రాష్ర్టపతిగా పోటీచేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంత మంది ప్రతిపాదించాలి?
1. కింది వారిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్య నిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు?
1) రాష్ర్టపతి
2) ఉపరాష్ర్టపతి
3) గవర్నర్
4) లోక్‌సభ స్పీకర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగం 6వ భాగంలో ఉన్న 155వ అధికరణ ప్రకారం, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు, భారత రాష్ర్టపతి జారీచేసే కార్య నిర్వాహక ఉత్తర్వుల మేరకు గవర్నర్లను నియమిస్తారు. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతిని భారత పార్లమెంట్ ఎన్నుకుంటుంది. లోక్‌సభ స్పీకర్‌ను లోక్‌సభ సభ్యులు సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు.
- సమాధానం: 3
2. కింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ర్టపతికి ఇవ్వాలి?
1) రాష్ర్టపతి
2) గవర్నర్
3) లోక్‌సభ స్పీకర్
4) హైకోర్టు న్యాయమూర్తులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత రాజ్యాంగం అధికరణ 56(1)a ప్రకారం రాష్ర్టపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ర్టపతికి ఇవ్వాలి. రాష్ట్రాల గవర్నర్లు తన రాజీనామా పత్రాన్ని రాష్ర్టపతికి ఇవ్వాలి. లోక్‌సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు, హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ర్టపతికి ఇస్తారు.
- సమాధానం: 1
3. కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు?
1) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
2) రాష్ర్టపతి
3) ఉపరాష్ర్టపతి
4) గవర్నర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ర్టపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. వీరిని తొలగించడానికి పార్లమెంటు తీర్మానం అవసరం లేదు. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం.
- సమాధానం: 4
4. కింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు?
1) రాష్ర్టపతి
2) ఉపరాష్ర్టపతి
3) గవర్నర్
4) పై వారందరూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి రాష్ర్టపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి వారిది పరోక్ష ఎన్నిక. గవర్నర్‌ను ప్రజలు గాని, ప్రజా ప్రతినిధులు గాని ఎన్నుకోరు. కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ర్టపతి నియమిస్తారు.
- సమాధానం: 4
5. కింది వారిలో ఎవరి పదవీ కాలం రాష్ర్టపతి అభీష్టం మేరకు మాత్రమే ఉంటుంది?
1) ఉపరాష్ర్టపతి
2) ప్రధాన ఎన్నికల కమిషనర్
3) అటార్నీ జనరల్
4) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగం 76వ అధికరణ ప్రకారం అటార్ని జనరల్ పదవీ కాలం రాష్ర్టపతి అభీష్టం, సంతృప్తి మేరకు మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగం 67(a) అధికరణ ప్రకారం ఉపరాష్ర్టపతి పదవీ కాలం ఐదు సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 65 సంవత్సరాలు నిండే వరకు, ప్రధాన ఎన్నికల కమిషనర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటారు.
- సమాధానం: 3
6. కేంద్ర కార్య నిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు?
1) రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి
2) ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు
3) అటార్ని జనరల్
4) పై వారంద రూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగం 53వ అధికరణ ప్రకారం భారత రాష్ర్టపతి కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటారు. అంటే భారతదేశం పరిపాలన రాష్ట్రపతి పేరు మీద కొనసాగుతుంది. రాష్ట్రపతి మరణం, తొలగింపు, రాజీనామా వంటి సందర్భాలలో ఉపరాష్ర్టపతి 6 నెలల వరకు రాష్ర్టపతిగా కొనసాగవచ్చు (అధికరణ 65). కాబట్టి ఉపరాష్ర్టపతి కార్యనిర్వాహక శాఖలో భాగం. రాజ్యాంగంలోని 74(1) అధికరణ ప్రకారం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఇచ్చే సలహా మేరకు రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించాలి. కాబట్టి వాస్తవ కార్య నిర్వహణాధికారాలు ప్రధానమంత్రి, మంత్రి మండలి చేతిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనలో న్యాయ సలహాలు అటార్ని జనరల్ ఇస్తారు, కాబట్టి ఆయన కూడా కార్య నిర్వాహక శాఖలో భాగం.
