స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఈ కింది వానిలో రాజ్యాంగ బద్దం కానిదేది?
1. భారత రాజ్యాంగంలో ‘స్థానిక పాలన’ ఏ భాగంలో ఉంది?
1) రాజ్యాంగ ప్రవేశిక
2) ప్రాథమిక హక్కులు
3) ఆదేశిక సూత్రాలు
4) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగంలో ప్రారంభంలో స్థానిక పాలనను అందించటానికి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఆర్టికల్-40 తెలుపుతుంది. ఇది నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాల్లో అంతర్భాగంగా ఉంది. ఇవి న్యాయ సమ్మతం కాకపోవటంతో ప్రారంభంలో నిర్లక్ష్యానికి గురైంది. బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫార్సుతో 1959 అక్టోబరు 2న తొలిసారి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజస్థాన్‌లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా వీటికి రాజ్యాంగబద్దత కల్పించారు.
-
2. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్, భాగాలు(వరుసగా)?
1) 11, 12వ షెడ్యూల్స్, 9, 10 భాగాలు
2) 9, 10వ షెడ్యూల్స్, 11, 12 భాగాలు
3) 11, 12వ షెడ్యూల్స్ 9, 9ఎ భాగాలు
4) 9, 9ఎ షెడ్యూల్స్, 11, 12 భాగాలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 73వ రాజ్యాంగ సవరణ చట్టం(1992) ద్వారా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను 11వ షెడ్యూల్లో, 9వ భాగంలో చేర్చారు. అదే విధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా(1992) పట్టణ స్థానిక ప్రభుత్వాలను 12వ షెడ్యూల్లో, 9ఎ భాగంలో చేర్చారు. అదే విధ ంగా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను 243-243(O) అధికరణలో చేర్చగా, పట్టణ స్థానిక ప్రభుత్వాలను 243(K), 243(ZG)ల్లో పొందుపరిచారు.
-
3. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఈ కింది వానిలో రాజ్యాంగ బద్దం కానిదేది?
1) రాష్ర్ట ఎన్నికల సంఘం
2) రాష్ర్ట ఆర్థిక సంఘం
3) జిల్లా ప్రణాళిక సంఘం
4) రాష్ర్ట ప్రణాళిక సంఘం
- View Answer
- సమాధానం: 4
వివరణ: నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయటానికి అనేక రాజ్యాంగబద్ద సంస్థలను ఏర్పాటు చేశారు. అవి: సకాలంలో ఎన్నికల నిర్వహణకు 243(K) అధికరణ ప్రకారం రాష్ర్ట ఎన్నికల సంఘం. స్థానిక సంస్థలకు నిధులను అందించటానికి 243(I) అధికరణ ప్రకారం రాష్ర్ట ఆర్థిక సంఘం. అదే విధంగా జిల్లా స్థాయిలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల మధ్య వనరుల పంపిణీ, సమన్వయానికై 243(ZD)అధికరణ ద్వారా జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ర్ట ప్రణాళిక సంఘం గురించి ప్రస్తావన మాత్రం ఈ చట్టంలో లేదు.
-
4. ఏయే రాష్ట్రాల్లో ఏక అంచె పంచాయతీరాజ్ విధానం అమల్లో ఉంది?
1) జమ్మూ, కశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం
2) అస్సాం, త్రిపుర, పశ్చిమ బంగా
3) గోవా, సిక్కిం, మణిపూర్
4) జమ్మూ, కశ్మీర్, నాగాలాండ్, అస్సాం, గోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్థానిక పాలన అనేది రాష్ర్ట జాబితాల్లోని అంశం కాబట్టి పార్లమెంటు చట్టానికి (73వ రాజ్యాంగ సవరణ చట్టం) అనుగుణంగా ఆయా రాష్ట్రాలు వాటి స్థానిక అవసరాల మేరకు విభిన్న రకాల అంచెలను ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ విధంగా పంచాయతీరాజ్ అంచెలు ఉన్నాయి.
- ఏక అంచె గల రాష్ట్రాలు- జమ్మూ,కశ్మీర్, నాగాలాండ్, మేఘాలయా, మిజోరాం
- రెండు అంచెలు గల రాష్ట్రాలు- గోవా, సిక్కిం, మణిపూర్
- నాలుగంచెలు గల రాష్ట్రాలు - అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర
- ఈ వ్యవస్థ అమల్లో గల మిగిలిన రాష్ట్రాల్లో మూడు అంచెల వ్యవస్థ అమలులో ఉంది.
