 4,78,240 |
కరీంనగర్ | 1,25,273 (20.9%) | 52,381 (8.7%) | 4,22,890 (70.4%) | ---- | 6,00,544 |
నిజామాబాద్ | 66,043 (19.5%) | 11,457 (3.4%) | 2,52,527 (74.7%) | 7,905 (2.4%) | 3,37,932 |
ఆదిలాబాద్ | 18,963 (15.4%) | 18,421 (15.0%) | 83,043 (67.5%) | 62,567 (2.1%) | 1,22,994 |
మహబూబ్‌నగర్ | 41,755 (12.1%) | 19,667 (5.7%) | 2,71,710 (78.6%) | 12,543 (3.6%) | 3,45,675 |
వరంగల్ | 10,126 (2.1%) | 98,076 (20.1%) | 3,73,625 (76.7%) | 5,491 (1.1%) | 4,87,318 |
రంగారెడ్డి | 1,334 (1.3%) | 6,088 (5.8%) | 96,526 (91.3%) | 1,799 (1.6) | 1,05,747 |
మెదక్ | 3,032 (1.3%) | 12,415 (5.1%) | 2,23,503 (92.6%) | 2,347 (1.0) | 2,41,297 |
తెలంగాణ రాష్ట్రం | 5,03,887 (16.8%) | 3,05,224 (10.2%) | 21,10,959 (70.4%) | 78,728 (2.6%) | 2,998,798 |
తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న నదులు
ఆదిలాబాద్ | గోదావరి, పెన్‌గంగా, వార్దా, ప్రాణహిత, కడెం, ఎర్రవాగు, పెద్దవాగు, సిద,సుద్దవాగు, రాలివాగు, వట్టివాగు. |
కరీంనగర్ | గోదావరి, మానేరు, బొగ్గుల వాగు. |
వరంగల్ | గోదావరి, ఆలేరు, మున్నేరు, పాలేరు, కిన్నెరసాని,సలివాగు, వైరా, సంపెన్నవాగు. |
ఖమ్మం | మున్నేరు, గోదావరి, కిన్నెరసాని, వైరానది, శబరి, పాలేరు, ఆలేరు, ముక్కమామిడి వాగు, కొట్టలేరు, గుండ్లవాగు, మోడికుంట వాగు. |
నల్లగొండ | కృష్ణా, మూసీ, ఆలేరు, పాలేరు, పెద్దవాగు, దిండి, హాలియ. |
నిజామాబాద్ | గోదావరి, మంజీరా, పులాంగు, ఆలేరు, కల్యాణి, ఎడ్లక ట్ట. |
మెదక్ | మంజీరా, కుట్లేరు, వాల్దీ. |
మహబూబ్‌నగర్ | కృష్ణా, తుంగభద్ర, దిండి, పెద్దవాగు, చిన్నవాగు. |
రంగారెడ్డి | మూసీ, జూట్‌పల్లి వాగు, పర్గి వాగు, కోటిపల్లి, ఈసి. |
హైదరాబాద్ | మూసీ నది. |
పంట | ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలు | ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా | సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా |
---|---|---|---|
వరి | 1. కరీంనగర్ 2. నిజామాబాద్ 3. వరంగల్ | నిజామాబాద్ | కరీంనగర్ |
గోధుమ | 1. మెదక్ 2. ఆదిలాబాద్ 3.నిజామాబాద్ | నిజామాబాద్ | ఆదిలాబాద్ |
మొక్కజొన్న | 1. మహబూబ్‌నగర్ 2. మెదక్ 3. కరీంనగర్ | ఖమ్మం | మహబూబ్‌నగర్ |
జొన్న | 1. మహబూబ్‌నగర్ 2. ఆదిలాబాద్ 3. మెదక్ | కరీంనగర్ | మహబూబ్‌నగర్ |
సజ్జలు | 1. నిజామాబాద్ 2. మహబూబ్‌నగర్ 3. నల్లగొండ | నల్లగొండ | నిజామాబాద్ |
రాగులు | 1. మహబూబ్‌నగర్ 2. రంగారెడ్డి | రంగారెడ్డి | మహబూబ్‌నగర్ |
పప్పుధాన్యాలు | 1. మహబూబ్‌నగర్ 2. మెదక్ 3. ఆదిలాబాద్ | నిజామాబాద్ | మహబూబ్‌నగర్ |
పెసలు | 1. నల్లగొండ 2. మెదక్ 3. వరంగల్ | రంగారెడ్డి | నల్లగొండ |
కందులు | 1. మహబూబ్‌నగర్ 2. ఆదిలాబాద్ 3. రంగారెడ్డి | కరీంనగర్ | మహబూబ్‌నగర్ |
మినుములు | 1. మెదక్ 2. నిజామాబాద్ 3. ఆదిలాబాద్ | ఖమ్మం | మెదక్ |
శనగలు | 1. నిజామాబాద్ 2. మెదక్ 3. మహబూబ్‌నగర్ | నిజామాబాద్ | నిజామాబాద్ |
సోయాబీన్ | 1. నిజామాబాద్ 2. ఆదిలాబాద్ 3. మెదక్ | నిజామాబాద్ | ఆదిలాబాద్ |
నూనె గింజలు | 1. మహబూబ్‌నగర్ 2. నిజామాబాద్ 3. ఆదిలాబాద్ | ఖమ్మం | మహబూబ్‌నగర్ |
వేరుశనగ | 1. మహబూబ్‌నగర్ 2. వరంగల్ 3. నల్లగొండ | నిజామాబాద్ | మహబూబ్‌నగర్ |
నువ్వులు | 1. కరీంనగర్ 2. నిజామాబాద్ 3. ఆదిలాబాద్ | కరీంనగర్ | కరీంనగర్ |
కుసుమ | 1. మెదక్ 2. నిజామాబాద్ 3. రంగారెడ్డి | రంగారెడ్డి | మెదక్ |
పొద్దు తిరుగుడు | 1. మెదక్ 2. నిజామాబాద్ 3. మహబూబ్‌నగర్ | మెదక్ | మెదక్ |
ఆముదం | 1. మహబూబ్‌నగర్ 2. నల్లగొండ 3. రంగారెడ్డి | మహబూబ్‌నగర్ | మహబూబ్‌నగర్ |
చెరకు | 1. మెదక్ 2. నిజామాబాద్ 3. ఖమ్మం | నల్లగొండ | మెదక్ |
పత్తి | 1. నల్లగొండ 2. ఆదిలాబాద్ 3. వరంగల్ | ఖమ్మం | నల్లగొండ |
పొగాకు | 1. ఖమ్మం 2. మహబూబ్‌నగర్ 3. నిజామాబాద్ | కరీంనగర్ | మహబూబ్‌నగర్ |
మిరప | 1. ఖమ్మం 2. వరంగల్ 3. మహబూబ్‌నగర్ | ఖమ్మం | ఖమ్మం |
పసుపు | 1. కరీంనగర్ 2. నిజామాబాద్ 3. వరంగల్ | ఆదిలాబాద్ | కరీంనగర్ |
ఉల్లి | 1. మెదక్ 2. మహబూబ్‌నగర్ 3. నిజామాబాద్ | మెదక్ | మహబూబ్‌నగర్ |
మామిడి | 1. కరీంనగర్ 2. ఖమ్మం 3. మహబూబ్‌నగర్ | కరీంనగర్ | ఖమ్మం |