కేంద్ర మంత్రుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు?
1. జతపరచండి.
ప్రభుత్వ తరహాలు ప్రధానమైన లక్షణాలు
1. కేబినెట్ ప్రభుత్వం ఎ. అధికారాల వేర్పాటు
2. అధ్యక్ష ప్రభుత్వం బి. సమష్టి బాధ్యత
3. సమాఖ్య ప్రభుత్వం సి. అధికారాల వికేంద్రీకరణ
4. ఏక కేంద్ర ప్రభుత్వం డి. అధికారాల కేంద్రీకరణ
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
- View Answer
- సమాధానం: 2
2. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు?
1) డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్
2) సచ్చిదానంద సిన్హా
3) బాబూ రాజేంద్రప్రసాద్
4) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 3
3. వింగ్స్ ఆఫ్ ఫైర్ (Wings of Fire) ఎవరి స్వీయ చరిత్ర పేరు?
1) ఆర్. వెంకట్రామన్
2) కె.ఆర్. నారాయణన్
3) రాధాకృష్ణన్
4) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
- View Answer
- సమాధానం: 4
4. భారతదేశ రాష్ర్టపతిగా ఎన్నికైన మొదటి దళితుడు ఎవరు?
1) కె.ఆర్. నారాయణన్
2) దామోదరం సంజీవయ్య
3) ఆర్. వెంకట్రామన్
4) శంకర్ దయాళ్ శర్మ
- View Answer
- సమాధానం: 1
5.‘సమాన పనికి సమాన వేతనం’ అంటే..
1) ప్రాథమిక హక్కు
2) ఆదేశిక సూత్రం
3) ప్రాథమిక విధులు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
6. ఓటింగ్ వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ అధికరణ ఏది?
1) అధికరణ 324
2) అధికరణ 325
3) అధికరణ 326
4) అధికరణ 327
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించలేదు?
1) భారత దేశమంతా యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ
2) నిరాయుధంగా, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ
3) ఏదైనా వృత్తిని, వ్యాపారాన్ని నిర్వహించే స్వేచ్ఛ
4) ఆస్తిని సంపాదించే, సొంతం చేసుకునే, బదిలీ చేసే స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో ఏ హక్కును డా.బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగానికి ‘హృదయం, ఆత్మ’గా అభివర్ణించారు?
1) సమానత్వపు హక్కు
2) స్వాతంత్య్రపు హక్కు
3) మతస్వాతంత్య్రపు హక్కు
4) రాజ్యాంగ పరిహారపు హక్కు
- View Answer
- సమాధానం: 4
9.భారత రాజ్యాంగంలోని ఏ భాగం అంతర్జాతీయ శాంతి, భద్రతను పెంపొందించే బాధ్యతను తెలియజేస్తుంది?
1) ప్రాథమిక హక్కులు
2) ప్రాథమిక విధులు
3) రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు
4) అత్యవసర పరిస్థితి అధికరణలు
- View Answer
- సమాధానం: 3
10. పార్లమెంటులో భాగస్వాములు ఎవరు?
1) ప్రధానమంత్రి, లోక్‌సభ, రాజ్యసభ
2) మంత్రి మండలి, ప్రధానమంత్రి, లోక్‌సభ
3) లోక్‌సభ, రాజ్యసభ, స్పీకర్
4) లోక్‌సభ, రాజ్యసభ, భారత రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: 4
11. కేంద్ర మంత్రుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు?
1) పార్లమెంటు
2) కేబినెట్ సచివాలయం
3) ఆర్థిక మంత్రాలయం
4) భారత రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: 1
12. ఒక సాధారణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి నివేదించినపుడు దేని ద్వారా ఆమోదించాలి?
1) ఉభయ సభల మొత్తం హాజరైన, ఓటేసిన సభ్యుల్లో సాధారణ ఆధిక్యంతో
2) ఉభయ సభల మొత్తం సభ్యులతో మూడింట రెండు వంతుల ఆధిక్యం
3) ఉభయ సభల మొత్తం సభ్యులతో సాధారణ ఆధిక్యం
4) ఉభయ సభల మొత్తం సభ్యుల్లో హాజైరై, ఓటేసిన సభ్యుల్లో మూడింట రెండు వంతుల ఆధిక్యం
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో దేనిని భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు?
