తెలంగాణ చరిత్ర
1. హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి?
1) ఆపరేషన్ బ్లూస్టార్
2) ఆపరేషన్ భజరంగ్
3)ఆపరేషన్ పోలో
4) ఆపరేషన్ జీరో
- View Answer
- సమాధానం: 3
2. హైదరాబాద్లో ‘బ్రహ్మ సమాజం’ను ఎప్పుడు స్థాపించారు?
1)1912
2)1914
3) 1910
4) 1913
- View Answer
- సమాధానం: 2
3. ‘హుస్సేన్ సాగర్’ జలాశయ నిర్మాత ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) మహమ్మద్ కులీ కుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) మహమ్మద్ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 1
4. ‘కవికర్ణ రసాయనం’ గ్రంథకర్త ఎవరు?
1) సారంగు తమ్మయ్య
2) సంకుసాల నృసింహ కవి
3) అద్దంకి గంగాధర కవి
4) కంచర్ల గోపన్న
- View Answer
- సమాధానం: 2
5. మువ్వ గోపాల పద రచయిత క్షేత్రయ్య ఏ గోల్కొండ నవాబు ఆస్థానాన్ని సందర్శించారు?
1) అబుల్ హసన్ తానీషా
2) మహమ్మద్ కులీ కుతుబ్ షా
3) సుల్తాన్ కులీ
4) అబ్దుల్లా కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో ‘డచ్చి తూర్పు ఇండియా’కు సంబంధించిన రేవు ఏది?
1) మచిలీపట్నం
2) బారుకచ్చా
3) పులికాట్
4) కల్యాణ
- View Answer
- సమాధానం: 3
7. ‘హైదరాబాద్ స్టేట్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1518
2) 1724
3) 1857
4) 1953
- View Answer
- సమాధానం: 2
8. ‘తెలంగాణా పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్’ గ్రంథ రచయిత ఎవరు?
1) రావి నారాయణ రెడ్డి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) గద్దె లింగయ్య
4) దేవులపల్లి రామానుజరావు
- View Answer
- సమాధానం: 2
9. ఉర్దూ భాషలో ‘దివాన్’ పేరుతో సంకలనాలు చేసిన గోల్కొండ నవాబు ఎవరు?
1) అబుల్ హసన్ తానీషా
2) మహమ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) మహమ్మద్ కులీ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 4
10. కుతుబ్షాహీ స్వతంత్ర రాజ్యాన్ని ఎవరు, ఎప్పుడు స్థాపించారు?
1) మహమ్మద్ కులీ కుతుబ్ షా - క్రీ.శ. 1591
2) ఇబ్రహీం కుతుబ్ షా - క్రీ.శ. 1550
3) సుల్తాన్ కులీ - క్రీ.శ. 1518
4) అబ్దుల్లా కుతుబ్ షా - క్రీ.శ.1672
- View Answer
- సమాధానం: 3
11. తెలుగు కవులు ‘మల్కిభరాముడు’గా కీర్తించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్షా
2) అబ్దుల్లా కుతుబ్షా
3) తానీషా
4) ఇబ్రహీం కుతుబ్షా
- View Answer
- సమాధానం: 4
12. ‘లైలా మజ్ను’ కావ్య రచయిత ఎవరు?
1) వాజిహీ
2) నైరోబీ
3) మహమ్మద్ కులీ కుతుబ్ షా
4) ఇక్బాల్
- View Answer
- సమాధానం: 1
13. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు?
1) మహమ్మద్ కుతుబ్ షా
2) మహమ్మద్ కులీ కుతుబ్ షా
3) సుల్తాన్ కులీ
4) తానీషా
- View Answer
- సమాధానం: 2
14. ‘చాంద్ బీబీ’ దక్కన్లో ఏ ప్రాంత రాజకుమారి?
1) అహ్మద్ నగర్
2) బీజాపూర్
3) బీరార్
4) గోల్కొండ
- View Answer
- సమాధానం: 1
15. ‘బీరార్’ రాజ్యాన్ని ఏ వంశస్థులు స్థాపించారు?
1) కుతుబ్షాహీలు
2) బహమనీలు
3) ఇమాద్ షాహీలు
4) బీజాపూర్ సుల్తాన్లు
- View Answer
- సమాధానం: 3
16. అక్కన్న, మాదన్న ఏ సుల్తాన్ కాలంలో మంత్రులుగా పనిచేశారు?
1) అబుల్ హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్ షా
3) మహమ్మద్ కుతుబ్ షా
4) సుల్తాన్ కులీ
- View Answer
- సమాధానం: 1
17. 1946లో మెదక్ జిల్లా ‘కంది’ గ్రామంలో నిర్వహించిన 13వ ఆంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు?
