తెలంగాణ చరిత్ర - మాదిరి ప్రశ్నలు
1. క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడిన పత్రికలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) 1909లో ‘సంయుక్త సంఘ వర్తమాని’ పత్రిక మధిర నుంచి వెలువడింది
2) 1920లో ‘ములాగ్’ పత్రిక ఖమ్మంలో ప్రారంభమైంది
3) 1921లో ‘సువార్తామణి’ పత్రిక మహబూబ్ నగర్ నుంచి వెలువడింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
2. 1921లో ‘తెలంగాణ లిటరరీ అసోసియేషన్’ వెలువరించిన పత్రిక పేరేమిటి?
1) దేశీవాఙ్మయ
2) నీలగిరి
3) ఆంధ్రమాత
4) గోలకొండ
- View Answer
- సమాధానం: 1
3. ‘నీలగిరి’, ‘తెనుగు’ పత్రికలు ఏ సంవత్సరం నుంచి వెలువడ్డాయి?
1) 1921
2) 1924
3) 1922
4) 1923
- View Answer
- సమాధానం: 3
4. ‘గోలకొండ’ పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1924
2) 1925
3) 1926
4) 1927
- View Answer
- సమాధానం: 3
5. ‘దేశబంధు’ పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1924
2) 1925
3) 1927
4) 1926
- View Answer
- సమాధానం: 4
6. ‘సుజాత’ పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1927
2) 1926
3) 1928
4) 1925
- View Answer
- సమాధానం: 1
7. తెలంగాణలో తొలిసారిగా దళితులను చైతన్యపరిచినవారెవరు?
1) ఎం.ఎల్. ఆదయ్య
2) అరిగె రామస్వామి
3) భాగ్యరెడ్డి వర్మ
4) బి. శ్యాంసుందర్
- View Answer
- సమాధానం: 3
8. 1934లోనే దళితుల కోసం రాత్రి పాఠశాలను నడిపింది ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) బాల్ రెడ్డి
3) అరిగె రామస్వామి
4) కొత్వాల్ వెంకట్రామిరెడ్డి
- View Answer
- సమాధానం: 2
9. అంటరాని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి ‘జగన్మిత్రమండలి’ని స్థాపించింది ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) బాల్ రెడ్డి
3) అరిగె రామస్వామి
4) కొత్వాల్ వెంకట్రామిరెడ్డి
- View Answer
- సమాధానం: 1
10. ‘జగన్మిత్రమండలి’ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1901
2) 1904
3) 1906
4) 1907
- View Answer
- సమాధానం: 3
11. దళితులను తొలిసారిగా ‘ఆది హిందువులు’గా పేర్కొన్నవారెవరు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) ఎం.ఎల్. ఆదయ్య
4) బి. శ్యాంసుందర్
- View Answer
- సమాధానం: 2
12.దళితోద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) అంబేడ్కర్, గాంధీజీ కంటే ముందే భాగ్యరెడ్డి వర్మ అంటరాని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు
2) ‘జగన్మిత్రమండలి’ స్థాపన ఆధునిక భారతదేశంలో దళితోద్యమానికి నాందిగా చెప్పవచ్చు
3) 1910లో ఇసామియా బజార్, లింగంపల్లి ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. దళితుల కోసం సికింద్రాబాద్లో ‘ఆది హిందూ పాఠశాల’ను ప్రారంభించింది ఎవరు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) ఎం.ఎల్. ఆదయ్య
4) బి. శ్యాంసుందర్
- View Answer
- సమాధానం: 3
14. 1911లో ‘జగన్మిత్రమండలి’ పేరును ఏమని మార్చారు?
1) సంఘ సంస్కార నాటక మండలి
2) అహింసా సమాజం
3) మన్య సంఘం
4) ఆర్య సమాజం
- View Answer
- సమాధానం: 3
15. ‘మన్య సంఘం’ మొదటి అధ్యక్షుడెవరు?
1) జె.ఎస్. ముత్తయ్య
2) వల్తాటి శేషయ్య
3) భాగ్యరెడ్డి వర్మ
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 2
16.‘దేవదాసీ నిర్మూలన సంఘం’ను ఎవరు స్థాపించారు?
1) జె.ఎస్. ముత్తయ్య
2) వల్తాటి శేషయ్య
3) భాగ్యరెడ్డి వర్మ
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 3
17. భాగ్యరెడ్డి వర్మ ‘అహింసా సమాజం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1911
2) 1913
3) 1914
4) 1912
- View Answer
- సమాధానం: 4
18. ‘ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్’ పూర్వ రూపం ఏది?
1) మన్య సంఘం
2) ఆర్య సమాజం
3) అహింసా సమాజం
4) జగన్మిత్రమండలి
- View Answer
- సమాధానం: 3
19. భాగ్యరెడ్డి వర్మ ‘స్వస్తిక్’ వాలంటీర్ల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1912
2) 1908
3) 1914
4) 1911
- View Answer
- సమాధానం: 1
20. హైదరాబాద్లో ‘బ్రహ్మ సమాజం’ను ఎప్పుడు స్థాపించారు?
