రాజ్యాంగ భావనను తొలిసారి శాస్త్రీయంగా వివరించిన తత్త్వవేత్త ఎవరు?
1. రాజ్యాంగ భావనను తొలిసారి శాస్త్రీయంగా వివరించిన తత్త్వవేత్త ఎవరు?
1) సోక్రటీస్
2) అరిస్టాటిల్
3) మాఖియవెల్లి
4) రూసో
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం - అమెరికా
బి) ప్రపంచంలో మొదటి అలిఖిత రాజ్యాంగం - బ్రిటన్
1) ఎ సరైంది
2) బి సరైంది
3) ఎ, బి సరైనవి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
3. రాజ్యాంగ పాలన ప్రజల్లో చైతన్యానికి, స్ఫూర్తి నింపడానికే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్న రాజనీతిజ్ఞుడు ఎవరు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
2) ఉడ్రో విల్సన్
3) అరిస్టాటిల్
4) లాక్
- View Answer
- సమాధానం: 3
4. ఫోర్త ఎస్టేట్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) బ్రిటన్ పార్లమెంట్లో సభ్యుడు ఎడ్బర్గ ఈ పదాన్ని తొలిసారి ప్రయోగించాడు
2) ప్రభుత్వ అంగాలైన శాసన నిర్మాణ శాఖను మొదటి ఎస్టేట్‌గా, కార్యనిర్వాహక శాఖను రెండో ఎస్టేట్‌గా, న్యాయశాఖను మూడో ఎస్టేట్‌గా వ్యవహరిస్తారు
3) పత్రికలను లేదా ఎలక్ట్రానిక్ మీడియాను ఫోర్త ఎస్టేట్‌గా వ్యవహరిస్తారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
5. రెగ్యులేటింగ్ చట్టం - 1773కి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) భారతదేశానికి సంబంధించిన తొలి లిఖిత చట్టం
బి) ఈ చట్టాన్ని 1773 మే 18న అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ వార్త బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు
సి) బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మర్చారు
డి) ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
1) ఎ, బి మాత్రమే సరైనవి
2) బి, డి, మాత్రమే సరైనవి
3) ఎ, బి, సి, డి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
6. రెగ్యులేటింగ్ చట్టం - 1773కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఈ చట్టం ఆధారంగా 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు
2) ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయ మూర్తులు ఉన్నారు
3) మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
7. రెగ్యులేటింగ్ చట్టం-1773లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు చేసింది?
1) 1780
2) 1784
3) 1793
4) 1833
- View Answer
- సమాధానం: 2
8.రెగ్యులేటింగ్ చట్టం-1773లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు చేసింది?
1) 1780
2) 1784
3) 1793
4) 1833
- View Answer
- సమాధానం: 2
9. పిట్స్ ఇండియా చట్టం-1784కి సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ఈ చట్టం ప్రకారం ఇండియాలోని పరిపాలనాంశాలను రెండు రకాలుగా వర్గీకరించారు
2) రాజకీయ వ్యవహారాలు - బోర్డ్ ఆఫ్ కంట్రోలర్, వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్
3) గవర్నర్ కార్యనిర్వాహక మండలి సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
10. చార్టర్ చట్టం-1793 చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారెన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీస్
3) విలియం బెంటింక్
4) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: 2
11. భారత్‌లో క్రైస్తవ మిషనరీలు, చర్చిలు, క్రైస్తవ మిషనరీ హాస్టళ్లను ఏ చట్టం ద్వారా నెలకొల్పారు?
1) రెగ్యులేటింగ్ చట్టం -1773
2) రెగ్యులేటింగ్ చట్టం -1784
3) రెగ్యులేటింగ్ చట్టం -1793
4) రెగ్యులేటింగ్ చట్టం -1813
- View Answer
- సమాధానం: 4
12. పన్నులు విధించడానికి, అవి చెల్లించడానికి, చెల్లించని వారిపై చర్యలను తీసుకొనే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఏ చట్టం ద్వారా కల్పించారు?