-
5. కింది వాటిలో ప్రత్యక్షంగా ఎన్నికయ్యేది ఎవరు?
1) మేయర్
2) జిల్లా పరిషత్ చైర్మన్
3) మండల పరిషత్ చైర్మన్
4) సర్పంచ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నూతన పంచాయతీరాజ్, నగర పాలక చట్టం ప్రకారం ఆయా వ్యవస్థలో ప్రత్యక్షంగా ఎన్నికయ్యే వారు, పరోక్షంగా ఎన్నికయ్యేవారు ఉంటారు.
ప్రజల ఓట్లతో ప్రత్యక్షంగా ఎన్నికయ్యేవారు- వార్డు-సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్స, కార్పొరేటర్స. ప్రజల ద్వారా పరోక్షంగా ఎన్నికయ్యేవారు- ఉపసర్పంచ్, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్,వైస్ చైర్మన్.
గ్రామంలో ప్రథమ పౌరుడైన గ్రామ సర్పంచ్ ను గ్రామంలో ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
-
6. పంచాయతీరాజ్ వ్యవస్థల అధ్యయనానికి ‘సామాజిక అభివృద్ధి, పంచాయతీరాజ్’ విధానంపై 1976లో నియమించిన కమిటీ చైర్మన్?
1) దయా చౌబే
2) ఆర్. కె. ఖన్నా
3) జి.ఆర్.రాజ్ గోపాల్
4) కె. సంతానం
- View Answer
- సమాధానం: 1
వివరణ: పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి అనేక అధ్యయన కమిటీలను వేశారు. అందులో 1976లో సామాజిక అభివృద్ధి, పంచాయతీరాజ్ విధానంపై దయాచౌబే కమిటీని వేశారు.
అదే విధంగా 1962లో న్యాయ పంచాయతీల అధ్యయానానికి జి.ఆర్.రాజ్‌గోపాల్ కమిటీని వేశారు. 1963లో పంచాయతీరాజ్ వ్యవస్థల ఆర్థిక అంశాలపై, 1965లో పంచాయతీరాజ్ వ్యవస్థల ఎన్నికల విధానంపై నియమించిన రెండు కమిటీలకు కె. సంతానం చైర్మన్‌గా ఉన్నారు. 1965లో పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్, ఆడిట్‌పై ఆర్.కె.ఖన్నా కమిటీని నియమించారు.
-
7. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏ వర్గాలకు తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కల్పించారు?
1) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనార్టీలు
2) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు
3) ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు
4) ఎస్సీ, ఎస్టీ, మహిళలు
- View Answer
- సమాధానం: 2
వివరణ: నూతన చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలకు, వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలకూ రిజర్వేషన్లు కల్పించారు. ప్రారంభంలో మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు మహిళలకు రిజర్వేషన్లను 50%కి పెంచారు. ఆర్టికల్ 243(D) ప్రకారం పంచాయతీ సంస్థల్లో పై వర్గాలకు రిజర్వేషన్లు కల్పించగా 243(T) ప్రకారం నగర పాలక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు.
-
8. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అంశాల మీద అధికారం కల్పించారు?
1) 19
2) 29
3) 28
4) 18
- View Answer
- సమాధానం: 2
వివరణ: 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలను పొందుపరిచి వీటికి 29 అంశాలపై అధికారం కల్పించారు. అవి - వ్యవసాయం, చేపల పెంపకం, భూ సంస్కరణలు, సామాజిక పర్యావరణం, చిన్న నీటి పారుదల, తాగునీరు, మొదలై నవి.
ఇందులో 12 అంశాలు ముఖ్యమైనవి అంటే డబ్బుతో సంబంధం లేకుండా తప్పకుండా నిర్వహించవలసినవి. మిగిలిన 17 అంశాలు ఐచ్ఛికమైనవి, అంటే స్థానిక సంస్థల వద్ద నిధుల మేరకు నిర్వహించేవి.
-
9. ఏదైనా మున్సిపాలిటీ జ నాభా ఎంతకు మించితే ప్రత్యేకంగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి?