- సమాధానం: 4
7. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు?
1) 2
2) 3
3) 4
4) ఎన్నిసార్లైనా
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలోని 57వ అధికరణ ప్రకారం రాష్ర్టపతిగా ఎన్నిసార్లైనా ఉండవచ్చు. కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం రాష్ర్టపతిగా రెండుసార్లు మాత్రమే కొనసాగాలి. ఈవిధంగా భారత రాజ్యాంగ పరిషత్ ఒక అభిప్రాయానికి వచ్చింది. భారతదేశం మొదటి రాష్ర్టపతి బాబు రాజేంద్రప్రసాద్ రెండుసార్లు మాత్రమే కొనసాగారు. అది నేడు సాంప్రదాయకంగా కొనసాగుతుంది.
- సమాధానం: 4
8. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, గవర్నర్ అర్హతల్లో ముగ్గురికి వర్తించే అంశాలు ఏవి?
1) భారతీయ పౌరుడై ఉండాలి
2) 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
3) ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు
4) పైవ న్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలోని 58(2) అధికరణ ప్రకారం రాష్ర్టపతి, 66(4) అధికరణ ప్రకారం ఉపరాష్ర్టపతి, 158(2) అధికరణ ప్రకారం రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. మిగతా అంశాలు కూడా పై అందరికీ వర్తిస్తాయి.
నోట్: రాష్ట్రపతి, ఉపరాష్ర్టపతి, గవర్నర్లు, కేంద్రమంత్రి, రాష్ర్టమంత్రి మొదలగు పదవులు ప్రభుత్వ ఉద్యోగం కిందకు రావు.
నోట్: ఎంపీ, ఎంఎల్ఏలుగా పనిచేస్తూ పోటీచేస్తే వారు ప్రమాణ స్వీకారం చేయగానే వారి పదవులు రద్దు అవుతాయి.
- సమాధానం: 4
9. రాష్ర్టపతిగా పోటీచేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంత మంది ప్రతిపాదించాలి?
1) 50 మంది ఎంపీలు లేదా ఎంఎల్ఏలు
2) 20 మంది ఎంపీలు లేదా ఎంఎల్ఏలు
3) 40 మంది ఎంపీలు లేదా ఎంఎల్ఏలు
4) 20 మంది ఎంపీలు మాత్రమే
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ర్టపతిగా పోటీచేయాలంటే ఆయన అభ్యర్ధిత్వాన్ని 50 మంది ఎంపీలు గాని, 50 మంది ఎంఎల్ఏలు గాని ప్రతిపాదించాలి. ఉపరాష్ర్టపతి విషయంలో అయితే 20 మంది ఎంపీలు ప్రతిపాదిస్తే సరిపోతుంది.
- సమాధానం: 1
10. రాష్ర్టపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండి, ఉపరాష్ర్టపతి ఎన్నికలో ఓటు హక్కు లేనివారు?
1) 12 మంది రాజ్యసభ నామినేటేడ్ సభ్యులు
2) ఇద్దరు లోక్‌సభ ఆంగ్లో ఇండియన్లు
3) విధాన సభ సభ్యులు (ఎంఎల్ఏలు)
4) లోక్‌సభ సభ్యులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: వివిధ రాష్ట్రాల విధాన సభలకు (ఎంఎల్ఏ) ఎన్నికైన ఎంఎల్ఏలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. కానీ ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో ఎంఎల్ఏలకు ఓటు హక్కు ఉండదు. అదే విధంగా రాష్ర్టపతి ఎన్నికలో ఓటు హక్కులేని 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు, లోక్‌సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌సకు ఉపరాష్ర్టపతి ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది.
- సమాధానం: 3
11. రాష్ర్టపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండి ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు లేనివారు?
1) రాజ్యసభ నామినేటేడ్ సభ్యులు (12 మంది)
2)లోక్‌సభ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స
3) విధాన సభకు ఎన్నికైన సభ్యులు (ఎంఎల్ఏలు)
4)రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాష్ర్టపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, వివిధ రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్ఏలకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు వేసే హక్కు పార్లమెంటులోని మొత్తం సభ్యులకు ఉంటుంది. ఎన్నికలో ఓటు వేసి, తొలగింపు తీర్మానంపై ఓటు వేయనివారు ఎంఎల్ఏలు మాత్రమే.
