భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి/ఖాతా పేరేమిటి?
భారత సమాఖ్య వ్యవస్థ :
1. భారత రాజ్యాంగంలో ‘సమాఖ్య’ అనే పదం ఎక్కడ ఉంది?
1) ఆర్టికల్–1
2) మొదటి షెడ్యూల్
3) మొదటి భాగం
4) ఎక్కడా లేదు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలో సమాఖ్యకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ ‘సమాఖ్య’ అనే పదాన్ని ఎక్కడా పొందుపర్చలేదు. ఆర్టికల్–1 భారతదేశాన్ని ‘రాష్ట్రాల ఐక్యత’ (Union of States)గా పేర్కొన్నది. దీనిలో అంతర్గతంగా రాష్ట్రాలు అనే పదంలో సమాఖ్య అనే భావన ఉన్నప్పటికీ సమాఖ్య అనే పదం మాత్రం లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1977లో కేంద్రానికి సమర్పించిన మెమోరాండంలో ఆర్టికల్–1లో ఉన్న ‘రాష్ట్రాల ఐక్యత’ను తొలగించి ‘సమాఖ్య’ను చేర్చాలని కోరింది.
- సమాధానం: 4
2. భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుంది?
1) అమెరికా
2) స్విట్జర్లాండ్
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత సమాఖ్యకు భారత ప్రభుత్వ చట్టం–1935 ఆధారం అయినప్పటికీ ఇది కెనడా దేశ సమాఖ్యను పోలి ఉంటుంది. ఇది కెనడా దేశం లాగా సాధారణ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాలు వాటి వాటి పరిధుల్లో పనిచేస్తూ సమాఖ్య లాగా కనిపిస్తుంది. అంటే వీటి మధ్య అధికార విభజన స్పష్టంగా కనిíపిస్తుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి సంపూర్ణ అధికారం ఉండటం వల్ల ఇది పూర్తిగా ఏకకేంద్ర ప్రభుత్వంగా కనిపిస్తుంది. అందుకే బీఆర్ అంబేడ్కర్ భారత సమాఖ్య వ్యవస్థను అవసరానికి అనుగుణంగా మారే సమాఖ్య అని వ్యాఖ్యానించారు.
- సమాధానం: 3
3. భారత సమాఖ్య వ్యవస్థను ‘సహకార సమాఖ్య’ గా వ్యాఖ్యానించింది?
1) కె.సి.వేర్
2) గ్రాన్విల్ ఆస్టిన్
3) మారిస్ జోన్స్
4) పాల్ ఆపిల్ బీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత సమాఖ్య వ్యవస్థను ‘సహకార సమాఖ్య’ అని రాజనీతి పండితుడు గ్రాన్విల్ ఆస్టిన్ వ్యాఖ్యానించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా, ఆర్థికçపరమైన అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. కాబట్టి సహకార సమాఖ్యగా పేర్కొన్నాడు.అదే విధంగా కె.సి.వేర్ భారత్‌ను ‘అర్థ సమాఖ్యగా వ్యాఖ్యానించగా; మారిస్ జోన్స్ ‘బేరమాడే సమాఖ్య’ అంటే; పాల్ ఆపిల్ బీ అనే పండితుడు భారత్ ‘తీవ్రమైన సమాఖ్య’ వ్యవస్థగా పేర్కొన్నాడు.
- సమాధానం: 2
4. కింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది?
1) ద్విసభ విధానం
2) అఖిల భారత సర్వీస్‌లు
3) అవశిష్ట అధికారాలు
4) ఏకీకృత న్యాయవ్యవస్థ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ద్విసభా విధానం, ద్వంద్వ ప్రభుత్వం, అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం, ధృఢ రాజ్యాంగం అనేవి భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు. కేంద్రంలో శాసనాలు నిర్మించటానికి రెండు సభలు ఉంటే దానిని ద్విసభా విధానం అంటారు. భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభ అయిన లోక్‌సభ ప్రత్యక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తే, ఎగువసభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిçస్తుంది. అందుకే రాజ్యసభను రాష్ట్రాల సభ అని అంటారు.
- సమాధానం: 1
5. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార విభజన గురించి ఉంది?
1) 6
2) 7
3) 8
4) 9
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో శాసనపరమైన అధికార విభజన గురించి ఉంది. ఇందులో అధికార విభజనను మూడు రకాలుగా మూడు జాబితాల్లో పొందుపర్చారు.
అవి :
1) కేంద్ర జాబితా: ఇందులో ఉన్న అంశాలపై కేంద్రమే శాసనాలు నిర్మిస్తుంది. ప్రారంభంలో ఇందులో 97 అంశాలు ఉంటే ప్రస్తుతం 100 ఉన్నాయి.
2) రాష్ట్ర జాబితా: ఇందులో ఉన్న అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. ప్రారంభంలో ఈ జాబితాలో 66 అంశాలు ఉంటే ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి.