ఎ. ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి
బి. రాష్ర్ట మంత్రిమండలి సమష్టి బాధ్యత
సి. రాష్ర్ట మంత్రుల రాజీనామా
డి. ఉపముఖ్యమంత్రి పదవి
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, సి
- View Answer
- సమాధానం: 3
14. భారత సుప్రీంకోర్టుకు సంబంధించి, కింది వాక్యాల్లో సరైంది ఏది?
ఎ. సుప్రీంకోర్టుకు భారతదేశంలోని ఏదైనా న్యాయస్థానం/ట్రైబ్యునల్ల నుంచి అప్పీల్‌ను స్వీకరించే అధికారం ఉంటుంది.
బి. సుప్రీంకోర్టుకు రాష్ర్టపతి ద్వారా నిర్దేశించిన శాసనాత్మక / వాస్తవాత్మక ప్రశ్నలపై సలహాపూర్వక అభిప్రాయాన్ని వెల్లడించే అధికారం ఉంటుంది.
సి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు రాష్ర్ట సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
డి. సుప్రీంకోర్టు అధికార పరిధి భారతదేశంలోని అన్ని ఇతర న్యాయస్థానాలపై కట్టుబడి ఉంటుంది.
1) ఎ, సి
2) సి, డి
3) బి, సి, డి
4) ఎ, బి, డి
- View Answer
- సమాధానం: 4
15. రాష్ర్ట ‘ఓట్ ఆన్ అకౌంట్’ కాలపరిమితి ఎంత?
1) నెల రోజులు
2) మూడు నెలలు
3) ఆరు నెలలు
4) సంవత్సరం
- View Answer
- సమాధానం: 3
16. పార్లమెంటు సభ్యులు కాని వారు మంత్రిగా ఉంటే ఎన్ని నెలల్లో ఎన్నికవ్వాలి?
1) రెండు నెలలు
2) నాలుగు నెలలు
3) ఆరు నెలలు
4) సంవత్సరం
- View Answer
- సమాధానం: 3
17. జతపరచండి.
అధికరణలు:
ఎ. 39 (ఎ) అధికరణ
బి. 43 అధికరణ
సి. 44 అధికరణ
డి. 50 అధికరణ
విషయాలు/అంశాలు:
1. కార్మికులకు సరైన వేతనాలు
2. కామన్ సివిల్ కోడ్ (ఒకే పౌరస్మృతి)
3. న్యాయశాఖ నుంచి కార్యనిర్వహక శాఖవేరు
4. ఉచిత న్యాయ సహాయం
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-1, బి-4, సి-3, డి-2
- View Answer
- సమాధానం: 3
18. రాజ్యాంగంలోని ఏ విభాగం/ ప్రకరణల్లో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉంది?
1) విభాగం IV ప్రకరణ 51
2) విభాగం III ప్రకరణ 51
3) విభాగం IV(A) ప్రకరణ 51(A)
4) విభాగం III(A) ప్రకరణ 51
- View Answer
- సమాధానం: 3
19. రాష్ర్ట స్థాయిలో లోకాయుక్తల నియామకం చేసిన క్రమంలో కింది రాష్ట్రాలని అమర్చండి?
ఎ. మహారాష్ర్ట
బి. ఒడిశా
సి. ఆంధ్రప్రదేశ్
డి. ఉత్తరప్రదేశ్
ఇ. కర్ణాటక
1) బి, ఎ, డి, సి, ఇ
2) ఎ, సి, డి, బి, ఇ
3) బి, ఎ, డి, ఇ, సి
4) బి, డి, ఇ, సి, ఎ
- View Answer
- సమాధానం: 3
20.కింది వాటిలో ఎవరి పరిపాలన కాలంలో అంతర్రాష్ర్ట మండలిని ఏర్పాటు చేశారు?
1) 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం
2) 1978లో జనతా ప్రభుత్వం
3) 1990లో జనతాదళ్-నేతృత్వ ప్రభుత్వం
4) 1996లోయునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 3
21.కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్య 15 శాతానికి మించకుండా కట్టడి చేసిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 89వ రాజ్యాంగ సవరణ 2001
2) 91వ రాజ్యాంగ సవరణ 2003
3) 92వ రాజ్యాంగ సవరణ 2002
4) 93వ రాజ్యాంగ సవరణ 2003
- View Answer
- సమాధానం: 2
22. జోనల్ మండలి చైర్మన్ ఎవరు?