- సమాధానం: 3
12. పార్లమెంటు 2/3 మెజార్టీతో తొలగించే పద్ధతి కింది వారిలో ఎవరికి లేదు?
1) రాష్ర్టపతి
2) ఉపరాష్ర్టపతి
3) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
4) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ర్టపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలగు వారిని తొలగించాలంటే కచ్చితంగా పార్లమెంటు ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో తీర్మానం చేయాలి. ఉపరాష్ర్టపతిని తొలగించాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది.
- సమాధానం: 2
13. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ర్టపతి నిర్ణయిస్తారు?
1)ఉపరాష్ర్టపతి
2) గవర్నర్
3)అటార్ని జనరల్
4) హైకోర్టు న్యాయమూర్తులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజ్యాంగంలోని 76వ అధికరణ ప్రకారం అటార్ని జనరల్ జీతభత్యాలను రాష్ర్టపతి నిర్ణయిస్తారు. ఉపరాష్ర్టపతి, గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
- సమాధానం: 3
14. ఉపరాష్ర్టపతి పదవి ఖాళీ అయితే ఎన్ని రోజుల లోపల ఆ ఖాళీని భర్తీ చేయాలి?
1) 6 నెలలు
2) ఒక సంవత్సరం
3) సాధ్యమైనంత త్వరగా
4) రాజ్యాంగం స్పష్టం చేయలేదు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత రాజ్యాంగంలోని 68(2) అధికరణ ప్రకారం ఉపరాష్ర్టపతి పదవి ఖాళీ అయితే సాధ్యమైనంత త్వరగా ఖాళీని భర్తీ చేయాలని పేర్కొనడం జరిగింది. అయితే రాష్ర్టపతి పదవి ఖాళీ అయితే 6 నెలలు లోపల ఆ ఖాళీను భర్తీ చేయాలని రాజ్యాంగం స్పష్టం చేయడం జరిగింది.
- సమాధానం: 3
15. కింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి?
1) రాష్ర్టపతి
2) ఉపరాష్ర్టపతి
3) ప్రధాన ఎన్నికల కమిషనర్
4) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రాజ్యాంగంలోని 67(బి) అధికరణ ప్రకారం ఉపరాష్ర్టపతి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు మెజారిటీ (సాధారణ) తీర్మానంతో ఆమోదిస్తే, తద్వార ఆ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. లోక్‌సభ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఉపరాష్ర్టపతి పదవి నుంచి తొలగిపోతారు. రాష్ర్టపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానాన్ని ఏ సభలోనైన ప్రవేశపెట్టవచ్చు. అయితే రెండు సభలు విడివిడిగా 2/3 వంతు తీర్మానంతో ఆమోదించాలి.
- సమాధానం: 2
16. కింది ఎవరి ఎన్నికలో పార్లమెంటు ఉభయసభల మొత్తం సభ్యులు (ఎన్నికైన+నామినేట్) పాల్గొంటారు?
1) రాష్ర్టపతి
2) ఉపరాష్ర్టపతి
3) స్పీకర్
4) డిప్యూటీ స్పీకర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రాజ్యాంగంలోని 66(1) అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటుకు ఎన్నికైన, రాష్ట్రపతి నామినేట్ చేసిన మొత్తం సభ్యులు పాల్గొంటారు. అయితే రాష్ర్టపతి ఎన్నికలో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు.
- సమాధానం: 2
17. భారత ఉపరాష్ర్టపతి పదవిని ఏ దేశ ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు?
1) అమెరికా
2) ఫ్రాన్స
3) దక్షిణాఫ్రికా
4) కెనడా
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత ఉపరాష్ర్టపతి పదవిని అమెరికా ఉపాధ్యక్షుని పదవితో పోలుస్తారు. ఉపరాష్ర్టపతి పదవి ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించింది హెచ్.వి. కామత్. భారతదేశంలో నిరంతర రాజకీయ ప్రక్రియ కొనసాగడం కోసం ఈ పదవి ఏర్పడింది.
- సమాధానం: 1