కుతుబ్‌షాహీ యుగం - 2
1. తొలి అచ్చ తెలుగు నిరోష్ట్య రచన ఏది?
1) సీతాకల్యాణం
2) దశరథ రాజనందన చరిత
3) సుగ్రీవ విజయం
4) ప్రభుదేవర వాక్యం
- View Answer
- సమాధానం: 1
2. తెలుగు సాహిత్యంలో తొలి చతురర్థి రచన?
1) నలరాఘవయాదవ పాండవీయం
2) దశరథ రాజనందన చరిత
3) సుగ్రీవ విజయం
4) ప్రభుదేవర వాక్యం
- View Answer
- సమాధానం: 1
3. తెలుగు సాహిత్యంలో తొలి నిరోష్ట్య, అచ్చ తెలుగు నిరోష్ట్య, త్య్రర్థి, చతురర్థి రచనలు చేసినవారు?
1) మరింగంటి సింగరాచార్యులు
2) కందుకూరి రుద్రకవి
3) పోశెట్టి లింగకవి
4) పొన్నెగంటి తెలగన
- View Answer
- సమాధానం: 1
4. తెలుగు సాహిత్యంలో ‘తిరునామ రచన’కు ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) సిద్ధరామకవి
2) పోశెట్టి లింగకవి
3) కందుకూరి రుద్రకవి
4) మరింగంటి సింగరాచార్యులు
- View Answer
- సమాధానం: 4
5. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ రచయిత?
1) అద్దంకి గంగాధరుడు
2) పొన్నెగంటి తెలగన
3) సిద్ధరామకవి
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 1
6. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ఎవరికి అంకితం ఇచ్చారు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) జంషీద్ కుతుబ్‌షా
3) తానీషా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
7. మల్కిభరాముడి ప్రేమకథగా పేర్కొనే కావ్యం ఏది?
1) తపతీ సంవరణోపాఖ్యానం
2) దశరథ రాజనందన చరిత
3) సుగ్రీవ విజయం
4) ప్రభుదేవర వాక్యం
- View Answer
- సమాధానం: 1
8. రామరాజభూషణుడితో పోల్చదగిన ప్రతిభావంతుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) సిద్ధరామకవి
2) కందుకూరి రుద్రకవి
3) పోశెట్టి లింగకవి
4) అద్దంకి గంగాధరుడు
- View Answer
- సమాధానం: 4
9. ‘ప్రభుదేవర వాక్యం’ అనే వేదాంత వచన గ్రంథ రచయిత?
1) సిద్ధరామకవి
2) తానీషా
3) పోశెట్టి లింగకవి
4) పొన్నెగంటి తెలగన
- View Answer
- సమాధానం: 1
10. ‘స్తుతివచన’ ప్రక్రియకు ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) సిద్ధరామకవి
2) కృష్ణమాచార్య
3) గంగాధరయ్య
4) అప్పలాచార్యులు
- View Answer
- సమాధానం: 2
11. ‘శివస్తుతి’ వచనాలకు ఆద్యుడు ఎవరు?
1) కాసె సర్వప్ప
2) కృష్ణమాచార్యులు
3) గంగాధరయ్య
4) అప్పలాచార్యులు
- View Answer
- సమాధానం: 3
12. ‘శ్రీ రంగనాథ విలాసం’ గ్రంథ రచయిత?
1) మరింగంటి సింగరాచార్యులు
2) మరింగంటి జగన్నాథాచార్యులు
3) కృష్ణమాచార్యులు
4) అప్పలాచార్యులు
- View Answer
- సమాధానం: 2
13. ఇబ్రహీం కుతుబ్‌షా నుంచి ‘రెంటచింతల’ను అగ్రహారంగా పొందిన కవి?
1) సిద్ధరామకవి
2) కందుకూరి రుద్రకవి
3) పోశెట్టి లింగకవి
4) పొన్నెగంటి తెలగన
- View Answer
- సమాధానం: 2
14. ‘సుగ్రీవ విజయం’ గ్రంథ రచయిత?