1) ఆదిరాజు వీరభద్రరావు
2) జమలాపురం కేశవరావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) ఊటుకూరి నారాయణరావు
- View Answer
- సమాధానం: 2
18. ‘మన తెలంగాణం’ గ్రంథ రచయిత ఎవరు?
1) శేషాద్రి రమణ కవులు
2) కొమర్రాజు లక్ష్మణ రావు
3) ఆదిరాజు వీరభద్రరావు
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 3
19. ‘తెలంగాణ శాసనాలు’ పేరుతో 129 శాసనాల సంపుటిని ఏ సంవత్సరంలో ప్రచురించారు?
1) 1948
2) 1935
3) 1947
4) 1957
- View Answer
- సమాధానం: 2
20. ‘వీర తెలంగాణ - నా అనుభవాలు, జ్ఞాపకాలు’ గ్రంథ రచయిత ఎవరు?
1) రావి నారాయణ రెడ్డి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) దేవులపల్లి రామానుజరావు
4) మెల్కోటే
- View Answer
- సమాధానం: 1
21. ‘గోలకొండ కవుల సంచిక’ ఎవరి సంపాదకత్వంలో ప్రచురితమైంది?
1) వెల్దుర్తి మాణిక్యరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) శేషాద్రి వెంకట రమణకవులు
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 2
22. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తక రచయిత ఎవరు?
1) ఎన్.జి. రంగా
2) గద్దె లింగయ్య
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) రావి నారాయణ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
23. ‘అణా గ్రంథమాల’ అనే పుస్తక సంస్థను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు?
1) వెల్దుర్తి మాణిక్యరావు
2) కె.సి. గుప్తా
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) నాయని వెంకట రంగారావు
- View Answer
- సమాధానం: 2
24. హైదరాబాద్ సంస్థానంలో.. నిజాం నవాబు నిషేధించిన ‘రైతు’ పుస్తక రచయిత ఎవరు?
1) జమలాపురం కేశవరావు
2) ఆదిరాజు వీరభద్రరావు
3) వెల్దుర్తి మాణిక్యరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 3
25. రాజకీయ సంస్కరణల్లో భాగంగా నిజాం నవాబు ‘అరవముద అయ్యంగార్ కమిషన్’ను ఏ సంవత్సరంలో నియమించారు?
1) 1932
2) 1942
3) 1952
4) 1938
- View Answer
- సమాధానం: 1
26. 1904లో తెలంగాణ ప్రాంతంలో ‘శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం’ను ఎక్కడ స్థాపించారు?
1) హైదరాబాద్
2) మహబూబ్ నగర్
3) హన్మకొండ
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
27. హైదరాబాద్లో ‘ఉస్మానియా విశ్వవిద్యాలయం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1918
2) 1935
3) 1937
4) 1920
- View Answer
- సమాధానం: 1
28.హైదరాబాద్లో ‘శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1920
2) 1901
3) 1904
4) 1916
- View Answer
- సమాధానం: 2
29. తెలుగు భాషాభివృద్ధి, తెలుగు చరిత్ర పరిశోధనకు ఉద్దేశించిన ‘విజ్ఞాన చంద్రికా మండలి’ని హైదరాబాద్ నగరంలో ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1901
2) 1904
3) 1906
4) 1940
- View Answer
- సమాధానం: 3
30. ‘తెలంగాణ’ పత్రిక స్థాపకుడు ఎవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) బుక్కపట్నం రామానుజాచార్యులు
3) మాడపాటి హన్మంతరావు
4) వద్దిరాజు సీతారామచంద్రరావు
- View Answer
- సమాధానం: 2
31. ‘నీలగిరి’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది?
1) మాడపాటి హన్మంతరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) సబ్నవీసు వెంకటరామ నరసింహరావు
4) వద్దిరాజు సీతారామచంద్రరావు
- View Answer
- సమాధానం: 3
32. ‘తెలుగు పత్రిక’ ఎవరి సంపాదకత్వంలో వెలువడింది?
1) వద్దిరాజు సీతారామచంద్రరావు
2) మాడపాటి హన్మంతరావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) వెల్దుర్తి మాణిక్యరావు
- View Answer
- సమాధానం: 1
33. 1951లో హైదరాబాద్ నగర పురపాలక సంఘానికి ‘ప్రథమ మేయర్గా’ ఎవరు ఎన్నికయ్యారు?
1) కొండా వెంకట రంగారెడ్డి
2) మాడపాటి హన్మంతరావు
3) రాయ్ కిషన్ బారిస్టర్
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 2
34. 1955లో ‘పద్మభూషణ్’ బిరుదు అందుకున్న ప్రప్రథమ తెలుగువారెవరు?