1) 1912
2) 1914
3) 1910
4) 1913
- View Answer
- సమాధానం: 2
21. ‘సంఘ సంస్కార మండలి’ని భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1916
2) 1914
3) 1915
4) 1917
- View Answer
- సమాధానం: 3
22. భాగ్యరెడ్డి వర్మ ‘విశ్వగృహ పరిచారిక సమ్మేళనం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1916
2) 1914
3) 1918
4) 1913
- View Answer
- సమాధానం: 1
23. భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) అంబేడ్కర్ కంటే ముందుగానే 1913లో ‘బుద్ధిజం’ దిశగా ఆలోచన చేశారు
2) ఆర్య సమాజంలో అనేక మంది దళితులను చేర్పించారు
3) ఆర్య సమాజం, బ్రహ్మ సమాజాల్లో కొంత కాలం మాత్రమే పనిచేశారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
24. మొదటి ‘పంచమ సదస్సు’ను ఎక్కడ నిర్వహించారు?
1) హైదరాబాద్
2) విశాఖపట్నం
3) సికింద్రాబాద్
4) విజయవాడ
- View Answer
- సమాధానం: 4
25.మొదటి ‘పంచమ సదస్సు’ను ఎప్పుడు నిర్వహించారు?
1) 1917 నవంబర్
2) 1917 ఆగస్టు
3) 1977 సెప్టెంబర్
4) 1917 డిసెంబర్
- View Answer
- సమాధానం: 1
26. రాష్ట్ర స్థాయిలో దళితులను ఏవిధంగా పిలవాలని ‘పంచమ సదస్సు’లో తీర్మానించారు?
1) పంచములు
2) ఆది హిందువులు
3) ఉన్నత జ్ఞానులు
4) ఆది ఆంధ్రులు
- View Answer
- సమాధానం: 4
27. ‘పంచమ సదస్సు’కు సంబంధించి కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
1) మొదటి పంచమ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు
2) మొదటి పంచమ సదస్సుకు జె.ఎస్. ముత్తయ్య అధ్యక్షత వహించారు
3) మొదటి పంచమ సదస్సులో ‘పంచమ’ శబ్దం వాడకాన్ని ఖండించారు
4) దళితులను జాతీయ స్థాయిలో ‘ఆది హిందువులు’గా పిలవాలని తీర్మానించారు
- View Answer
- సమాధానం: 2
28. ‘ది పంచమ’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది ఎవరు?
1) అరిగె రామస్వామి
2) జె.ఎస్. ముత్తయ్య
3) భాగ్యరెడ్డి వర్మ
4) బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: 2
29. ‘ది పంచమ’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించిన తేదీ?
1) 1918 డిసెంబర్ 31
2) 1919 డిసెంబర్ 31
3) 1919 నవంబర్ 31
4) 1918 నవంబర్ 31
- View Answer
- సమాధానం: 1
30. ‘దళితుల్లో భీష్ముడి లాంటి వారు’ అని ఎవరిని పేర్కొంటారు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) జె.ఎస్. ముత్తయ్య
3) ఎం.ఎల్. ఆదయ్య
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 3
31. తొలి ‘అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్’ను ఎప్పుడు నిర్వహించారు?
1) 1922 ఫిబ్రవరి
2) 1921 మార్చి
3) 1922 మార్చి
4) 1921 ఫిబ్రవరి
- View Answer
- సమాధానం: 3
32. ‘మన్య సంఘం’ను తర్వాతి కాలంలో ఏ పేరుతో పిలిచారు?
1) జగన్మిత్రమండలి
2) ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్
3) ఆది ద్రావిడ సంఘం
4) ఆది హిందూ మహాసభ
- View Answer
- సమాధానం: 2
33. 1922లో ‘జాతీయోన్నత మహాసభ’ను ఏర్పాటు చేసింది ఎవరు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) వల్తాటి శేషయ్య
4) ఎం.ఎల్. ఆదయ్య
- View Answer
- సమాధానం: 1
34. ‘హైదరాబాద్ అంబేడ్కర్’గా ఎవరిని పేర్కొంటారు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) వల్తాటి శేషయ్య
4) బి.ఎస్. వెంకట్రావు
- View Answer
- సమాధానం: 4
35. జ్యోతిరావు పూలే ఉద్యమాలతో ప్రభావితమై దళితుల చైతన్యానికి కృషి చేసినవారు?
1) అరిగె రామస్వామి
2) భాగ్యరెడ్డి వర్మ
3) వల్తాటి శేషయ్య
4) బి.ఎస్. వెంకట్రావు
- View Answer
- సమాధానం: 4
36. 1922లో ‘ఆది ద్రావిడ సంఘం’ను ఎవరు స్థాపించారు?