1) సిద్ధరామకవి
2) కందుకూరి రుద్రకవి
3) పోశెట్టి లింగకవి
4) పొన్నెగంటి తెలగన
- View Answer
- సమాధానం: 2
15. తొలి తెలుగు యక్షగానం ఏది?
1) సీతాకల్యాణం
2) దశరథ రాజనందన చరిత
3) సుగ్రీవ విజయం
4) ప్రభుదేవర వాక్యం
- View Answer
- సమాధానం: 3
16. ‘గువ్వలచెన్నని శతకం’ రాసింది ఎవరు?
1) అద్దంకి గంగాధరుడు
2) పోశెట్టి లింగకవి
3) కందుకూరి రుద్రకవి
4) చరిగొండ ధర్మన్న
- View Answer
- సమాధానం: 3
17. ‘నిరంకుశోపాఖ్యానం’ రచయిత?
1) అద్దంకి గంగాధరుడు
2) పోశెట్టి లింగకవి
3) చరిగొండ ధర్మన్న
4) కందుకూరి రుద్రకవి
- View Answer
- సమాధానం: 4
18. ‘నిరంకుశుడు’ పాత్ర ఉన్న కావ్యం ఏది?
1) నిరంకుశోపాఖ్యానం
2) సుగ్రీవ విజయం
3) ప్రభుదేవర వాక్యం
4) వైజయంతీ విజయం
- View Answer
- సమాధానం: 1
19. కింది వాటిలో శృంగార ప్రధానమైన సాంఘిక కావ్యం ఏది?
1) నిరంకుశోపాఖ్యానం
2) సుగ్రీవ విజయం
3) ప్రభుదేవర వాక్యం
4) వైజయంతీ విజయం
- View Answer
- సమాధానం: 1
20. కింది వాటిలో కందుకూరి రుద్రకవి రచన కానిది?
1) జనార్దనాష్టకం
2) బలవదరీ శతకం
3) శ్రీరంగనాథ విలాసం
4) నిరంకుశోపాఖ్యానం
- View Answer
- సమాధానం: 3
21. తొలి అచ్చ తెలుగు కావ్యకర్త ఎవరు?
1) సిద్ధరామకవి
2) కందుకూరి రుద్రకవి
3) పోశెట్టి లింగకవి
4) పొన్నెగంటి తెలగన
- View Answer
- సమాధానం: 4
22.పటాన్చెరువు ఏ కవి నివాస ప్రాంతం?
1) పొన్నెగంటి తెలగన
2) కందుకూరి రుద్రకవి
3) పోశెట్టి లింగకవి
4) సిద్ధరామకవి
- View Answer
- సమాధానం: 1
23. పొన్నెగంటి తెలగన కవిని ఆదరించిన పాలకుడు?
1) అమీన్‌ఖాన్
2) తానీషా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
24. మహమ్మద్ కులీ కుతుబ్‌షాకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) మీర్జా మహమ్మద్ అమీన్, ముల్లా మూమీన్ మిసాక్ సుబాజ్వలి అనే పార్సీ కవులను ఆదరించాడు
2) వజాహీ, గవాసీ అనే ఉర్దూ కవులకు ఆశ్రయం ఇచ్చాడు
3) ఫారసీ కవి ‘అలామా మీర్ మొమీన్’కు పీష్వా పదవి ఇచ్చాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
25. మహమ్మద్ కులీ కుతుబ్‌షాకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) పటమట సోమయాజీ, నేబతి కృష్ణమంత్రి ఇతడి ఆస్థాన కవులుగా ఉన్నారు
2) సారంగు తమ్మయ్య, కామారెడ్డిని సన్మానించాడు
3) గణేశ పండితుడు ఇతడి ఆస్థానంలో ఉన్నాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. తొలి ఉర్దూ రాజకవి ఎవరు?
