నీటి పారుదల సౌకర్యాలు
1. రాష్ట్రంలో ఎన్ని రకాల నీటి పారుదల సౌకర్యాలు ఉన్నాయి?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో వరంగల్ జిల్లాలో లేని చెరువు ఏది?
1) పాకాల చెరువు
2) లక్నవరం చెరువు
3) పోచారం చెరువు
4) రామప్ప చెరువు
- View Answer
- సమాధానం: 3
3. రాష్ట్రంలో స్థూల నీటి పారుదల వైశాల్యం అధికంగా ఉన్న జిల్లా?
1) రంగారెడ్డి
2) వరంగల్
3) కరీంనగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
4. రాష్ర్టంలో చెరువుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికం ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్
2) నిజామాబాద్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 4
5. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువను ఎవరు ప్రారంభించారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) లాల్‌బహదూర్ శాస్త్రి
3) ఇందిరాగాంధీ
4) సర్దార్ వల్లభాయ్ పటేల్
- View Answer
- సమాధానం: 3
6. భారతదేశంలో రెండో అతిపెద్ద రిజర్వాయర్ ఏది?
1) నాగార్జున సాగర్
2) ఇందిరా సాగర్
3) శ్రీరాం సాగర్
4) నిజాం సాగర్
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ ఏది?
1) జవహర్ కాలువ
2) సరస్వతి కాలువ
3) ఎన్.టి.ఆర్. కాలువ
4) నల్ల సోమనాద్రి కాలువ
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది?
1) జూరాలప్రాజెక్టు
2) డిండి ప్రాజెక్టు
3) కడెం ప్రాజెక్టు
4) శ్రీరాం సాగర్
- View Answer
- సమాధానం: 2
9. రాష్ర్టంలో కాలువల ద్వారా నికర నీటి పారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) రంగారెడ్డి
2) వరంగల్
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 3
10. ‘రుద్రమకోట ఎత్తిపోతల పథకం’ అని ఏ ప్రాజెక్టును పిలుస్తారు?
1) ఇందిరాసాగర్
2) నెట్టెంపాడు
3) అలీసాగర్
4) కడెం
- View Answer
- సమాధానం: 1
11. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) రంగారెడ్డి
3) వరంగల్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
12. అలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు?
1) కృష్ణా
2) ప్రాణహిత
3) గోదావరి
4) తుంగభద్ర
- View Answer
- సమాధానం: 3
13. కంతనపల్లి సుజల స్రవంతి పథకం ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) వరంగల్
3) ఖమ్మం
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
14. వరంగల్ జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే కాలువ ఏది?
1) జవహర్ కాలువ
2) ఎన్.టి.ఆర్. కాలువ
3) లక్ష్మీ కాలువ
4) కాకతీయ కాలువ
- View Answer
- సమాధానం: 4
15. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (స్టేజ్-1) వల్ల లబ్ధి పొందని జిల్లా?
1) ఆదిలాబాద్
2) మెదక్
3) కరీంనగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
16. నిజాంసాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) మంజీరా
2) గోదావరి
3) ప్రాణహిత
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 1
17. సింగూర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు?
1) నిజామాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
18. రాష్ట్రంలో బావుల ద్వారా జరిగే నీటిపారుదల స్థూల విస్తీర్ణం ఎంత?
1) 5 లక్షల హెక్టార్లు
2) 13 లక్షల హెక్టార్లు
3) 23 లక్షల హెక్టార్లు
4) 3 లక్షల హెక్టార్లు
- View Answer
- సమాధానం: 3
19. నీటిపారుదల సామర్థ్యం ఎన్ని హెక్టార్ల వరకు ఉండే ప్రాజెక్టును భారీ తరహా ప్రాజెక్టు అంటారు?
1) 5000 ఎకరాల లోపు
2) 10,000 ఎకరాల లోపు
3) 15,000 ఎకరాల లోపు
4) 25,000 ఎకరాల పైన
- View Answer
- సమాధానం: 4
20. ‘శ్రీపాద సాగర్’ అనే పేరు ఉన్న ప్రాజెక్టు ఏది?
1) ఎల్లంపల్లి ప్రాజెక్టు
2) కడెం ప్రాజెక్టు
3) సింగూర్ ప్రాజెక్టు
4) ఇందిరాసాగర్
- View Answer
- సమాధానం: 1
21. కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) రంగారెడ్డి
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 3
22. సాత్నాలా ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) ఖమ్మం
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 2
23. మోడికుంట వాగు ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో ఎక్కడ నిర్మిస్తున్నారు?
1) మల్లపురం
2) పాల్వంచ
3) కృష్ణాపురం
4) వైరా
- View Answer
- సమాధానం: 3
24. రాజోలి బండ మళ్లింపు పథకం ఏ నదిపై ఉంది?
1) కృష్ణానది
2) మంజీర
3) గోదావరి
4) తుంగభద్ర
- View Answer
- సమాధానం: 4
25. దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ఏ నదిపై ఉంది?
1) గోదావరి
2) ఇంద్రావతి
3) ప్రాణహిత
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 1
26. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏ ప్రదేశంలో నిర్మిస్తున్నారు?
1) కన్నెపల్లి
2) గంగారం
3) కల్వకుర్తి
4) తుమ్మిడిహట్టి
- View Answer
- సమాధానం: 2
27. ‘చోట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం’ ఏ జిల్లాలో ఉంది?
1) మెదక్
2) నిజామాబాద్
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
28. మూసీ నదిపై ఉస్మాన్ సాగర్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1908
2) 1927
3) 1947
4) 1920
- View Answer
- సమాధానం: 4
29. హిమాయత్ సాగర్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) మంజీరా
2) మూసీ
3) ఈసా
4) కృష్ణానది
- View Answer
- సమాధానం: 3
30. రాష్ట్ర నికర నీటి పారుదల విస్తీర్ణంలో బావుల వాటా ఎంత శాతం?