1) రెగ్యులేటింగ్ చట్టం -1813
2) భారత కౌన్సిళ్ల చట్టం - 1909
3) భారత కౌన్సిళ్ల చట్టం - 1919
4) భారత ప్రభుత్వ చట్టం - 1935
- View Answer
- సమాధానం: 1
13. చార్టర్ చట్టం -1813కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతీయ విద్యాభివృద్ధికి ఒక లక్ష రూపాయాలతో నిధి ఏర్పాటు చేశారు
2) సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు
3) ఈ చట్టం ద్వారా మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది
4) మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు
- View Answer
- సమాధానం: 4
14. చార్టర్ చట్టం-1833కి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్నర్ జనరల్‌గా మార్చరు
బి) తొలి ఇండియన్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్
1) ఎ సరైంది, బి సరికాదు
2) ఎ సరైంది కాదు, బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవే
4) ఎ, బి రెండూ సరైనవి కాదు
- View Answer
- సమాధానం: 3
15. చార్టర్ చట్టం-1833 ప్రకారం భారతీయ లా కమిషన్ అధ్యక్షుడు ఎవరు?
1) లార్డ్ మెకాలే
2) లార్డ్ కారన్ వాలీస్
3) లార్డ్ మింటో
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
16. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఉద్దేశించి ‘బానిసత్వానికి ఒక నూతన చట్టాన్ని భారతదేశంపై రుద్దారు. ఇంజన్ లేకుండా గట్టి బ్రేకులున్న యంత్రం’ అని వ్యాఖ్యానించిన వారు?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) గాంధీజీ
3) జిన్నా
4) సుభాష్ చంద్రబోస్
- View Answer
- సమాధానం: 1
17. చార్టర్ చట్టాల్లో చివరిది ఏది?
1) చార్టర్ చట్టం - 1853
2) చార్టర్ చట్టం - 1833
3) చార్టర్ చట్టం - 1813
4) చార్టర్ చట్టం - 1793
- View Answer
- సమాధానం: 1
18. జతపరచండి.
జాబితా-I
i) సివిల్ ప్రొసిజర్ కోడ్
ii) ఇండియన్ పీనల్ కోడ్
iii) క్రిమినల్ ప్రొసిజర్ కోడ్
iv) POTA చట్టం
జాబితా-II
a) 1859
b) 1860
c) 1861
d) 2002
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-a, iii-d, iv-c
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
19. భారత ప్రభుత్వం చట్టం - 1858 (కౌన్సిల్ చట్టాలు)లో పొందుపరిచిన అంశం ఏది?
1) గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు
2) తొలి వైస్రాయ్ లార్డ్ కానింగ్
3) బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రద్దు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
20. భారత ప్రభుత్వ చట్టం - 1935కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన
2) ఆర్బీఐ ఏర్పాటు
3) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు
4) సార్వజనీన ఓటు హక్కు
- View Answer
- సమాధానం: 4
21. పిట్స్ ఇండియా చట్టం-1784 ద్వారా ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్/ కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్ అనే ద్వంద్వ పాలన ఏ చట్టం ద్వారా రద్దయింది?
1) భారత కౌన్సిల్ చట్టం -1858
2) కౌన్సిళ్ల చట్టం - 1861
3) కౌన్సిళ్ల చట్టం - 1792
4) భారత కౌన్సిళ్ల చట్టం-1909
- View Answer
- సమాధానం: 1
22. భారత కౌన్సిళ్ల చట్టం - 1858 ప్రకారం వైస్రాయ్ పదవీకాలం ఎన్నేళ్లు?
1) 3
2) 5
3) 1
4) 4
- View Answer
- సమాధానం: 2
23. భారత కౌన్సిళ్ల చట్టం -1858 సారాంశాన్ని వైస్రాయ్ లార్డ్ కానింగ్ ఏ నగరంలో చదివి వినిపించాడు?