1) హుమాయూన్
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) అహ్మద్‌షా
4) మొదటి మహమ్మద్‌షా
27.కవిత్వంలో లౌకిక భావనను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) జంషీద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
28. ఏ సుల్తాన్ కవితలు ‘దివాన్’ పేరుతో వెలువడ్డాయి?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
29. మహమ్మద్ కులీ కుతుబ్‌షా కవితల సంకలనాన్ని ‘దివాన్’ పేరుతో వెలువరించినవారు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) మహమ్మద్ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) జంషీద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
30. తెలుగు పదాలు, ఆచార వ్యవహారాలు, బతుకమ్మ, హోళీ పండగల ప్రస్తావన ఎవరి కవితల్లో కనిపిస్తుంది?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) జంషీద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
31.పర్షియన్-భారతీయ సంస్కృతులు, మతాల సమ్మేళనం ఎవరి కవిత్వంలో కనిపిస్తుంది?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) జంషీద్ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
32.గోల్కొండకు ‘కరణీకం’ చేస్తూనే మరోవంక కలం పట్టి కావ్య రచన చేసినవారు?
1) నేబతి కృష్ణమంత్రి
2) సురభి మాధవరాయలు
3) సారంగు తమ్మయ్య
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 3
33. మొహర్రం పండగను ప్రవేశపెట్టిన సుల్తాన్?
1) కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్‌హసన్
3) షాజహాన్
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
34. తెలుగువారి దీపావళి పండగలో వెలిగించే దీపాలను అనుసరించి కుతుబ్‌షాహీ కాలంనాటి ముస్లిం ప్రజలు తమ ఏ పండగలో దీపాలను వెలిగించుకునేవారు?
1) షబ్ ఎ రాత్
2) మొహర్రం
3) రంజాన్
4) బక్రీద్
- View Answer
- సమాధానం: 1
35. కుతుబ్‌షాహీ కాలంనాటి ముస్లిం ప్రజల సంప్రదాయాల్లో కనిపించే ‘మంగ్నా’ అంటే?
1) పీర్ల పండగ
2) పెళ్లిరోజు వేడుక
3) నిశ్చితార్థం
4) దర్గాకు వెళ్లడం
- View Answer
- సమాధానం: 3
36.చిత్రకళలో దక్కన్ శైలి సృష్టికర్త?
1) మీర్ మొమీన్
2) గవాసీ
3) మీర్హసీం
4) తబీయ
- View Answer
- సమాధానం: 3
37. ఏ సుల్తాన్.. యుద్ధ, ప్రయాణ సమయాల్ల్లో కవి పండితులను వెంట తీసుకెళ్లేవాడు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) అబుల్ హసన్ తానీషా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
38. ‘తారిఖ్ కుతుబ్‌షాహీ’ గ్రంథ రచయిత?
1) జమాఖాసీబేగ్
2) మహమూద్ షిరాజీ
3) కుర్షాబిన్ కబ్బాదుల్ హుసేన్
4) అమీర్ ఇమారుద్దీన్
- View Answer
- సమాధానం: 3
39. ఏ సుల్తాన్ అనేక మంది కవి పండితులను పోషించాడు?
1) తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) కులీకుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
40. అద్దంకి గంగాధర కవి, మరింగంటి సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి తదితర తెలుగు కవులను పోషించిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
1) తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
41. కుతుబ్‌షాహీల కాలంలో మొదట కనిపించే కవి ఎవరు?
1) అద్దంకి గంగాధరుడు
2) పోశెట్టి లింగకవి
3) కందుకూరి రుద్రకవి
4) చరిగొండ ధర్మన్న
- View Answer
- సమాధానం: 4
42.చరిగొండ ధర్మన్న తన ‘చిత్రభారతం’ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
1) ఎనుముల పెద్దనామాత్యుడు
2) చితాబ్‌ఖాన్
3) ఇబ్రహీంకుతుబ్షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
43. చరిత్రకారులు ‘ప్రబంధ కవిత్వ మార్గదర్శకుడు’గా ఎవరిని పేర్కొంటున్నారు?