1) వల్తాటి శేషయ్య
2) బి.ఎస్. వెంకట్రావు
3) మేదరి గోవిందరాజులు
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 2
37. ‘అరుంధతీ నాయకుడు’గా పేరు పొందిన ప్రముఖుడు ఎవరు?
1) బి.ఎస్. వెంకట్రావు
2) అరిగె రామస్వామి
3) సుబేదారు సాయన్న
4) గుంటిమల్ల రామప్ప
- View Answer
- సమాధానం: 3
38.1925లో ‘మాతంగ జనసభ’ను ఏర్పాటు చేసినవారు?
1) గుంటిమల్ల రామప్ప
2) సుబేదారు సాయన్న
3) అరిగె రామస్వామి
4) బి.ఎస్. వెంకట్రావు
- View Answer
- సమాధానం: 1
39. దళితులను చైతన్యపరచడానికి చాదర్ఘాట్ నుంచి వెలువడిన పత్రిక పేరేమిటి?
1) ఆదిశక్తి
2) భాగ్యనగర్
3) సుజాత
4) ది పంచమ
- View Answer
- సమాధానం: 1
40. నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సును ఏ తేదీన నిర్వహించారు?
1) 1931 డిసెంబర్ 7
2) 1931 సెప్టెంబర్ 7
3) 1931 నవంబర్ 7
4) 1931 ఆగస్టు 7
- View Answer
- సమాధానం: 3
41. సికింద్రాబాద్లో తొలి ఆంగ్ల పత్రిక ‘దక్కన్ టైమ్స్’ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1859
2) 1866
3) 1864
4) 1868
- View Answer
- సమాధానం: 3
42. తెలంగాణ పత్రికా రంగానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1882లో ‘హైదరాబాద్ టెలీగ్రాఫ్’ను ప్రారంభించారు
2) 1885లో ‘హైదరాబాద్ రికార్డర్’ను ప్రారంభించారు
3) 1889లో ‘దక్కన్ స్టాండర్డ్'ను ప్రారంభించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
43.‘హైదరాబాద్ జర్నలిజానికి రూపశిల్పి’గా ఎవరిని పేర్కొంటారు?
1) కొత్వాల్ వెంకట్రామిరెడ్డి
2) మౌల్వీ మొహిబ్ హుస్సేన్
3) బంగారు శ్రీనివాస శర్మ
4) మహమ్మద్ ముర్తజా
- View Answer
- సమాధానం: 2
44. ‘మౌల్లం - ఎ - షఫిక్’ పత్రికను నిర్వహించినవారెవరు?
1) మహమ్మద్ ముర్తజా
2) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
3) మౌల్వీ మొహిబ్ హుస్సేన్
4) సయ్యద్ అలీ బిల్గ్రామి
- View Answer
- సమాధానం: 3
45. ‘మౌల్లం-ఎ-షఫిక్’ పత్రికకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) దీన్ని 1892లో ప్రారంభించారు
2) ముస్లిం మహిళలకు విద్య అందించడం, పరదా పద్ధతిని తొలగించడానికి ఇది కృషి చేసింది
3) ఈ పత్రికను నిజాం ప్రభుత్వం మూసివేయించింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. తెలంగాణలో మధిర నుంచి క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడిన తొలి పత్రిక ఏది?
1) ములాగ్ వర్తమాన
2) సంయుక్త సంఘ వర్తమాని
3) సువార్తామణి
4) ఆంధ్రవతి
- View Answer
- సమాధానం: 2
47. తెలంగాణ తొలి తెలుగు పత్రిక ‘హిత బోధిని’కి ఎవరు సంపాదకత్వం వహించారు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) వామన్ నాయక్
3) అరిగె రామస్వామి
4) బండారు శ్రీనివాస శర్మ
- View Answer
- సమాధానం: 4
48. పత్రికా రంగానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) హిత బోధిని పత్రికను 1913 మేలో ప్రారంభించారు
2) హిత బోధిని పత్రిక గ్రంథాలయోద్యమానికి ఊపిరిగా నిలిచింది
3) బండారు శ్రీనివాస శర్మ కృషి ఇతర పత్రికల ఆవిర్భావానికి ప్రేరణ కలిగించింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
49. హైదరాబాద్లో ‘దివ్యజ్ఞాన సమాజం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1890
2) 1892
3) 1894
4) 1895
- View Answer
- సమాధానం: 2
50. దివ్యజ్ఞాన సమాజం, దాని భావాలతో 1917లో వెలువరించిన పత్రిక ఏది?
1) గోలకొండ
2) దేవీవాఙ్మయ
3) నీలగిరి
4) ఆంధ్రమాత
- View Answer
- సమాధానం: 4