1) ప్రధానమంత్రి నామినేట్ చేసిన రాష్ర్ట ముఖ్యమంత్రి
2) రాష్ర్టపతి నామినేట్ చేసిన కేంద్రమంత్రి
3) పదవి రీత్యా హోదాలోని హోంమంత్రి
4) ఉపరాష్ర్టపతి
- View Answer
- సమాధానం: 3
23. కింది వాటిలో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన ప్రకటన పర్యవసనాలు కానివేవి?
ఎ. రాష్ర్ట శాసనసభ రద్దు
బి. రాష్ర్టంలో మంత్రి మండలిని తొలగించడం
సి. స్థానికి సంస్థలను రద్దు చేయడం
డి. రాష్ర్ట పరిపాలనను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం.
1) ఎ, బి, డి
2) ఎ, సి
3) బి, సి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 2
24. కింది వాక్యాల్లో ఏది సరైనది?
ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా హాజరు కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి కోరాలంటే..
1) భారత రాష్ర్టపతి ద్వారా ముందస్తు సమ్మతి మాత్రమే అవసరం.
2) భారత రాష్ర్టపతి ముందస్తు సమ్మతి, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు అవసరం.
3) సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు మాత్రమే అవసరం.
4) భారత రాష్ర్టపతి ముందస్తు సమ్మతి, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు రెండు అవసరం లేదు.
- View Answer
- సమాధానం: 2
25. భారత్‌లో మొదటి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది?
1) ముంబై
2) మద్రాసు
3) కలకత్తా
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
26. రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం మంత్రి మండలి సలహాను అనుసరించి గవర్నర్ చర్య తీసుకోవాలి. అయితే కింది ఏ విషయాలకు సంబంధించి ఈ నిబంధన వర్తించదు.
ఎ. రాష్ర్ట బిల్లును రాష్ర్టపతి పరిశీలన కోసం పంపడం
బి. శాసన సభలో ప్రసంగించడం
సి. రాష్ర్టపతి పాలన విధించవలసిందిగా రాష్ర్టపతికి సిఫార్సు చేయడం
1) ఎ, సి
2) ఎ, బి, సి
3) బి, సి
4) బి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
27.ప్రతిపాదన(A): ఒక రాష్ర్ట బిల్లును రాష్ర్టపతి అమోదానికి ప్రత్యేకించడం గవర్నర్‌కి ఉన్న ఒక విచక్షనాత్మక అధికారం
హేతువు(R): రాష్ర్ట శాసన సభ ఆమోదించిన ఒక బిల్లును రాష్ర్టపతి నిరాకరించవచ్చు, పునఃపరిశీలించవచ్చు, తిప్పి పంపవచ్చు.
1) A, R లు రెండు విడివిడిగా సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R లు రెండు విడివిడిగా సరైనవే కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది కానీ R తప్పు
4) A తప్పు కానీ R సరైంది.
- View Answer
- సమాధానం: 2
28. రాజ్యాంగ భూమికను తయారు చేసింది ఎవరు?
1) బి.ఆర్. అంబేడ్కర్
2) బాబూ రాజేంద్రప్రసాద్
3) జె.బి. కృపలానీ
4) జవహర్లాల్ నె్రహూ
- View Answer
- సమాధానం: 4
29. ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థికి ఏ వేలుకు ఇంకు చుక్కను పెడతారు?
1) ఎడమ చేయి చూపుడువేలు
2) ఎడమ చేయి మధ్యవేలు
3) కుడి చేయి చూపుడవేలు
4) కుడి చేయి మధ్యవేలు
- View Answer
- సమాధానం: 1
30. భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు?
1) లార్డ్ విలియం బెంటింగ్
2) లార్డ్ వారెన్ హేస్టింగ్స్
3) లార్డ్ కర్జన్
4) లార్డ్ రిప్పన్
- View Answer
- సమాధానం: 2
31. ఒక రాష్ర్ట గవర్నర్ అనుభవించే అధికారాలకు సంబంధించి కింది వివరణను పరిశీలించండి?
1) ప్రతి సంవత్సరం జరిగే శాసనసభ తొలి సమావేశం ప్రారంభంలో గవర్నర్ ప్రసంగిస్తారు
2) శాసనసభ పరిశీలనలో ఉన్న ఒక బిల్లుకు సంబంధించి అతడు శాసనసభకు సందేశాలు పంపవచ్చు.