1) ఢిల్లీ
2) ఆగ్రా
3) అలహాబాద్
4) లండన్
- View Answer
- సమాధానం: 3
24. పోర్ట్‌ఫోలియో విధానం ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు?
1) లార్డ్ కానింగ్
2) మింటో
3) విలియం బెంటింక్
4) వెవేల్
- View Answer
- సమాధానం:1
25. ఇండియా పాలన బ్రిటిష్ చక్రవర్తి లేదా రాణి ఆధీనంలో వచ్చినట్లు బ్రిటిష్ విక్టోరియా రాణి ఎప్పుడు ప్రకటన చేసింది?
1) 1857 నవంబర్ 1
2) 1857 డిసెంబర్ 1
3) 1858 అక్టోబర్ 11
4) 1858 నవంబర్ 1
- View Answer
- సమాధానం: 4
26. భారత వైస్రాయ్/ గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స జారీ చేసే అధికారం కల్పించిన చట్టం?
1) రెగ్యులేటింగ్ చట్టం - 1861
2) భారత ప్రభుత్వ చట్టం -1935
3) భారత కౌన్సిళ్ల చట్టం - 1909
4) రెగ్యులేటింగ్ చట్టం - 1858
- View Answer
- సమాధానం: 1
27. 1860లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్ధతి ఏది?
1) పోర్ట్‌పోలియో పద్ధతి
2) బడ్జెట్ పద్ధతి
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
28. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీస్‌ల వయోపరిమితిని 1878లో 19 ఏళ్లకు తగ్గించింది. మళ్లీ ఏ సంవత్సరం నుంచి దాన్ని 24 సంవత్సరాలకు పెంచారు?
1) 1892
2) 1905
3) 1895
4) 1891
- View Answer
- సమాధానం: 1
29. మతతత్వ నియోజక వర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
1) వారన్ హేస్టింగ్స్
2) లార్డ్ కానింగ్
3) విలియం బెంటింక్
4) లార్డ్ మింటో
- View Answer
- సమాధానం:4
30. మత ప్రాతిపదికన తొలిసారి నియోజకవర్గ గణాల ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం?
1) భారత కౌన్సిళ్ల చటం-1919
2) భారత ప్రభుత్వ చట్టం - 1935
3) భారత కౌన్సిళ్ల చటం-1909
4) భారత స్వాతంత్య్ర చట్టం-1947
- View Answer
- సమాధానం: 3
31. భారత కౌన్సిళ్ల చట్టం-1909కి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఈ చట్టాన్ని మింటో - మార్లే సంస్కరణలు అని పేర్కొంటారు
బి) అప్పటి గవర్నర్/ వైస్రాయ్ లార్డ్ - మింటో, భారత వ్యవహారాల కార్యదర్శి - మార్లే
సి) గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు
డి) సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా
1) ఎ, బి సరైనవి
2) బి, సి సరైనవి
3) సి, డి సరైనవి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
32. భారత కౌన్సిళ్ల చట్టం - 1909ను ఉద్దేశించి హిందువులకు, ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు వేసి, వారి మధ్య అడ్డుగోడలు సృష్టించిందని, భారత విభజనకు నాంది పలికిందని వ్యాఖ్యానించింది ఎవరు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
2) గాంధీజీ
3) జవహర్లాల్ నెహ్రూ
4) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: 3
33. 1919 చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగు - ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు అని పేర్కొంటారు
బి) నాటి భారత కార్యదర్శి మాంటేగు
సి) నాటి భారత వైస్రాయ్ ఛేమ్స్‌ఫర్డ్
డి) ఈ చట్టాన్ని 1919లో రూపొందించినప్పటికీ 1921 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి, డి
2) ఎ, డి
3) ఎ, బి, సి
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 1
34. మాంటెగు - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు -1919కు సంబంధించి కింది వాటిలో సరైంది?
1) రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు
2) దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు
3) భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
35.ఏ కమిటీ సూచన మేరకు భారత్‌కు విడిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు?