3) ఉమ్మడి జాబితా: ఇందులో ఉన్న అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు శాసనాలు రూపొందించవచ్చు. ప్రారంభంలో ఇందులో 47 అంశాలు ఉంటే ప్రస్తుతం 52 ఉన్నాయి.
- సమాధానం: 2
6. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏ అంశంలో అధికార విభజన జరగలేదు?
1) శాసన సంబంధాలు
2) పరిపాలక సంబం«ధాలు
3) ఆర్థిక సంబంధాలు
4) న్యాయ సంబంధాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత రాజ్యాంగంలో కేంద్ర–రాష్ట్రాల సంబంధాలను మూడు విభాగాల కింద విభజించారు. 11, 12వ భాగాలలో వీటిని పొందుపర్చారు. అవి
ఎ) శాసన సంబంధాలు (11వ భాగంలో) ఆర్టికల్ 245 నుంచి 255 వరకు
బి) పరిపాలనా సంబంధాలు (11వ భాగంలో ఆర్టికల్ 256 నుంచి 263 వరకు)
సి) ఆర్థిక సంబంధాలు (12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300 అ వరకు)
- సమాధానం: 4
7. అవశిష్ట అధికారాలపై శాసనాలు నిర్మించే అధికారం ఎవరికి ఉంటుంది?
1) భారత పార్లమెంట్
2) రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ
3) స్థానిక ప్రభుత్వాలకు
4) 1, 2 సరైనవి
- View Answer
- సమాధానం: 1
వివరణ: 7వ షెడ్యూల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. వీటిపై శాసనం చేసే అధికారం భారత పార్లమెంట్‌కు ఉంటుంది. ఆర్టికల్–248 అవశిష్ట అధికారాల గురించి తెలుపుతుంది. దీనిని కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
- సమాధానం: 1
8. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు?
1) 252
2) 254
3) 262
4) 264
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆర్టికల్ 262 ప్రకారం నదీ జలాల వివాద పరిష్కారానికై పార్లమెంట్ అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. దీనికి అనుగుణంగా 1956లో అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని చేశారు.
ఇప్పటికి 8 ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు. అవి. నర్మదా ట్రిబ్యునల్ (1969), కృష్ణా ట్రిబ్యునల్ (1969), గోదావరి ట్రిబ్యునల్ (1969), రావి–బియాస్ ట్రిబ్యునల్ (1986), కావేరి ట్రిబ్యునల్ (1971), కృష్ణా జలాలపై రెండో ట్రిబ్యునల్ (2004), వంశధార ట్రిబ్యునల్ (2010), మహాదమి ట్రిబ్యునల్ (2010).
- సమాధానం: 3
9. అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1950
2) 1956
3) 1990
4) 1996
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర–రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికై, పరస్పర సహకారానికై అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఆర్టికల్–263 తెలుపుతుంది. అంతర్రాష్ట్ర మండలిని భారత రాష్ట్రపతి ఏర్పాటుచేస్తే దీనికి పదవీరీత్యా ప్రధాన మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తాడు. అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రులు; ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ–కశ్మీర్ ముఖ్యమంత్రులు; శాసన సభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు; ప్రధానమంత్రి నియమించే∙ఆరుగురు కేంద్ర మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్.వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1990లో తొలిసారిగా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో భారత ప్రధాన మంత్రి వి.పి. సింగ్.
- సమాధానం: 3
10. కింది వాటిలో రాజ్యాంగబద్ధమైంది ఏది?
1) నీతి ఆయోగ్
2) మండల సంఘాలు
3) ఆర్థిక సంఘం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర–రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకై అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఆర్టికల్–280 ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైంది. ఇందులో ఒక చైర్మన్, నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. దీని పదవీకాలం ఐదేళ్లు. కె.సి. నియోగి మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కాగా; ఎన్.కె. సింగ్ ప్రస్తుత 15వ ఆర్థిక సంఘం చైర్మన్. నీతి ఆయోగ్, మండల సంఘాలు రాజ్యాంగేతర సంస్థలు నీతి ఆయోగ్ కేంద్ర కేబినేట్ ఉత్తర్వు ద్వారా 2015 జనవరి 1న అమలులోకి వచ్చింది. పార్లమెంట్ చట్టం ద్వారా 1956లో 5 మండల సంఘాలు ఏర్పడితే, 1971లో ఆరో మండల సంఘం ఏర్పడింది.
- సమాధానం: 3
11. భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి/ఖాతా పేరేమిటి?
1) భారత సంఘటిత నిధి
2) భారత ఆగంతుక నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్–267 ప్రకారం ఏర్పడిన భారత ఆగంతుక నిధి రాష్ట్రపతి వద్ద ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, క్షామం వంటి అత్యవసర సందర్భాల్లో అయ్యే వ్యయాన్ని భరించడానికి రాష్ట్రపతి వద్ద ఉన్న ఈ ఖాతా నుంచి చెల్లిస్తారు. దీని నుంచి చెల్లించే చెల్లింపులకు పార్లమెంట్ అనుమతిని తర్వాత పొందవచ్చు. 1950లో ఆగంతుక నిధి చట్టం ప్రకారం 15 కోట్లతో దీనిని ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఆగంతుక నిధి రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది.