1) 74
2) 54
3) 15
4) 9
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో రాష్ట్రంలో నికర నీటిపారుదల వైశాల్యం అల్పంగా ఉన్న జిల్లా?
1) నల్లగొండ
2) రంగారెడ్డి
3) మెదక్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
32. రాష్ట్రంలో బావుల ద్వారా జరిగే నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా?
1) ఆదిలాబాద్
2) వరంగల్
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
33. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ఎంత శాతం విస్తీర్ణం కలిగి ఉంది?
1) 59
2) 69
3) 79
4) 89
- View Answer
- సమాధానం: 3
34. కింది వాటిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు జిల్లాలు ఏవి?
1) వరంగల్, ఖమ్మం
2) మహబూబ్‌నగర్, రంగారెడ్డి
3) నల్లగొండ, రంగారెడ్డి
4) ఖమ్మం, నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
35. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ‘వరద కాలువ పథకం’ వల్ల లబ్ధి పొందని జిల్లా ఏది?
1) వరంగల్
2) ఆదిలాబాద్
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 2
36. తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది?
1) లక్ష్మీ కాలువ
2) లాల్ బహదూర్ కాలువ
3) నల్ల సోమనాద్రి కాలువ
4) కాకతీయ కాలువ
- View Answer
- సమాధానం: 4
37. ‘రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం’ ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ
2) కరీంనగర్
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 3
38. ప్రాణహిత- చేవెళ్ల్ల సుజల స్రవంతి పథకాన్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు?
1) గోదావరి
2) చేవెళ్ల
3) ప్రాణహిత
4) మంజీర
- View Answer
- సమాధానం: 3
39. ‘అసిఫ్ నహర్ ప్రాజెక్టు’ను ఏ నదిపై నిర్మించారు?
1) మూసీ
2) భీమా
3) కృష్ణానది
4) డిండి
- View Answer
- సమాధానం: 1
40. నక్కల గండి ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే జిల్లాలు ఏవి?
1) ఖమ్మం, వరంగల్
2) నల్లగొండ, మహబూబ్‌నగర్
3) ఆదిలాబాద్, కరీంనగర్
4) నిజామాబాద్, మెదక్
- View Answer
- సమాధానం: 2
41. ‘మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం’ అని ఏ పథకాన్ని పిలుస్తారు?
1) పాలమూరు, రంగారెడ్డి
2) నక్కల గండి
3) కోయిల్ సాగర్
4) కల్వకుర్తి
- View Answer
- సమాధానం: 4
42. ‘అరుగుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం’ను ఏ నదిపై నిర్మిస్తున్నారు?
1) మంజీరా
2) డిండి
3) ప్రాణహిత
4) గోదావరి
- View Answer
- సమాధానం: 4
43. రాజీవ్ (లేదా) దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) ఖమ్మం
3) నల్లగొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2
44. కడెం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) నల్లగొండ
4) మెదక్
- View Answer
- సమాధానం: 1
45. నిజాంసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ పేరు?
1) ఫతే నహర్
2) మహబూబ్ నహర్
3) లక్ష్మీకాలువ
4) ఎన్.టి.ఆర్ కాలువ
- View Answer
- సమాధానం: 2
46. బొగ్గుల వాగు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) కరీంనగర్
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
47. కింది వాటిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందని ప్రాజెక్టు ఏది?
1) ఎన్.టి.ఆర్. సాగర్
2) రాలి వాగు ప్రాజెక్టు
3) రామడుగు ప్రాజెక్టు
4) వట్టి వాగు ప్రాజెక్టు
- View Answer
- సమాధానం: 3
48. సరళ సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) మహబూబ్‌నగర్
3) కరీంనగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
49. ముక్క మామిడి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) రంగారెడ్డి
3) ఖమ్మం
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 3
50. కింది వాటిలో సరికానిది ఏది?
1) గుండ్ల వాగు ప్రాజెక్టు - ఆదిలాబాద్
2) లంక సాగర్ ప్రాజెక్టు - ఖమ్మం
3) నల్ల వాగు ప్రాజెక్టు - మెదక్
4) కోటిపల్లి వాగు ప్రాజెక్టు - రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 1
51. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1955 డిసెంబర్ 10
2) 1963 జూలై26
3) 1959 నవంబర్ 11
4) 1961 జూన్ 16
- View Answer
- సమాధానం: 2
52. కింది వాటిలో రాష్ట్రంలో కాలువల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) మెదక్
3) రంగారెడ్డి
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 3
53. ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) చౌటుప్పల్
2) వరంగల్
3) గజ్వేల్
4) సదాశివనగర్
- View Answer
- సమాధానం: 4
54. ‘మేడిగడ్డ బ్యారేజీ’ని ఏ నదిపై నిర్మించనున్నారు?
1) ప్రాణహిత
2) పెన్‌గంగ
3) గోదావరి
4) ఇంద్రావతి
- View Answer
- సమాధానం: 3
55. రాష్ట్రంలో ‘చనఖా-కొరటా’ బ్యారేజీని ఏ నదిపై నిర్మించనున్నారు?
1) ప్రాణహిత
2) పెన్‌గంగా
3) గోదావరి
4) వార్థా
- View Answer
- సమాధానం: 2
56. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం ఏది?
1) మేడిగడ్డ
2) కాళేశ్వరం
3) తుమ్మిడిహట్టి
4) అన్నారం
- View Answer
- సమాధానం: 3
57. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించనున్నారు?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1