మాదిరి ప్రశ్నలు - 2
1. 1931లో ‘భాగ్యనగర్’ పత్రికను ఎవరు స్థాపించారు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) ఎం.ఎల్. ఆదయ్య
3) బందెల చిత్తారయ్య
4) వి.ఎస్. వెంకట్రావు
- View Answer
- సమాధానం: 1
2. దళితోద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) ఎం.ఎల్. ఆదయ్య ‘ఆది హిందూ మహాసభ’ను స్థాపించారు
2) బి.ఎస్. వెంకట్రావు ‘ఆది హిందూ లైబ్రరీ’ని స్థాపించారు
3) 1930 నవంబర్ 16న అలహాబాద్‌లో ‘అఖిల భారత ఆది హిందూ సదస్సు’ నిర్వహించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. అరుంధతీయుల్లో జాంబవర్ణ చైతన్యం తీసుకురావడానికి సేవా సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1837
2) 1835
3) 1839
4) 1834
- View Answer
- సమాధానం: 1
4. 1937 డిసెంబర్ నుంచి ‘భాగ్యనగర్’ పత్రిక పేరు ఏవిధంగా మారింది?
1) ది పంచమ
2) రిసాలతబ్బి
3) ఆది హిందూ
4) శేద్యచంద్రిక
- View Answer
- సమాధానం: 3
5. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) గుంటిమల్ల రామప్ప
3) ఎం.ఎల్. ఆదయ్య
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 4
6.‘అరుంధతీయ మహాసభ’ను ఏర్పాటు చేసినవారెవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) ఎస్.ఆర్. బాబయ్య
3) ఎం.ఎల్. ఆదయ్య
4) అరిగె రామస్వామి
- View Answer
- సమాధానం: 2
7.‘అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్’ గ్రంథ రచయిత ఎవరు?
1) పి.ఆర్. వెంకటస్వామి
2) బి.ఎస్. వెంకట్రావు
3) రాజారామ్ భోలే
4) ఎస్.ఆర్. బాబయ్య
- View Answer
- సమాధానం: 1
8.1936లో ‘అంబేడ్కర్ యూత్ లీగ్’ను ఏర్పాటు చేసినవారెవరు?
1) పి.ఆర్. వెంకటస్వామి
2) బి.ఎస్. వెంకట్రావు
3) రాజారామ్ భోలే
4) ఎస్.ఆర్. బాబయ్య
- View Answer
- సమాధానం: 1
9. 1916లో ఇంటిపనివారి కోసం శబరి సంఘాన్ని స్థాపించినవారెవరు?
1) రాజారామ్ భోలే
2) బి.ఎస్. వెంకట్రావు
3) రామ్‌సింగ్ పాకీ
4) పీసరి వీరన్న
- View Answer
- సమాధానం: 3
10. 1937లో హైదరాబాద్ పర్యటన సందర్భంగా గాంధీజీ ఉపయోగించిన ‘హరిజన’ పదాన్ని వ్యతిరేకించింది ఎవరు?
1) రాజారామ్ భోలే
2) బి.ఎస్. వెంకట్రావు
3) రామ్‌సింగ్ పాకీ
4) పీసరి వీరన్న
- View Answer
- సమాధానం: 4
11. భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో మరణించారు?
1) 1939
2) 1940
3) 1938
4) 1941
- View Answer
- సమాధానం: 1
12. ‘దే బర్న్’ (They Burn) గ్రంథ రచయిత ఎవరు?
1) టి.వి. నారాయణ
2) తక్కెళ్ల వెంకయ్య
3) శ్యాంసుందర్
4) రామ్‌సింగ్ పాకీ
- View Answer
- సమాధానం: 3
13. ఐక్యరాజ్య సమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించినవారెవరు?
1) పి.ఆర్. వెంకటస్వామి
2) నారాయణ గోవింద వెల్లింకర్
3) టి.వి. నారాయణ
4) శ్యాంసుందర్
- View Answer
- సమాధానం: 4
14. కింద పేర్కొన్న వారిలో రెండో ప్రపంచ యుద్ధంలో ‘యుద్ధ సహాయకుడు’ (Base worker)గా పాల్గొని యూరప్ వెళ్లొచ్చిన వారెవరు?
1) తక్కెళ్ల వెంకయ్య
2) పీసరి వీరన్న
3) గుంటిమల్ల రామప్ప
4) సుబేదార్ సాయన్న
- View Answer
- సమాధానం: 1
15. హైదరాబాద్‌లో బ్రహ్మసమాజ వ్యాప్తికి విశేషంగా కృషి చేసింది ఎవరు?
1) సరోజినీ నాయుడు
2) ఎ.ఆర్. ముకుందస్వామి
3) బి. రామయ్య
4) నారాయణ గోవింద వెల్లింకర్
- View Answer
- సమాధానం: 4
16. హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం మొదటి సమావేశాన్ని ఏ తేదీన నిర్వహించారు?
