భారత రాజ్యాంగ స్వభావం, పరిణామ క్రమం
1. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది?
ఎ) బ్రిటిష్ రాణి లేదా రాజు
బి) ఇంగ్లండ్ పార్లమెంట్
సి) సమాఖ్య శాసనసభ
డి) కౌన్సిల్‌లోని గవర్నర్ జనరల్
- View Answer
- సమాధానం: డి
2. ‘చాలా సంవత్సరాలకు ముందే మనం విధి/ అదృష్టంతో నిర్ణీత సమాగమం చేశాం’ అని పేర్కొన్నారు?
ఎ) వల్లభాయ్ పటేల్
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) రాజగోపాలచారి
డి) బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: బి
3. 1946 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారి ప్రతిపాదించింది?
ఎ) సైమన్ కమిషన్
బి) క్రిప్స్ మిషన్
సి) వేవెల్ ప్లాన్
డి) కేబినెట్ మిషన్ ప్లాన్
- View Answer
- సమాధానం: డి
4. సైమన్ కమిషన్‌ను ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు?
ఎ) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించడం
బి) రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడం
సి) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
5. బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1776
బి) 1775
సి) 1777
డి) 1774
- View Answer
- సమాధానం: డి
6. బ్రిటిష్ ప్రభుత్వం 1878లో సివిల్ సర్వీసుల వయోపరిమితిని 19 ఏళ్లకు తగ్గించింది. మళ్లీ ఏ సంవత్సరం నుంచి దాన్ని 24 సంవత్సరాల వరకు పెంచింది?
ఎ) 1892
బి) 1905
సి) 1906
డి) 1924
- View Answer
- సమాధానం: ఎ
7. 1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఏమని వ్యవహరిస్తారు?
ఎ) చార్టర్ చట్టాలు
బి) కౌన్సిల్ చట్టాలు
సి) క్రౌన్ చట్టాలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
8. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కిందివాటిలో లేనిది?
ఎ) ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేశారు
బి) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు
సి) కౌన్సిల్ న్యాయచట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు
డి) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
- View Answer
- సమాధానం: డి
9. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీసు దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ -వారన్ హేస్టింగ్స్
బి) రెగ్యులేటింగ్ చట్టం-1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
10. భారత ప్రభుత్వ చట్టం - 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
ఎ) 2
బి) 3
సి) 5
డి) 6
- View Answer
- సమాధానం:బి
11.భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) వాట్సన్
బి) రాబర్ట్ క్లైవ్
సి) డూప్లెక్స్
డి) వారన్ హేస్టింగ్స్
- View Answer
- సమాధానం: బి
12. సి.ఆర్. ఫార్ములా దేనికి సంబంధించింది?
ఎ) ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం
బి) మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం
సి) భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
13.కిందివాటిలో భారత ప్రభుత్వ చట్టం- 1919లోని ప్రధాన అంశం ఏది?
ఎ) రాష్ట్రాల కార్య నిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం
బి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వచించడం
సి) కేంద్ర, రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
14. భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్ చట్టం ఏది?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1861
బి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1862
సి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1909
డి) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం- 1919
- View Answer
- సమాధానం: ఎ
15. ‘గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం’ అని నెహ్రూ దేని గురించి పేర్కొన్నారు?
ఎ) కేబినెట్ ప్లాన్
బి) మౌంట్ బాటన్ ప్లాన్
సి) వేవెల్ ప్లాన్
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: డి
16. ‘మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) లార్డ్ మింటో
బి) లార్డ్ బెంటింక్
సి) వారన్ హేస్టింగ్స్
డి) రాబర్ట్ క్లైవ్
- View Answer
- సమాధానం:ఎ
17. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడింది?
ఎ) చార్టర్ చట్టం-1833
బి) చార్టర్ చట్టం-1853
సి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1861
డి) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1892
- View Answer
- సమాధానం: బి
18. మౌంట్ బాటన్ ప్రణాళిక లక్ష్యం ఏమిటి?
ఎ) సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం
బి) రాజ్యాంగ సభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలివ్వడం
సి) బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి
డి) ఆ కాలంలో చెలరేగిన మతకల్లోలాలను నివారించడానికి ప్రణాళిక
- View Answer
- సమాధానం: సి
19. కిందివాటిలో ఉడ్స్ డిస్పాచ్ (తాఖీదు) 1854 సిఫారసు కానిది ఏది?
ఎ) సాంకేతిక విద్య, మహిళా విద్య కోసం స్కూళ్లను ఏర్పాటు చేయడం
బి) ప్రైవేట్ భాగస్వామ్యం కోసం గ్రాంట్లు ఇవ్వడం
సి) విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు
డి) బొంబాయి, బెంగాల్, మద్రాస్‌లలో ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటు
- View Answer
- సమాధానం: సి
20. ద్వంద్వ పరిపాలనను దేని ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1892
బి) భారత ప్రభుత్వ చట్టం-1909
సి) భారత ప్రభుత్వ చట్టం-1919
డి) గాంధీ - ఇర్విన్ ఒడంబడిక
- View Answer
- సమాధానం: సి
21.1947 స్వతంత్ర భారతదేశంలో మొదటి మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి ఎవరు?
