భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం?
1. భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం?
1) ప్రభుత్వం
2) ప్రజలు
3) సార్వభౌమాధికారం
4) భూభాగం
- View Answer
- సమాధానం: 2
2. భారతీయులు స్వయంగా తమ రాజ్యాంగాన్ని తామే రూపొందించుకోవాలనే భావనను తొలిసారిగా 1934లో తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఎవరు?
1) ఎం.ఎన్. రాయ్
2) గాంధీజీ
3) అంబేడ్కర్
4) నెహ్రూ
- View Answer
- సమాధానం: 1
3. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 1942లో క్రిప్స్ కమిషన్ రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తామని తొలిసారిగా ప్రతిపాదించింది
బి) 1946లో కేబినెట్ కమిషన్ సిఫార్సు మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైంది.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
4. కింది వారిలో 1946లో కేబినెట్ కమిషన్ సభ్యులు కాని వారు ఎవరు?
1) పెతిక్ లారెన్స్
2) స్టాఫర్డ క్రిప్స్
3) ఎ.వి. అలెగ్జాండర్
4) లార్డ అట్లీ
- View Answer
- సమాధానం: 4
5. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సంబంధించి కింది మార్గదర్శక సూత్రాల్లో సరైంది ఏది?
ఎ) రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక
బి) ప్రతి పది లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి
1) ఎ సరైంది
2) బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి కాదు
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణానికి సంబంధింది సరైంది?
ఎ) రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు 1946 జూలై - ఆగస్టులో జరిగాయి
బి) రాజ్యాంగ పరిషత్తు ప్రారంభంలో సభ్యుల సంఖ్య 389
సి) 389 మందిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది
డి) స్వదేశీ సంస్థానాల నుంచి - 93
1) ఎ, బి
2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, సి
- View Answer
- సమాధానం: 2
7. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యులకు సంబంధించి సరైంది ఏది?
1) స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య - 299
2) బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైనవారు - 229
3) స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైనవారు - 70
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్‌కు బెంగాల్ నుంచి ఎంపికయ్యారు
బి) దేశ విభజన ఫలితం అంబేడ్కర్ తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు
సి) బాంబే రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్‌కు అంబేడ్కర్ నామినేట్ అయ్యారు
డి) అంబేడ్కర్ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్‌గా పనిచేశారు
1) ఎ
2) సి, డి
3) బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గాంధీజీని ‘బాపూజీ’ అని తొలిసారిగా నెహ్రూ సంబోధించారు
బి) గాంధీజీని ‘జాతిపిత’ అని తొలిసారిగా సుభాష్ చంద్రబోస్ సంబోధించారు
సి) గాంధీజీని ‘మహాత్మ’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారు
డి) రవీంద్రనాథ్ ఠాగూర్‌ను గాంధీజీ ‘గురుదేవ్’ లేదా ‘గురూజీ’ అని పిలిచారు
1) ఎ, బి, సి, డి
2) ఎ, డి
3) బి, సి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 1
10. కింది వారిలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరు?
1) శ్రీమతి సరోజినీ నాయుడు
2) విజయలక్ష్మి పండిట్
3) హంసా మెహతా
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
11. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాలకు ప్రాంతినిధ్యం వహించిన వారిలో సరైన జత ఏది?
జాబితా-I
i) ఆంగ్లో ఇండియన్లు
ii) పార్శీలు
iii) సిక్కులు
iv) అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు
జాబితా-II
a) ప్రాంక్ అంథోని
b) హెచ్.పి. మోడీ
c) బల్దేవ్ సింగ్
d) డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-c, ii-b, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 1
12. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది
బి) మొదటి సమావేశానికి 211 మంది హాజరయ్యారు
సి) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు
డి) ప్రాంక్ ఆంథోని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
1) ఎ, బి
2) ఎ, డి
3) బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
13. 1946 డిసెంబర్ 11న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించిందెవరు?