1) 21-10-1914
2) 20-09-1914
3) 21-10-1915
4) 20-10-1911
- View Answer
- సమాధానం: 2
17. హైదరాబాద్‌లో ‘దివ్యజ్ఞాన సభ’ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1904
2) 1907
3) 1906
4) 1905
- View Answer
- సమాధానం: 3
18. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మసమాజం కంటే ఆర్యసమాజం అధిక ప్రభావం చూపింది
2) ఆర్యసమాజం బోధకులైన పండిట్ బాలకృష్ణశర్మ, నిత్యానందను 1834 లో రాజ్య బహిష్కరణ చేశారు
3) ఆర్యసమాజం హిందూమతంలో సంస్కరణలకు కృషి చేసింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19. హైదరాబాద్‌లో ‘రెడ్డి హాస్టల్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1920
2) 1918
3) 1919
4) 1921
- View Answer
- సమాధానం: 2
20. 1925లో ఎవరి అధ్యక్షతన ‘ముదిరాజ్ మహాసభ’ను ఏర్పాటు చేశారు?
1) చిరాగు వీరన్న
2) బి. వెంకట్రావు
3) నవాడ ముత్తయ్య
4) జి. రామకృష్ణయ్య
- View Answer
- సమాధానం: 4
21. కింద పేర్కొన్నవారిలో గౌడ కులస్థుల కోసం హాస్టల్‌ను ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి పాటుపడింది ఎవరు?
1) జి. రామకృష్ణయ్య
2) మాటేటి పాపయ్య
3) చిరాగు వీరన్న
4) జనపాల రఘురాం
- View Answer
- సమాధానం: 3
22. హైదరాబాద్‌లో ‘అఖిల భారత పద్మశాలి సభ’ను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1929
2) 1930
3) 1931
4) 1928
- View Answer
- సమాధానం: 1
23.నిజాం ప్రభుత్వం విధించిన ‘మొహతర్వా’ మగ్గం పన్నును వ్యతిరేకించినవారెవరు?
1) జి. రామకృష్ణయ్య
2) మాటేటి పాపయ్య
3) చిరాగు వీరన్న
4) జనపాల రఘురాం
- View Answer
- సమాధానం: 2
24. మాటేటి పాపయ్య రాసిన ‘మొహతర్వా’ పుస్తకం ఏ కులస్థుల్లో చైతన్యం కలిగించింది?
1) గౌడ
2) పద్మశాలి
3) నాయీబ్రాహ్మణ
4) వడ్డెర
- View Answer
- సమాధానం: 2
25. నాయీబ్రాహ్మణుల్లో చైతన్యం కలిగించిన హైదరాబాద్ నాయిసభ కార్యదర్శి ఎవరు?
1) జి. రామకృష్ణయ్య
2) మాటేటి పాపయ్య
3) చిరాగు వీరన్న
4) జనపాల రఘురాం
- View Answer
- సమాధానం: 4
26. 1931లో ఫతే దర్వాజలో కింద పేర్కొన్న ఏ కులస్థుల మహాసభ నిర్వహించారు?
1) గౌడ
2) సగర
3) వడ్డెర
4) నాయీబ్రాహ్మణ
- View Answer
- సమాధానం: 2
27. కింది వాటిలో ఎరుకలవారి అభ్యున్నతికి కృషి చేసిన సంస్థ ఏది?
1) దక్కన్ మానవ సేవా సమితి
2) ఆంధ్ర సోదరి
3) అరుంధతీయ మహాసభ
4) జగన్మిత్రమండలి
- View Answer
- సమాధానం: 1
28. ‘నిజాం రాష్ట్రాంధ్ర మున్నూరు కాపు మహాసభ’ను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1933
2) 1930
3) 1935
4) 1937
- View Answer
- సమాధానం: 3
29. ‘మున్నూరు కాపు కులాభ్యుదయం’ గ్రంథ రచయిత ఎవరు?
1) సింగంశెట్టి సాంబయ్య
2) శ్రీపతి రంగయ్య
3) బొజ్జం నర్సింహులు
4) గిరి పెంటయ్య
- View Answer
- సమాధానం: 3
30. 1939లో వైశ్యుల కోసం హాస్టల్‌ను, వైశ్య యువజన సంఘాన్ని స్థాపించినవారెవరు?
1) కె.సి. గుప్తా
2) వనం వెంకటేశ్వరరావు
3) గంగరాజు రఘునాథరావు
4) శ్రీపతి రంగయ్య
- View Answer
- సమాధానం: 1
31. అఖిల భారత ‘ఖత్రీ’ మహాసభను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1942
2) 1943
3) 1945
4) 1947
- View Answer
- సమాధానం: 3
32. 1945లో ‘సుతారి సంఘం’ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?