1) లక్ష
2) 2 లక్షలు
3) 3 లక్షలు
4) 4లక్షలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-243() వార్డు కమిటీల గురించి తెలుపుతుంది. ఏదైనా మున్సిపాలిటీ జనాభా 3 లక్షలకు మించితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలుపుతుంది. ఒక్కో వార్డు కమిటీల్లో రెండు లేదా మూడు వార్డులు ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేయాలని చట్టం తెలుపుతుంది.
-
10. కింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అని దేన్ని అంటారు?
1) జిల్లా పరిషత్
2) మండల పరిషత్
3) గ్రామ పంచాయతీ
4) గ్రామసభ
- View Answer
- సమాధానం: 4
వివరణ: గ్రామ సభ సర్పంచ్ అధ్యక్షతన సమావేశమై గ్రామాభివృద్ధికి సంబంధించి అన్నీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో గ్రామంలో గల ఓటర్లందరూ సభ్యులే. గ్రామాభివృద్ధిలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్తులు అవుతున్నందున గ్రామసభను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అంటారు.
-
11. 73వ సవరణ చట్టం ద్వారా నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1992 ఏప్రిల్ 24
2) 1993 ఏప్రిల్ 24
3) 1992 జూన్ 1
4) 1993 జూన్ 1
- View Answer
- సమాధానం: 2
వివరణ: 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారాపంచాయతీరాజ్వ్యవస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించటానికి 1991 సెప్టెంబర్ 16న పార్లమెంట్లో పి.వి.నరసింహరావు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని 1992 డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించగా, 1993 ఏప్రిల్ 20న నాటి రాష్ర్టపతి శంకర్ దయాళ్ శర్మ సంతకంతో చట్టం అయింది. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఈ చట్టానికి అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక చట్టం చేయగా ఇది రాష్ర్టంలో 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.
-
12. కింది వాటిలో వివిధ ప్రభుత్వాలు స్థానిక సంస్థల బలోపేతానికి నియమించిన కమిటీలకు సంబంధించి సరైంది ఏది?
1) బల్వంత్రాయ్ మెహతా కమిటీ- ఇందిరా గాంధీ ప్రభుత్వం
2) అశోక్ మెహతా కమిటీ - చరణ్ సింగ్ ప్రభుత్వం
3) ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ-రాజీవ్ గాంధీ ప్రభుత్వం
4) జి.వి.కె.రావు కమిటీ - మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్థానిక సంస్థలకు సంబంధించి ‘ప్రజాస్వామ్యం అభివృద్ధి’ అనే అంశంపై 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్.ఎం.సింఘ్వీ కమిటీని నియమించింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించింది.
బల్వంత్రాయ్ మెహ తా కమిటీని నెహ్రు ప్రభుత్వం నియమించగా ఇది మూడంచెల పంచాయతీ వ్యవస్థను సూచించింది. అదే విధంగా అశోక్ మెహతా కమిటీని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించగా ఇది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది.
-
13. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది?
1) మద్రాస్
2) బొంబాయి
3) ఢిల్లీ
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతదేశంలో 1687 సంవత్సరంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ను మద్రాస్‌లో రెండో జేమ్స్ చక్రవర్తి అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. ఇది 1688 సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది.
తర్వాత 1726లో కలకత్తా, ముంబై మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి చార్టర్ చట్టం ద్వారా 1793లో పై వ్యవస్థలను చట్టబద్ధత కల్పించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
-
14. స్థానిక పాలన 7వ షెడ్యూల్లో ఏ జాబితాలో ఉంది?
1) కేంద్ర జాబితా
2) రాష్ర్ట జాబితా
3) ఉమ్మడి జాబితా
4) అవశిష్ట అంశం
- View Answer
- సమాధానం: 2
వివరణ: స్థానిక పాలన అనే ది భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రాష్ర్ట జాబితాలో 5వ అంశంగా ఉంది.
-
15. కింది వాటిలో పార్టీ రహితంగా ఎన్నికలు జరిగే వ్యవస్థలు?
1) గ్రామ పంచాయతీ
2) మండల పరిషత్
3) జిల్లా పరిషత్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీకి పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా మండల పరిషత్‌లకు పార్టీ సహితంగా ఎన్నికలు జరుగుతాయి.
గ్రామ పాలన వ్యవస్థ రాజకీయాలతో అస్థిరంగా ఉండకూడదనే ఉద్దేశంతో పార్టీ రహిత ఎన్నికలను ప్రతిపాదించారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ప్రతిపాదించదు, ఆయా పార్టీల గుర్తులను కేటాయించదు.
-