1) హెచ్.సి. ముఖర్జీ
2) వి.టి.కృష్ణమాచారి
3) జె.బి. కృపలానీ
4) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 3
14. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు ఎవరు?
1) బెనగల్ నరసింగ రావు
2) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
3) మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
4) ప్రాంక్ ఆంథోని
- View Answer
- సమాధానం: 1
15. రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు మొత్తం ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు?
1) 11
2) 22
3) 33
4) 44
- View Answer
- సమాధానం: 2
16. డ్రాఫ్టింగ్ కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
1) 5 + 1 = 6
2) 6 + 1 = 7
3) 1 + 7 = 8
4) 4 + 1 = 5
- View Answer
- సమాధానం: 2
17. కింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు?
1) కృష్ణస్వామి అయ్యంగార్
2) కె.ఎం. మున్షీ
3) గోపాలస్వామి అయ్యంగార్
4) గాంధీజీ
- View Answer
- సమాధానం: 4
18. రాజ్యాంగ పరిషత్.. రాజ్యాంగ ముసాయిదాను ఎప్పుడు ఆమోదించింది?
1) 1948 నవంబర్ 26
2) 1949 నవంబర్ 26
3) 1947 నవంబర్ 26
4) 1950 నవంబర 26
- View Answer
- సమాధానం: 2
19. రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం?
1) 2 సంవత్సరాల 10 నెలల 11 రోజులు
2) 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
3) 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
4) 1 సంవత్సరం
- View Answer
- సమాధానం: 3
20. భారత రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న జరిగిన చివరి సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284
2) భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను పరిషత్ ఎన్నుకొంది
3) జాతీయ గీతాన్ని, గేయాన్ని ఆమోదించింది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
21. జతపరచండి.
కమిటీలు:
i) రాజ్యాంగ సారథ్య సంఘం
ii) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
iii) రాజ్యాంగ సలహా సంఘం
iv) నిబంధనల కమిటీ
అధ్యక్షుడు:
a) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
b) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
c) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
d) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-a, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 3
22. రాజ్యాంగ పరిషత్‌లో సబ్‌కమిటీలను జతపరచండి.
జాబితా- I
i) ప్రాథమిక హక్కుల ఉపసంఘం
ii) ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ
iii) మైనారిటీల సబ్ కమిటీలు
iv) ప్రత్యేక ప్రాంతాల కమిటీ
జాబితా-II
a) జె.బి కృపలానీ
b) గోపినాథ్ బోడోలాయ్
c) హెచ్.సి. ముఖర్జీ
d) ఎ.వి. టక్కర్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-b, ii-c, iii-a, iv-d
- View Answer
- సమాధానం: 1
23. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
1) ఐరావతం
2) సింహం
3) పులి
4) నెమలి
- View Answer
- సమాధానం: 1
24. ఏ వ్యక్తిని రాజ్యాంగ పరిషత్‌కు స్నేహితుడు, మార్గదర్శిగా, తత్త్వవేత్తగా పేర్కొంటారు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
2) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
3) నెహ్రూ
4) డాక్టర్ బి.ఎన్. రావు
- View Answer
- సమాధానం: 4
25. ‘భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు’ అని పేర్కొంది ఎవరు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
2) బాబూ రాజేంద్రప్రసాద్
3) జవహర్లాల్ నెహ్రూ
4) కె. ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: 1
26. భారత రాజ్యాంగాన్ని ‘న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది’ అని వర్ణించిందెవరు?
1) సర్ ఐవర్ జెన్నింగ్
2) గ్రాన్విల్ ఆస్టిన్
3) విన్స్టన్ చర్చిల్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
27. రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నదెవరు?
1) ఒ.పి. గోయల్
2) జవహర్లాల్ నెహ్రూ
3) రాజేంద్రప్రసాద్
4) విన్స్టన్ చర్చిల్
- View Answer
- సమాధానం: 1
28. భారత రాజ్యాంగానికి నకలుగా కింది ఏ చట్టాన్ని పేర్కొంటారు?