1) లీ కమిషన్
2) సైమన్ కమిషన్
3) క్రిప్స్ కమిషన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
36. మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, ఐరోపా వారికి ప్రత్యేక నియోజక వర్గాలను ఏ చట్టం ప్రకారం ప్రకటించారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం - 1909
2) భారత కౌన్సిళ్ల చట్టం -1919
3) భారత ప్రభుత్వ చట్టం-1935
4) భారత స్వాతంత్య్ర చట్టం - 1947
- View Answer
- సమాధానం: 2
37. ‘1919 సంస్కరణలు అసంతృప్తి, నిరాశతోపాటు సూర్యుడులేని ఉదయం’గా ఉందని అభిప్రాయపడింది ఎవరు?
1) బాలగంగాధర్ తిలక్
2) బిపిన్ చంద్రపాల్
3) లాలా లజపతిరాయ్
4) అరవింద ఘోష్
- View Answer
- సమాధానం: 1
38. ఏ సంస్కరణలను బ్రిటిషర్లు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఏ చట్టాన్ని భారతీయులు స్వీకరించడం తగదని శ్రీమతి అనీబిసెంట్ ఏ చట్టాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు?
1) భారత కౌన్సిళ్ల చట్టం - 1919
2) భారత కౌన్సిళ్ల చట్టం -1909
3) భారత ప్రభుత్వ చట్టం-1935
4) భారత స్వాతంత్య్ర చట్టం - 1947
- View Answer
- సమాధానం: 1
39. సైమన్ కమిషన్‌ను బ్రిటిష్ ప్రధాని బాల్డ్విన్ ఎప్పుడు ప్రకటించాడు?
1) 1927 జనవరి
2) 1927 ఆగస్టు
3) 1927 నవంబర్
4) 1927 డిసెంబర్
- View Answer
- సమాధానం: 3
40. సైమన్ కమిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది?
1) 1927
2) 1928
3) 1929
4) 1930
- View Answer
- సమాధానం: 2
41. సైమన్ కమిషన్‌ను భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు?
1) ఈ కమిటీలో సభ్యులందరూ భారతీయులు అయినందుకు
2) ఈ కమిటీలో సభ్యులందరూ బ్రిటిషర్లు కావడం వల్ల
3) ఈ కమిటీలోని సభ్యులందరూ మహిళలు కావడం వల్ల
4) ఈ కమిటీలో సభ్యుడిగా గాంధీజీ ఉండటం వల్ల
- View Answer
- సమాధానం: 2
42. సైమన్ కమిషన్‌ను ఇంగ్లండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది?
1) భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి
2) భారత ప్రభుత్వం చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి
3) రాజ్యాంగ పరిషత్ ప్రతిపాదనను పరిశీలించడానికి
4) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడానికి
- View Answer
- సమాధానం: 2
43. సమాఖ్య అనే పదాన్ని తొలిసారి సూచించింది?
1) సైమన్ కమిషన్
2) మకల్ కమిషన్
3) మౌంట్ బాటెన్ కమిషన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
44. సైమన్ కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఎంత?
1) ఒక అధ్యక్షుడు, ఆరుగురు సభ్యులు
2) ఒక అధ్యక్షుడు, ఐదుగురు సభ్యులు
3) ఒక అధ్యక్షుడు, ఏడుగురు సభ్యులు
4) ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు
- View Answer
- సమాధానం: 1
45. మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది?
1) 1927
2) 1928
3) 1959
4) 1930
- View Answer
- సమాధానం: 2
46. మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది?
1) 1927
2) 1928
3) 1959
4) 1930
- View Answer
- సమాధానం: 3
47. ఏ చట్టం ద్వారా బర్మా (మయన్మార్)ను భారతదేశం నుంచి వేరు చేశారు?
1) 1858 చట్టం
2) 1909 చట్టం
3) 1935 చట్టం
4) 1919 చట్టం
- View Answer
- సమాధానం: 3