ప్రాథమిక హక్కులు
1. ప్రకరణ-19కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 19(1)(ఎ) - భావ ప్రకటన స్వేచ్ఛ
2) 19(1)(బి) - సమావేశమయ్యే స్వేచ్ఛ
3) 19(1)(డి) - స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ
4) 19(1)(ఎఫ్)- ఇష్టమైన వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ఏది?
1) అంతరంగిక భద్రతా చట్టం (MISA)
2) జాతీయ భద్రతా చట్టం (NASA)
3) ఉగ్రవాదుల విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం (TADA)
4) ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (POTA)
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో వేటికి/ దేనికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది?
1) ఆదేశ సూత్రాలు
2) ప్రవేశిక
3) ప్రాథమిక హక్కులు
4) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం:3
4. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం దేనికి/ ఎవరికి ఉంటుంది?
1) పార్లమెంట్
2) పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు
3) రాష్ట్రపతి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
5. కేవలం పౌరులకు మాత్రమే వర్తించే ప్రాథమిక హక్కులు ఏవి?
1) 25, 26 ప్రకరణల్లోని హక్కులు
2) 16, 19 ప్రకరణల్లోని హక్కులు
3) 20, 21 ప్రకరణల్లోని హక్కులు
4) 23, 24 ప్రకరణల్లోని హక్కులు
- View Answer
- సమాధానం: 2
6. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను తొలిసారిగా సవరించారు?
1) 7
2) 1
3) 24
4) 17
- View Answer
- సమాధానం: 2
7. పీడనాన్ని నిరోధించే హక్కును ఏ రకమైన హక్కుగా పేర్కొనవచ్చు?
1) విద్యా పరమైన
2) సాంఘిక పరమైన
3) ఆర్థిక పరమైన
4) రాజకీయ పరమైన
- View Answer
- సమాధానం: 2
8.‘శాసన సమాన రక్షణ’ (Equal Protection of Law) అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు?
1) ఇంగ్లండ్
2) అమెరికా
3) ఫ్రాన్స్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
9. ‘చట్టం అమలు ప్రక్రియ’ (Due Process of Law) ఏ దేశంలో ప్రముఖంగా ఉంది?
1) ఇంగ్లండ్
2) భారత్
3) అమెరికా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
10.‘చేసిన నేరానికి చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ శిక్ష విధించరాదు’ అని ఏ ప్రకరణ తెలుపుతుంది?
1) 20(1)
2) 20(2)
3) 20(3)
4) 22(1)
- View Answer
- సమాధానం: 1
11. కింది వాటిలో సంప్రదాయిక ప్రాథమిక హక్కు ఏది?
1) మతస్వేచ్ఛ హక్కు
2) విద్యా-సాంస్కృతిక హక్కు
3) జీవించే హక్కు
4) పీడనాన్ని నిరోధించే హక్కు
- View Answer
- సమాధానం: 3
12. స్త్రీలు, పిల్లల ఉపయోగార్థం ప్రభుత్వం ఎన్నో ప్రకరణ ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు?
1) 15(1)
2) 15(2)
3) 16(4)
4) 15(3)
- View Answer
- సమాధానం: 4
13. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు?
1) 77వ రాజ్యాంగ సవరణ చట్టం-1995
2) 85వ రాజ్యాంగ సవరణ చట్టం-2001
3) 81వ రాజ్యాంగ సవరణ చట్టం-2000
4) 89వ రాజ్యాంగ సవరణ చట్టం-2003
- View Answer
- సమాధానం: 1
14. పౌరుల పట్ల రాజ్యం.. కింద పేర్కొన్న ఏ విషయంలో వివక్ష చూపవచ్చు?
1) పుట్టిన ప్రదేశం
2) జాతి
3) కులం
4) విద్య
- View Answer
- సమాధానం: 4
15.‘సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేయాలి’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1) రణధీర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982)
2) చిరంజిత్ లాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1961)
3) విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1997)
4) రాధాచరణ్ Vs స్టేట్ ఆఫ్ ఒరిస్సా (1969)
- View Answer
- సమాధానం: 2
16. భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులను ఏ ప్రకరణలో పొందుపరిచారు?
1) 19(5)
2) 19(2)
3) 19(4)
4) 19(3)
- View Answer
- సమాధానం: 2
17. ‘సహకార సంఘాలు’ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1) 96వ రాజ్యాంగ సవరణ చట్టం-2011
2) 95వ రాజ్యాంగ సవరణ చట్టం-2009
3) 97వ రాజ్యాంగ సవరణ చట్టం-2011
4) 91వ రాజ్యాంగ సవరణ చట్టం-2003
- View Answer
- సమాధానం: 3
18. ఒక వ్యక్తిని చట్టపరంగా నిర్బంధించినప్పుడు సహజ న్యాయ సూత్రాలు వర్తించవని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది?
1) ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950)
2) మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978)
3) సునీత గుప్తా Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1990)
4) లోకేంద్ర సింగ్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1996)
- View Answer
- సమాధానం: 1
19. ప్రాథమిక విద్యను ‘ప్రాథమిక హక్కు’గా ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?
1) 2004
2) 2002
3) 2003
4) 2006
- View Answer
- సమాధానం: 2
20. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తిని గరిష్టంగా ఎంత కాలం నిర్బంధించవచ్చు?
1) రెండు నెలలు
2) మూడు నెలలు
3) ఆరు నెలలు
4) నాలుగు నెలలు
- View Answer
- సమాధానం: 2
21. చట్టపరంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సంబంధించి రాజ్యాంగపరమైన రక్షణ ఏది?
1) న్యాయవాదిని సంప్రదించడం
2) అరెస్ట్‌కు తగిన కారణాలు తెలపడం
3) 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22. ‘ప్రజా సంక్షేమం కోసం నిర్బంధంగా పనిచేయించుకోవచ్చు’. దీన్ని సమర్థిస్తున్న ప్రాథమిక హక్కు ఏది?
1) స్వేచ్ఛా హక్కు
2) పీడనాన్ని నిరోధించే హక్కు
3) విద్యా హక్కు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
23. ‘మనుషుల అక్రమ వ్యాపార నిరోధ చట్టం’ను ఎప్పుడు చేశారు?
1) 1958
2) 1956
3) 1951
4) 1966
- View Answer
- సమాధానం: 2
24. మత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణ ఏది?
1) 25
2) 26
3) 27
4) 28
- View Answer
- సమాధానం: 2
25. రాజ్యాంగ ప్రకరణ-30 కింది వాటిలో ఏ విషయాన్ని స్పష్టం చేస్తుంది?
1) అల్ప సంఖ్యాక వర్గాల వారికి రక్షణ
2) అల్ప సంఖ్యాక వర్గాల వారి భాష, లిపికి రక్షణ
3) అధిక సంఖ్యాక వర్గాల వారికి విద్యా సంస్థల్లో ప్రవేశం విషయంలో రక్షణ
4) విద్యా సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవడంలో స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: 4
26. కింది వారిలో ‘మతపరమైన మైనార్టీలు’ పరిధిలోకి రానిది ఎవరు?
1) ముస్లింలు
2) క్రిస్టియన్లు
3) హిందువులు
4) బౌద్ధులు
- View Answer
- సమాధానం: 3
27. ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ భాగంలో ఉంది?
1) 11వ భాగం
2) 12వ భాగం
3) 9వ భాగం
4) 3వ భాగం
- View Answer
- సమాధానం: 2
28. కింది వాటిలో అత్యంత పురాతన ‘రిట్’ ఏది?
1) ప్రొహిబిషన్
2) హెబియస్ కార్పస్
3) కోవారెంటో
4) మాండమస్
- View Answer
- సమాధానం:2
29. ప్రాథమిక హక్కుల సంఖ్యను పెంచడానికి, తగ్గించడానికి ఎవరికి/దేనికి అధికారం ఉంది?
1) రాష్ట్రపతి
2) పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు
3) పార్లమెంట్
4) కేబినెట్
- View Answer
- సమాధానం: 3
30. ప్రాథమిక హక్కులకు సంబంధించిన బిల్లును మొదటగా ఏ సభలో ప్రవేశపెట్టాలి?
1) రాజ్యసభ
2) లోక్‌సభ
3) రాష్ట్ర శాసనసభ
4) లోక్‌సభ లేదా రాజ్యసభ
- View Answer
- సమాధానం: 4
31. ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే అధికారం ఎవరికి/దేనికి ఉంది?
1) పార్లమెంటు
2) రాష్ట్రపతి
3) సుప్రీంకోర్టు
4) కేబినెట్
- View Answer
- సమాధానం: 2
32. ప్రొహిబిషన్ రిట్‌ను దేని కోసం జారీ చేస్తారు?
1) కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి
2) కేసును ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేయడానికి
3) దిగువ న్యాయస్థానంలో కేసు విచారణ నిలుపుదల చేయడానికి
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం:3
33. ప్రాథమిక హక్కుల ఉపకమిటీకి అధ్యక్షుడు ఎవరు?
1) హెచ్.సి. ముఖర్జీ
2) జె.బి. కృపలాని
3) వల్లభాయ్ పటేల్
4) పట్టాభి సీతారామయ్య
- View Answer
- సమాధానం: 2
34. ‘మాగ్న కార్టా ఆఫ్ ఇండియా’గా వేటిని పేర్కొంటారు?
1) ఆదేశ సూత్రాలు
2) ప్రాథమిక హక్కులు
3) ప్రవేశిక
4) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: 2
35. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు?