1) అద్దంకి గంగాధరుడు
2) మరింగంటి సింగరాచార్యులు
3) చరిగొండ ధర్మన్న
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 3
44. తెలుగులో తొలి కల్పిత కావ్యం ఏది?
1) నిరంకుశోపాఖ్యానం
2) సుగ్రీవ విజయం
3) ప్రభుదేవర వాక్యం
4) ధనాభిరామం
- View Answer
- సమాధానం: 4
45. తెలుగులో తొలి కల్పిత కావ్యాన్ని రాసింది ఎవరు?
1) నూతనకవి సూరన
2) మరింగంటి సింగరాచార్యులు
3) చరిగొండ ధర్మన్న
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 1
46. ‘నవచోళ చరిత్ర’ అనే ద్విపద కావ్య రచయిత ఎవరు?
1) సిద్ధరామకవి
2) పోశెట్టి లింగకవి
3) చరిగొండ ధర్మన్న
4) అద్దంకి గంగాధరుడు
- View Answer
- సమాధానం: 2
47. పోశెట్టి లింగకవి ప్రయోగించిన ‘కైకిలి’ అనే తెలంగాణ పదానికి అర్థం ఏమిటి?
1) కూలి
2) నెల కూలి
3) దినసరి కూలి
4) సంవత్సర కూలి
- View Answer
- సమాధానం: 3
48. కొండెంగ, మోటు, ఉరువడి, పుటిక, తునక అనే పదాలు ఎవరి కావ్యంలో కనిపిస్తాయి?
1) సిద్ధరామకవి
2) పోశెట్టి లింగకవి
3) చరిగొండ ధర్మన్న
4) అద్దంకి గంగాధరకవి
- View Answer
- సమాధానం: 2
49. ‘వైజయంతీ విలాసం’ అనే భక్తి, శృంగార కావ్య రచయిత ఎవరు?
1) సారంగు తమ్మయ
2) అద్దంకి గంగాధరుడు
3) సిద్ధరామకవి
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 1
50. తెలుగు సాహిత్యంలో తొలి నిరోష్ట్య రచన?
1) సీతాకల్యాణం
2) దశరథ రాజనందన చరిత
3) సుగ్రీవ విజయం
4) ప్రభుదేవర వాక్యం
- View Answer
- సమాధానం: 2
51. కింది వాటిలో భక్తి, శృంగారం మేళవించి ఉన్న రచన ఏది?
1) రాజనీతి రత్నాకరం
2) చంద్రాంగథ చరిత్ర
3) షట్చక్రవర్తి చరిత్ర
4) వైజయంతీ విలాసం
- View Answer
- సమాధానం: 4
52.కుతుబ్‌షాహీల కాలం నాటి రాజకీయ, సాహిత్య చరిత్రను అందించిన గ్రంథం?
1) వైజయంతీ విలాసం
2) చంద్రాంగథ చరిత్ర
3) షట్చక్రవర్తి చరిత్ర
4) రాజనీతి రత్నాకరం
- View Answer
- సమాధానం: 4
53. ‘రాజనీతి రత్నాకరం’ గ్రంథ రచయిత?
1) సారంగు తమ్మయ
2) రాజలింగకవి
3) నేబతి కృష్ణమంత్రి
4) పోశెట్టి లింగకవి
- View Answer
- సమాధానం: 3
54. నేబతి కృష్ణమంత్రి ఏ ప్రాంతానికి చెందినవారు?
1) సిద్ధలూరు
2) పటాన్ చెరువు
3) గోల్కొండ
4) నీలగిరి
- View Answer
- సమాధానం: 1