1) 1919 చట్టం
2) 1935 భారత ప్రభుత్వ చట్టం
3) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
29. కింది వాటిలో భారత రాజ్యాంగంలో బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించని అంశం?
1) పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
2) ఎన్నికల వ్యవస్థ, ఏక పౌరసత్వం
3) సమన్యాయ పాలన
4) రాష్ట్రపతి ఎన్నిక విధానం
- View Answer
- సమాధానం: 4
30. అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించిన అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ) రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మహాభియోగ తీర్మానం
బి) న్యాయ సమీక్షాధికారం, ప్రాథమిక హక్కులు
సి) రాజ్యాంగ ప్రవేశిక
డి) లిఖిత రాజ్యాంగం
1) ఎ, బి, సి, డి
2) బి, సి, డి
3) సి, డి
4) బి, సి
- View Answer
- సమాధానం: 1
31. జతపరచండి.
జాబితా-I
i) ఉమ్మడి జాబితా
ii) రాజ్యాంగ సవరణ పద్ధతి
iii) ప్రాథమిక విధులు
iv) న్యాయ సమీక్ష
జాబితా-II
a) ఆస్ట్రేలియా
b) దక్షిణాఫ్రికా
c) రష్యా
d) అమెరికా
1) i-d, ii-c, iii-a, iv-b
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-c, iii-d, iv-b
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) భారత రాజ్యాంగంలోని ప్రారంభంలో 395 నిబంధనలు 8 షెడ్యూళ్లు 22 భాగాలు ఉన్నాయి
బి) ప్రస్తుతం 12 షెడ్యూళ్లు ఉన్నాయి
సి) ఐదో షెడ్యూల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ కులాల పరిపాలనా వివరాలు ఉన్నాయి
డి) ఏడో షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంది
1) ఎ మాత్రమే
2) డి మాత్రమే
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి
- View Answer
- సమాధానం: 3
33. 8వ షెడ్యూల్‌కు సంబంధించి సరైంది?
ఎ) గుర్తింపు పొందిన అధికార భాషల గురించి పేర్కొంటుంది
బి) రాజ్యాంగం అమలు నాటికి గుర్తింపు భాషలు - 14
సి) ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషలు - 22
డి) 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించిన భాషలు బోడో, డోంగ్రి, సంతాలి, మైథిలీ
1) ఎ, బి, సి, డి
2) ఎ, డి
3) ఎ, సి
4) సి, డి
- View Answer
- సమాధానం: 1
34. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన షెడ్యూల్ ఏది?
1) 1వ షెడ్యూల్
2) 3వ షెడ్యూల్
3) 7వ షెడ్యూల్
4) 10వ షెడ్యూల్
- View Answer
- సమాధానం: 4
35. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ ప్రధానమంత్రి కాలంలో అమల్లోకి వచ్చింది?
1) జవహర్లాల్ నెహ్రూ
2) పి.వి. నరసింహారావు
3) రాజీవ్ గాంధీ
4) మన్మోహన్ సింగ్
- View Answer
- సమాధానం: 3
36. భారత దేశాన్ని ‘అర్ధ సమాఖ్య’ అని వర్ణించింది ఎవరు?
1) పాల్ ఆఫ్ బీ
2) కె.సి. వేర్
3) డి.ఎన్. బెనర్జీ
4) మోరిస్ జోన్స్
- View Answer
- సమాధానం: 2
37. భారత రాజ్యాంగాన్ని ‘సహకార సమాఖ్య’ అని అభివర్ణించింది ఎవరు?
1) గ్రాన్విల్ ఆస్టిన్, డి.ఎన్. బెనర్జీ
2) పాల్ ఆఫ్ బీ
3) కె.సి. వేర్
4) ఐవర్ జెన్నింగ్స్
- View Answer
- సమాధానం: 1