1) 356
2) 359
3) 395
4) 357
- View Answer
- సమాధానం: 2
36. ‘అంతర్గత భద్రతా చట్టం (MISA)’ రూపొందించిన సమయంలో భారత ప్రధాని ఎవరు? (గ్రూప్-2, 2008)
1) రాజీవ్ గాంధీ
2) ఇందిరాగాంధీ
3) వి.పి. సింగ్
4) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: 2
37. ‘న్యాయ సమీక్ష’ అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? (గ్రూప్-2, 2004)
1) యు.ఎస్.ఎ.
2) కెనడా
3) బ్రిటన్
4) జపాన్
- View Answer
- సమాధానం:1
38. స్వేచ్ఛా హక్కు హామీ వేటికి వర్తిస్తుంది? (గ్రూప్-2, 2004)
1) ఆరు హక్కులకు
2) ఏడు హక్కులకు
3) ఎనిమిది హక్కులకు
4) తొమ్మిది హక్కులకు
- View Answer
- సమాధానం: 1
39. రాజ్యాంగం ఏ అధికరణ ద్వారా పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది? (ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఎగ్జామ్, 2006)
1) 14
2) 21
3) 32
4) 19
- View Answer
- సమాధానం: 4
40.మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కింది వాటిలో దేనికి సంబంధించింది? (ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో, 2008)
1) విదేశాల్లో పర్యటించే హక్కు
2) జంతుజాలం పట్ల క్రూరత్వ నివారణ
3) పరిసరాల సంరక్షణ
4) స్త్రీల హక్కులు
- View Answer
- సమాధానం: 1
41.కింది వాటిలో సరైన జత ఏది? (గ్రూప్-1, 2000)
1) ప్రకరణ 18- అంటరానితనం నిషేధం
2) ప్రకరణ 17-గౌరవ బిరుదుల నిషేధం
3) ప్రకరణ 15- భేద భావం నిషేధం
4) ప్రకరణ 22- వ్యక్తిగత స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: 3
42. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల రద్దుకు సంబంధించిన అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? (గ్రూప్-1, 2000)
1) ఐర్లాండ్
2) జర్మనీ
3) కెనడా
4) సోవియట్ రాజ్యాంగం
- View Answer
- సమాధానం: 2
43. సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రముఖ వ్యాజ్యాల్లో ఆస్తిహక్కుతో సంబంధం లేనిది ఏది? (గ్రూప్-1, 2004)
1) గోలక్‌నాథ్ కేసు
2) కేశవానంద భారతి కేసు
3) మినర్వామిల్స్ కేసు
4) గోపాలన్ కేసు
- View Answer
- సమాధానం:4
44. ‘అంటరానితనం రద్దు చేయబడింది’ అని రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? (గ్రూప్-2 , 2000)
1) 18వ అధికరణం
2) 14వ అధికరణం
3) 17వ అధికరణం
4) 3వ అధికరణం
- View Answer
- సమాధానం: 3
45.‘కోవారెంటో’ అంటే అర్థం ఏమిటి? (గ్రూప్-2, 2008)
1) బందీ ప్రత్యక్ష
2) అధికార పృచ్ఛ
3) పరమాదేశ
4) ఉత్పేషణ
- View Answer
- సమాధానం: 2
46. ‘భారత భూభాగంలో ఏ వ్యక్తికీ రాజ్యం చట్ట సమానత్వాన్ని నిరాకరించకూడదు’ అని తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? (గ్రూప్-2, 2008)
1) 21
2) 18
3) 14
4) 22
- View Answer
- సమాధానం: 3
47. ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక.... (గ్రూప్-2, 2003)
1) నైతిక హక్కు
2) సహజ హక్కు
3) పౌర హక్కు
4) న్యాయపరమైన హక్కు
- View Answer
- సమాధానం: 4
48. గోలక్‌నాథ్ కేసు (1967) విశిష్టత ఏమిటి? (గ్రూప్-2, 2003)
1) సుప్రీంకోర్టు అధికారాలు తగ్గించింది
2) మంత్రిమండలి అధికారాలు పెంచింది
3) శాసనసభ అధికారాలు పెంచింది
4) పార్లమెంటు అధికారాలను పరిమితం చేసింది
- View Answer
- సమాధానం:4
49. ‘రూల్ ఆఫ్ లా’ అంటే ఏమిటి? (గ్రూప్-2, 2003)
1) చట్టానికి ఎవరూ అతీతులు కారు
2) చట్టం ముందు అందరూ సమానులే
3) రాజ్యాంగబద్ధ ప్రభుత్వం
4) పార్లమెంటు సర్వాధికారి
- View Answer
- సమాధానం: 2
50.భారతదేశంలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ ఏవిధంగా అంకురించింది?(ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో, 2008)
1) రాజ్యాంగ సవరణ ద్వారా
2) న్యాయ చొరవ ద్వారా
3) రాజకీయ పార్టీల ద్వారా
4) పార్లమెంట్ చట్టం ద్వారా
- View Answer
- సమాధానం: 2