1) సికింద్రాబాద్
2) సూర్యాపేట
3) నల్లగొండ
4) సిరిసిల్ల
- View Answer
- సమాధానం: 2
33.వితంతువులకు హాస్టళ్లను ఏర్పాటు చేసి, వారి కోసం సాహిత్యం ద్వారా ప్రచారం చేసినవారెవరు?
1) సుశీలాదేవి
2) ఎస్. సుందరీబాయి
3) పందిటి సత్యవతిబాయి
4) రూప్ఖాన్పేట రత్నాంబ దేశాయి
- View Answer
- సమాధానం: 4
34. 1917లో ‘ఆంధ్ర సోదరి సంఘం’ను ఎవరు స్థాపించారు?
1) రత్నాంబ దేశాయి, నడింపల్లి సుందరమ్మ
2) పందిటి వీరరాఘవమ్మ, రత్నాంబ దేశాయి
3) పందిటి వీరరాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ
4) రత్నాంబ దేశాయి, పద్మజానాయుడు
- View Answer
- సమాధానం: 3
35. 1922లో ఎవరి ప్రోత్సాహంతో ‘ది ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్ మెంట్’ సంస్థను ఏర్పాటు చేశారు?
1) సంగెం లక్ష్మీబాయమ్మ
2) మార్గరెట్ కజిన్స్
3) ఈశ్వరీబాయి
4) టి.ఎస్. సదాలక్ష్మి
- View Answer
- సమాధానం: 2
36. ‘ఆంధ్ర మహిళా సంఘం’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1942
2) 1935
3) 1940
4) 1930
- View Answer
- సమాధానం: 4
37. గిరిజన చైతన్యానికి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1) కొమరం భీం కంటే ముందే రాంజీగోండ్ గిరిజనుల్లో చైతన్యం కలిగించారు
2) సిరాజుల్ హసన్ తిర్మయిజీ అనే పత్రికా సంపాదకుడు కొమరం భీం పోరాటానికి మద్దతు ఇచ్చారు
3) కొమరం భీం మరణానంతరం నిజాం.. ‘హైమన్ డార్ఫ్’తో గిరిజనుల గురించి అధ్యయనం చేయించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
38.1860లో నిర్మల్‌లో గిరిజనులు ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు?
1) కొమరం భీం
2) అజ్మత్ జంగ్
3) మిర్దాచంద్
4) రాంజీగోండ్
- View Answer
- సమాధానం: 4
39. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయోద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన చిదాఖాన్ను అరెస్టు చేశారు
2) తుర్రేబాజ్‌ఖాన్‌ను బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు
3) మౌల్వీ అల్లా ఉద్దీన్‌కు జీవితఖైదు విధించి, అండమాన్ జైలుకు తరలించగా అతడు 1884లో అక్కడే మరణించాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
40. ఆధునికతను స్వాగతించిన తొలి హైదరాబాద్ ముస్లిం వైతాళికుడు ఎవరు?
1) ముబారిజ్ ఉద్దౌలా
2) మౌల్వీ విలాయత్ అలీ
3) సయ్యద్ అహ్మద్ రేహి
4) షామ్స్ ఉల్ ఉమ్రా
- View Answer
- సమాధానం: 4
41. షామ్స్ ఉల్ ఉమ్రాకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1) 1829లో ‘మదరసా’ను ప్రారంభించాడు
2) 1834లో ట్రాన్సలేషన్ బ్యూరోను, ప్రెస్‌ను ప్రారంభించాడు
3) వైద్య ఇంజనీరింగ్‌కు సంబంధించిన అనేక గ్రంథాలను ఉర్దూ, పర్షియన్ భాషల్లో ప్రచురించాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42. ఉత్తర భారతదేశంలో వహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
1) ముబారిజ్ ఉద్దౌలా
2) మౌల్వీ విలాయత్ అలీ
3) సయ్యద్ అహ్మద్ దెహిల్వి
4) షామ్స్ ఉల్ ఉమ్రా
- View Answer
- సమాధానం: 3
43. హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి కేంద్రబిందువుగా ఎవరిని పేర్కొంటారు?
1) ముబారిజ్ ఉద్దౌలా
2) మౌల్వీ విలాయత్ అలీ
3) సయ్యద్ అహ్మద్ దెహిల్వి
4) షామ్స్ ఉల్ ఉమ్రా
- View Answer
- సమాధానం: 1
44. తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడిగా చరిత్రకారులు ఎవరిని పేర్కొన్నారు?
1) ముబారిజ్ ఉద్దౌలా
2) మౌల్వీ విలాయత్ అలీ
3) సయ్యద్ అహ్మద్ దెహిల్వి
4) షామ్స్ ఉల్ ఉమ్రా
- View Answer
- సమాధానం: 1
45. ముబారిజ్ ఉద్దౌలా ఏ సంవత్సరంలో మరణించాడు?
1) 1856
2) 1854
3) 1852
4) 1857
- View Answer
- సమాధానం: 2