- సమాధానం: 2
12. మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ ఎవరు?
1) కె.హనుమంతయ్య
2) మొరార్జీ దేశాయ్
3) పి.వి. రాజమన్నార్
4) ఎమ్.సి. సెతల్వాడ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పరిపాలన రంగంలో సూచనలు చేయడానికి 1966లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1967లో మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దీనికి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో దీనికి కె.హనుమంతయ్య అధ్యక్షత వహించారు. 1970లో ఈ కమిషన్ సమర్పించిన నివేదికకు తుది రూపం ఇవ్వడానికి ఎం.సి. సెతల్వాడ్ నేతృత్వంలో నిçపుణుల కమిటీని వేశారు. ఈ కమిటీ 20 నివేదికలతో 581 సూచనలు చేసింది.
- సమాధానం: 2
13.రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై 1977లో కేంద్రానికీ మెమోరాండం సమర్పించిన రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్
2) కేరళ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: పశ్చిమ బెంగాల్లో 1977లో అధికారంలోకి వచ్చిన సీపీఎం పార్టీ (జ్యోతిబసు ముఖ్యమంత్రి) రాష్ట్రాలకు మరిన్ని అధికారాలకై కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించింది. అఖిల భారత సర్వీస్‌లను రద్దు చేయాలి; కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకు 75 శాతం వాటా ఇవ్వాలి; ఆర్టికల్ 356, 357, 360లను రద్దు చేయాలని మొదలగు సూచనలు చేసింది.
- సమాధానం: 1
14. కేంద్ర, రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఆర్.ఎస్. సర్కారియా కమిషన్‌ను నియమించినప్పుడు భారత ప్రధాని ఎవరు?
1) మొరార్జీ దేశాయ్
2) చరణ్ సింగ్
3) ఇందిరా గాంధీ
4) రాజీవ్ గాంధీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై 1983లో ఇందిరా గాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వం రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్‌ను నియమించింది. ఇది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1987లో 247 సిఫార్సులతో తన నివేదికను సమర్పించింది. ఈ కమిషన్‌కు సర్కారియా చైర్మన్ కాగా ఎస్.ఆర్. సేన్, బి. శివరామన్‌లు ఇతర సభ్యులు.
- సమాధానం: 3
15. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించాలని ఆనంద్‌పూర్ సాహెబ్ తీర్మానం చేసిన రాజకీయ పార్టీ?
1) పంజాబ్ కాంగ్రెస్ పార్టీ
2) అకాలీదళ్ పార్టీ
3) నేషనల్ కాన్ఫరెన్స్
4) లోక్‌మంచ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పంజాబ్‌లోని అకాలీదళ్ పార్టీ 1973లో ఆనంద్‌పూర్ సాహెబ్ గ్రామం వద్ద సమావేశమై రాష్ట్రాలకు మరింత అధికారం కల్పించాలని తీర్మానం చేసింది. ఇందులో ముఖ్యమైంది రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, కరెన్సీ, తంతి తపాలా మినహా మిగిలిన కేంద్ర జాబితాలోని అంశాలన్నింటిని రాష్ట్ర జాబితాలోకి మార్చాలని తీర్మానించింది.
- సమాధానం: 2
16. కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై ఎం.ఎం.పూంచి కమిషన్‌ను ఏ ప్రభుత్వం నియమించింది?
1) ఎన్డీఏ ప్రభుత్వం
2) నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
3) యూపీఏ ప్రభుత్వం
4) యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 3
వివరణ: మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2007లో కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకై మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో మరో నలుగురు సభ్యులతో కమిషన్‌ను నియమించింది. ఇది 2010లో 7 అధ్యాయాలతో 273 సిఫార్సులతో ఒక విస్తృతమైన నివేదికను సమర్పించింది. భారతదేశ సమైక్యతకు, సమగ్రతకు ‘సహకార సమాఖ్య వ్యవస్థ’ అవసరమని సూచించింది.
- సమాధానం: 3
17. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేసే అధికారాన్ని కేంద్రానికి కల్పిస్తున్న ఆర్టికల్స్?
1) 245, 246, 247, 248
2) 249, 250, 252, 253
3) 256, 257, 258, 259
4) 260, 261, 262, 263
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆర్టికల్–249 ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాజ్యసభ 2/3వ వంతు మెజారిటీతో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేయమని కోరితే పార్లమెంట్ శాసనం చేస్తుంది.
ఆర్టికల్–250 ప్రకారం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది.
ఆర్టికల్–252 ప్రకారం రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలు వారి ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా చట్టం చేయమని పార్లమెంట్‌ను కోరవచ్చు.
ఆర్టికల్–253 ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది.
- సమాధానం: 2