3) అతడు రాష్ర్ట శాసన సభను సమావేశ పరచవచ్చు, వాయిదా వేయవచ్చు, రద్దు చేయవచ్చు.
4) రాష్ర్ట హైకోర్టు అధికారాలకు భంగం కలిగించే ఒక బిల్లుకు అతని ఆమోదం తెలుపవచ్చు.
- View Answer
- సమాధానం: 4
32. కింది వారిలో గవర్నర్ నియమించనిది ఎవరు?
1) రాష్ర్ట మంత్రి మండలి
2) రాష్ర్ట అడ్వకేట్ జనరల్
3) రాష్ర్ట పోలీస్ డెరైక్టర్ జనరల్
4) రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు
- View Answer
- సమాధానం: 3
33. అశోక్ మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్ని అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది?
1) 3
2) 2
3) 1
4) 4
- View Answer
- సమాధానం: 2
34. భారత రాజ్యాంగంలో ‘విద్య’ ఏ జాబితాలో ఉంది?
1) ఉమ్మడి జాబితా
2) కేంద్ర జాబితా
3) రాష్ర్ట జాబితా
4) అవశిష్ట అంశాలు
- View Answer
- సమాధానం: 1
35. ఒక రాష్ర్ట గవర్నర్‌ను అతని పదవి నుంచి రాష్ర్టపతి తొలిగించేది ఎప్పుడు?
1) రాష్ర్ట ముఖ్యమంత్రి వినతితో
2) లోకాయుక్త సలహాతో
3) కేంద్ర కేబినెట్ సలహాపై
4) అటార్నీ జనరల్ సలహాపై
- View Answer
- సమాధానం: 3
36.మూల రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఏడు రకాలుగా వర్గీకరించింది కానీ అవి ఇపుడు ఎన్ని?
1) ఐదు
2) నాలుగు
3) ఎనిమిది
4) ఆరు
- View Answer
- సమాధానం: 4
37.ప్రస్తుత లోక్‌సభలో సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది?
1) 1951
2) 1971
3) 2001
4) 1991
- View Answer
- సమాధానం: 2
38. భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు ‘రక్షకుని’గా గుర్తించారు?
1) పార్లమెంటు
2) సుప్రీంకోర్టు
3) కార్యనిర్వాహకశాఖ
4) ఏవీకావు
- View Answer
- సమాధానం: 2
39. ప్రతిపాదన (A): ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి ఆ రాష్ర్ట మంత్రి మండలి అధినేత
హేతువు (R): ముఖ్యమంత్రి శాసన సభకు బాధ్యత వహిస్తాడు, సభలో మెజార్టీ మద్దతును అనుభవిస్తాడు.
1) A, R లు విడివిడిగా సరైనవి. R, Aకు సరైన వివరణ
2) A, R లు విడివిడిగా సరైనవి కానీ A కు R వివరణ కాదు
3) A సరైంది కానీ R తప్పు
4) A తప్పు కానీ R ఒప్పు
- View Answer
- సమాధానం: 1
40. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. రాష్ర్ట మంత్రిమండలి లేకుండా గవర్నర్ విధులు నిర్వహించలేడు
బి. రాష్ర్ట శాసనసభలో సభ్యుడు కానీ వ్యక్తి మంత్రిగా నియమించలేం
సి. ముఖ్యమంత్రి మరణం/రాజీనామా తర్వాత కొంతకాలం పాటు రాష్ర్టమంత్రి మండలి విధుల్లో కొనసాగుతుంది
డి. ముఖ్యమంత్రి లేనపుడు రాష్ర్టమంత్రి మండలి అత్యవసర సమావేశాలకు హోంశాఖ మంత్రి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు.
1) ఎ మాత్రమే
2) సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 1
41. ప్రతిపాదన (A) : రాష్ర్ట మంత్రి మండలిలోని మంత్రుల సంఖ్య భారత రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పలేదు
హేతువు (R): మంత్రి మండలి సంఖ్యను నిర్ణయించడంలో అనేక ఒత్తిడిలు పనిచేస్తాయి.
1) A, R రెండు విడివిడిగా సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R రెండు విడివిడిగా సరైనవి కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది కానీ R తప్పు
4) A తప్పు కానీ R ఒప్పు
- View Answer
- సమాధానం: 1