1) ఆరుట్ల రామచంద్రారెడ్డి
2) ఆదిరాజు వీరభద్రరావు
3) మాడపాటి హన్మంతరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 3
35. ‘ప్రజామిత్ర’ పత్రికా సంపాదకులు ఎవరు?
1) రావి నారాయణ రెడ్డి
2) రామానంద తీర్థ
3) బుక్కపట్నం రామానుజాచార్యులు
4) గూడవల్లి రామబ్రహ్మం
- View Answer
- సమాధానం: 4
36. కింద పేర్కొన్న వారిలో 1935లో కరీంనగర్ జిల్లాలోని ‘సిరిసిల్ల’లో నిర్వహించిన ‘ఆంధ్ర మహిళాసభ’కు ఎవరు అధ్యక్షత వహించారు?
1) మాడపాటి అన్నపూర్ణమ్మ
2) దుర్గాబాయి దేశ్ముఖ్
3) మాడపాటి మాణిక్యమ్మ
4) ఉన్నవ లక్ష్మీబాయమ్మ
- View Answer
- సమాధానం: 3
37. ‘నిజాం రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు’ గ్రంథ రచయిత ఎవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) కొండా వెంకట రంగారెడ్డి
3) ఆదిరాజు వీరభద్రరావు
4) మాడపాటి హన్మంతరావు
- View Answer
- సమాధానం: 4
38. హైదరాబాద్ నగరానికి మొట్టమొదటి ‘కొత్వాల్ (పోలీస్ కమిషనర్)’గా నియమితులైన తెలంగాణ ప్రముఖులెవరు?
1) మాడపాటి హన్మంత రావు
2) రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి
3) ఆరుట్ల రామచంద్రారెడ్డి
4) కొండా వెంకట రంగారావు
- View Answer
- సమాధానం: 2
39. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఏ నిజాం నవాబు కాలంలో ‘హైదరాబాద్ నగర కొత్వాల్’గా నియమితులయ్యారు?
1) సికిందర్ జా
2) నాసిరుద్దౌలా
3) మహబూబ్ అలీ పాషా
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
40. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఏ జిల్లాకు చెందినవారు?
1) కరీంనగర్
2) మెదక్
3) వరంగల్
4) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: 4
41. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డికి ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ గౌరవ బిరుదును ఏ సంవత్సరంలో ఇచ్చారు?
1) 1931
2) 1921
3) 1925
4) 1952
- View Answer
- సమాధానం: 1
42. రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి హైదరాబాద్లో ‘రెడ్డి హాస్టల్’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1925
2) 1920
3) 1930
4) 1918
- View Answer
- సమాధానం: 4
43. ‘సర్ఫేఖాస్’ అంటే ఏమిటి?
1) బహుమతులు
2) బంగారు నాణేలు
3) నిజాం నవాబు సొంత ఖర్చుల కోసం సేద్యం చేసే భూమలు
4) ఉన్నత న్యాయస్థానం
- View Answer
- సమాధానం: 3
44. 1952లో హైదరాబాద్ సంస్థానంలో ఎవరి నాయకత్వంలో ప్రథమ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు?
1) కొండా వెంకట రంగారెడ్డి
2) మర్రి చెన్నారెడ్డి
3) బూర్గుల రామకృష్ణారావు
4) స్వామీ రామానంద తీర్థ
- View Answer
- సమాధానం: 3
45. 1916లో ‘హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్’ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) వామన్ నాయక్
3) మాడపాటి హన్మంతరావు
4) కొండా వెంకట రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 2
46. 1931లో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన రెండో ఆంధ్ర మహాసభను ఎక్కడ నిర్వహించారు?
1) కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
2) దేవరకొండ, నల్లగొండ జిల్లా
3) హన్మకొండ, వరంగల్ జిల్లా
4) వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లా
- View Answer
- సమాధానం: 2
47.బూర్గుల రామకృష్ణారావు రచించిన వివిధ వ్యాసాలను ఏ సంస్థ ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో గ్రంథంగా ప్రచురించింది?
1) ఆంధ్ర సారస్వత పరిషత్తు
2) దేశోద్ధారక గ్రంథ మండలి
3) శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
4) విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి
- View Answer
- సమాధానం: 1
48.ఎన్నో ఆంధ్ర మహాసభలో ‘గస్తీ నిషాన్ తిర్టన్ సర్క్యూలర్ నంబరు 53’ని ఉపసంహరించాల్సిందిగా నిజాం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు?
1) 2
2) 4
3) 1
4) 6
- View Answer
- సమాధానం: 1
49. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో ‘నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభ’ను ఎవరి అధ్యక్షతన నిర్వహించారు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) బూర్గుల రామకృష్ణారావు
3) మాడపాటి హన్మంతరావు
4) రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి
- View Answer
- సమాధానం: 1