ఎ) వి.ఎన్. గాడ్గిల్
బి) రాజేంద్రప్రసాద్
సి) జాన్ మథాయ్
డి) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: డి
22.భారత రాజ్యాంగంలోకి కింద పేర్కొన్న ఏ అంశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ - 1935 నుంచి స్వీకరించలేదు?
ఎ) గవర్నర్ ఆఫీసు
బి) అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన అధికారాలు
సి) సమాఖ్య విధానం
డి) చట్టబద్ధమైన పరిపాలన
- View Answer
- సమాధానం: డి
23. ‘భారత ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టా’గా కిందివాటిలో దేన్ని పేర్కొంటారు?
ఎ) వేవెల్ ప్రతిపాదన
బి) క్రిప్స్ ప్రతిపాదన
సి) కేబినెట్ రాయబార ప్రతిపాదన
డి) విక్టోరియా రాణి ప్రకటన
- View Answer
- సమాధానం: డి
24. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది?
ఎ) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
బి) రెండో రౌండ్ టేబుల్ సమావేశం
సి) మూడో రౌండ్ టేబుల్ సమావేశం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం:బి
25. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనలను ఏవిధంగా పిలుస్తారు?
ఎ) ఆగస్టు ప్రతిపాదనలు-1940
బి) సెప్టెంబర్ ప్రతిపాదనలు-1940
సి) అక్టోబర్ ప్రతిపాదనలు-1940
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
26. భారతదేశంలో పోటీ పరీక్షలను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1852
బి) 1853
సి) 1854
డి) 1858
- View Answer
- సమాధానం: డి
27. కింది వాటిలో కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏది?
ఎ) హిందూ-ముస్లింల మధ్య సయోధ్య కుదిర్చే ప్రతిపాదన
బి) మైనారిటీల ప్రాతినిధ్య పథకం
సి) బలహీన వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్యం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
28. కిందివాటిలో భారత రాజ్యాంగ రచనపై అత్యంత ప్రభావం చూపింది ఏది?
ఎ) అమెరికా రాజ్యాంగం
బి) బ్రిటిష్ రాజ్యాంగం
సి) ఐరిష్ రాజ్యాంగం
డి) భారత ప్రభుత్వ చట్టం-1935
- View Answer
- సమాధానం: డి
29.రెగ్యులేటింగ్ చట్టం-1773కు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
ఎ) దీన్ని మొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు
బి) కంపెనీ పాలనపై పార్లమెంట్ మొదటి నియంత్రణ
సి) భారత పరిపాలనకు సంబంధించిన మొదటి ప్రయత్నం
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: డి
30. కిందివాటిలో సరైంది?
ఎ) భారత స్వాతంత్య్ర సమయంలో బ్రిటన్ ప్రధాని - అట్లీ
బి) భారత స్వాతంత్య్ర సమయంలో బ్రిటన్ రాజు - నాలుగో కింగ్ జార్జ్
సి) స్వాతంత్య్ర సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షులు - జె.బి.కృపలానీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
31. జతపరచండి.
ఎ) 1-c, 2-b, 3-d, 4-a జాబితా - 1 జాబితా - 2 1) పోర్ట ఫోలియో పద్ధతి a) లార్డ్ మెకాలే 2) సివిల్ సర్వీసు పితామహుడు b) లార్డ్ కార్నవాలీస్ 3) మత నియోజకవర్గాలు c) లార్డ్ కానింగ్ 4) భారత న్యాయ సంస్కరణలు d) లార్డ్ మింటో
బి) 1-b, 2-c, 3-a, 4-d
సి) 1-d, 2-a, 3-b, 4-c
డి) 1-a, 2-b, 3-d, 4-c
- View Answer
- సమాధానం: ఎ
32.కింద పేర్కొన్న అంశాలను ప్రవేశపెట్టిన కాలాల సరైన వరస క్రమం ఏది?
1) ప్రత్యేక నియోజకవర్గాలు
2) శాసన అధికారాల బదలాయింపు
3) ద్విసభా విధానం
4) డొమినియన్ ప్రతిపత్తి
ఎ) 1, 2, 3, 4
బి) 2, 1, 3, 4
సి) 3, 2, 1, 4
డి) 3, 4, 1, 2
- View Answer
- సమాధానం: ఎ
33. రాజ్యాంగ వికాసానికి సంబంధించిన సరైన క్రమం ఏది?
ఎ) మాగ్నాకార్టా, యూఎస్ రాజ్యాంగం, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం
బి) మాగ్నాకార్టా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్మెంట్ చట్టం, యూఎస్ రాజ్యాంగం
సి) బిల్ ఆఫ్ రైట్స్, మాగ్నాకార్టా, సెటిల్మెంట్ చట్టం, యూఎస్ రాజ్యాంగం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
34. కిందివాటిలో భారత కౌన్సిళ్ల చట్టాలు ఏవి?
1) 1909
2) 1861
3) 1813
4) 1892
ఎ) 1, 2, 4
బి) 1, 2, 3
సి) 3, 4
డి) 2, 4
- View Answer
- సమాధానం: ఎ
35. ప్రభుత్వానికి ఉండే అధికారం ఏ రకమైంది?
ఎ) సంప్రదాయ అధికారం
బి) సమ్మోహనాధికారం
సి) చట్టబద్ధ - హేతుబద్ధ అధికారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి