ఆదేశ సూత్రాలు-ప్రాథమిక విధులు
1.రాజ్యాంగ ప్రకరణలు-వివరించే అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) 39(c) - స్త్రీ, పురుషులిద్దరికీ సమాన వేతనం
2) 39(d) - సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు
3) 39(a) - తగిన జీవన విధానాన్ని ఎంపిక చేసుకోవడంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉండాలి
4) 39(f) - బాలలు ఆరోగ్యంగా, స్వేచ్ఛాయుతంగా, గౌరవప్రదంగా పెరిగేలా వారికి అవకాశాలు కల్పించాలి
ఎ) 1, 2
బి) 2, 3
సి) 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: సి
2. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించే రాజ్యాంగ అధికరణ ఏది?
ఎ) 43
బి) 43A
సి) 43B
డి) 48A
- View Answer
- సమాధానం: బి
3. ఆదేశ సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
1) ఒక రాజ్యం కార్యకలాపాల పరిధిని ఇవి విస్తృతం చేస్తాయి
2) ఇవి సకారాత్మకమైనవి (Positive)
3) శాసనాలు రూపొందించడంలో, అమలు చేయడంలో ప్రాథమికాలు
4) శ్రేయో రాజ్య స్థాపనకు ఉద్దేశించినవి
ఎ) 1, 2
బి) 2, 3
సి) 3, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
4. భారత రాజ్యాంగం ప్రకారం.. ఆదేశ సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) మూడు
బి) రెండు
సి) వర్గీకరణ లేదు
డి) ఒకటి
- View Answer
- సమాధానం: సి
5. కింది వాటిలో సరైనవి ఏవి?
1) బోనస్ చెల్లింపుల చట్టం - 1965
2) కనీస వేతనాల చట్టం - 1948
3) వేతనాల చెల్లింపు చట్టం - 1936
4) ఫ్యాక్టరీల చట్టం - 1948
5) వారాంతపు సెలవు చట్టం - 1941
ఎ) 1, 2, 4
బి) 2, 4, 5
సి) 1, 2, 3, 5
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
6. ‘ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలోని అధికారాలకు నీతి బోధనలు చేయడానికి ఉద్దేశించినవి. ఈవిధంగా అవి విద్యాపరమైన విలువలను ప్రతిబింబిస్తాయి’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఎ) బి.ఎన్. రావు
బి) ఎల్.ఎం. సింఘ్వీ
సి) హెచ్.సి. చాగ్లా
డి) అంబేడ్కర్
- View Answer
- సమాధానం: ఎ
7. కింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం-1976 ప్రకారం చేర్చిన అధికరణలు ఏవి?
1) 38(2)
2) 39(f)
3) 39(A)
4) 43(A)
ఎ) 2, 3, 4
బి) 1, 2
సి) 1, 2, 3, 4
డి) 3, 4
- View Answer
- సమాధానం:ఎ
8. ఆదేశ సూత్రాలకు న్యాయ రక్షణ లేదని ఏ అధికరణలో పేర్కొన్నారు?
ఎ) 37
బి) 36
సి) 38
డి) 39A
- View Answer
- సమాధానం: ఎ
9. అధికరణ 43Bను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) 42వ రాజ్యాంగ సవరణ చట్టం,1976
బి) 44వ రాజ్యాంగ సవరణ చట్టం,1978
సి) 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
డి) 96వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
- View Answer
- సమాధానం: సి
10. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) జాతీయ అటవీ విధానం - 1980
బి) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986
సి) వన్యప్రాణుల సంరక్షణ చట్టం- 1972
డి) అటవీ సంరక్షణ చట్టం - 1980
- View Answer
- సమాధానం: ఎ
11.‘చారిత్రక, ప్రాచీన కళా సంపద రక్షణ చట్టం’ను ఏ సంవత్సరంలో చేశారు?
ఎ) 1952
బి) 1951
సి) 1961
డి) 1950
- View Answer
- సమాధానం: బి
12. ప్రాథమిక విధులను కింది వాటిలో ఏ మెజారిటీ ద్వారా సవరిస్తారు?
ఎ) పార్లమెంటు సాధారణ మెజారిటీ
బి) పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీ
సి) పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీ, రాష్ట్రాల విధానసభల సాధారణ మెజారిటీ
డి) పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీ, రాష్ట్రాల శాసనసభల 2/3వ వంతు మెజారిటీ
- View Answer
- సమాధానం: బి
13. ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి?
ఎ) మూడో భాగం
బి) నాలుగో భాగం
సి) అయిదో భాగం
డి) రెండో భాగం
- View Answer
- సమాధానం: బి
14. భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలపై కింది వాటిలో దేని ప్రభావం ఉంది?
ఎ) పేబియన్ సామ్యవాద సిద్ధాంతం
బి) శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతం
సి) ఊహాత్మక సామ్యవాద సిద్ధాంతం
డి) శ్రామిక సంఘ సామ్యవాద సిద్ధాంతం
- View Answer
- సమాధానం: ఎ
15.సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ప్రాథమిక విధులను సిఫారసు చేసింది?
ఎ) 8
బి) 10
సి) 7
డి) 9
- View Answer
- సమాధానం: ఎ
16. ‘అధికరణ-39A ప్రకారం.. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
ఎ) హుస్సేనారా ఖాథూన్ గట స్టేట్ ఆఫ్ బిహార్ 1979
బి) వాసుదేవన్ గట యూనియన్ ఆఫ్ ఇండియా 1990
సి) మహర్షి గట యూనియన్ ఆఫ్ ఇండియా 1994
డి) హంగ్రాజ్ గట యూనియన్ ఆఫ్ ఇండియా 1990
- View Answer
- సమాధానం:ఎ
17. కింది వాటిలో అధికరణ 51కి సంబంధించిన అంశాలేవి?
1) అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం
2) దేశాల మధ్య న్యాయమైన, గౌరవప్రదమైన సంబంధాలను నెలకొల్పడం
3) అంతర్జాతీయ శాసనాలు, సంధి బాధ్యతల పట్ల గౌరవం పెంపొందించడం
4) అంతర్జాతీయ వివాదాలను అంతర్జాతీయ సంస్థల ద్వారా పరిష్కరించుకోవడం
ఎ) 1, 2
బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4
డి) 2, 3, 4
- View Answer
- సమాధానం: బి
18. జనవరి-3 ప్రాధాన్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ప్రాథమిక హక్కుల దినోత్సవం
బి) ప్రాథమిక విధుల దినోత్సవం
సి) ఆదేశ సూత్రాల దినోత్సవం
డి) భారత రాజ్యాంగ ముసాయిదా రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన రోజు
- View Answer
- సమాధానం: బి
19. ప్రాథమిక విధులు ఎవరికి వర్తిస్తాయి?
ఎ) భారత పౌరులకు మాత్రమే
బి) భారత పౌరులు, విదేశీయులకు
సి) ప్రభుత్వ అధికారులకు మాత్రమే
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: ఎ
20.భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
ఎ) 1976 జనవరి 3
బి) 1977 జనవరి 3
సి) 1976 మార్చి 3
డి) 1977 ఫిబ్రవరి 3
- View Answer
- సమాధానం: బి
21. ప్రాథమిక విధుల అమలు, ఉల్లంఘనలకు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
ఎ) సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ
బి) జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ
సి) జె.బి. కృపలాని కమిటీ
డి) వల్లభాయ్ పటేల్ కమిటీ
- View Answer
- సమాధానం: బి
22. ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటిలో సరైన అంశాలు ఏవి?
1) ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి
2) దేశ సమగ్రతకు తోడ్పడాలి
3) హింసను విడనాడాలి
4) సంపద ఉన్నవారిని గౌరవించాలి
ఎ) 1, 2, 3
బి) 3, 4
సి) 1, 2, 3, 4
డి) 2, 3, 4
- View Answer
- సమాధానం: ఎ
23. రిట్స్ జారీ చేయడం ద్వారా ప్రాథమిక విధులను అమలుపరచలేమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?
ఎ) బన్వాసి సేవ గట స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ - 1986
బి) రామ్ ప్రసాద్ గట స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ - 1988
సి) సూర్యనారాయణ చౌదరి గట యూనియన్ ఆఫ్ ఇండియా - 1982
డి) శ్రీసచ్చిదానంద పాండే గట స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ - 1987
- View Answer
- సమాధానం: సి
24. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
ఎ) ఫ్రెంచ్
బి) సోవియట్ రష్యా
సి) అమెరికా
డి) ఐర్లాండ్
- View Answer
- సమాధానం:బి
25. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఆదేశ సూత్రాలకు మరికొన్నింటిని అదనంగా చేర్చారు?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976
3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978
4) 97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011
ఎ) 2, 3, 4
బి) 1, 2
సి) 1, 2, 3
డి) 2, 3
- View Answer
- సమాధానం: ఎ
26. ఆదేశ సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) ఐర్లాండ్
బి) ఇంగ్లండ్
సి) జర్మనీ
డి) జపాన్
- View Answer
- సమాధానం: ఎ
27. ఆదేశ సూత్రాలను సవరించే అధికారం ఎవరికి/ దేనికి ఉంది?
ఎ) పార్లమెంటు
బి) రాష్ట్రపతి
సి) రాష్ట్రాల విధాన పరిషత్
డి) సుప్రీంకోర్టు
- View Answer
- సమాధానం: ఎ
28. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ‘పర్యావరణ పరిరక్షణ’ను ఆదేశ సూత్రాల్లో చేర్చారు?
ఎ) 44
బి) 42
సి) 73
డి) 74
- View Answer
- సమాధానం: బి
29. ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం.. భారత రాజ్యం ప్రజలందరికీ సరిపోయేంత జీవన మార్గాన్ని సమకూర్చాలి?
ఎ) 36
బి) 37
సి) 38
డి) 39
- View Answer
- సమాధానం: డి
30. జాతీయ పతాకాన్ని గౌరవించడం..
ఎ) చట్టానికి భయపడి చేయాలి
బి) ప్రాథమిక హక్కు
సి) ప్రాథమిక బాధ్యత
డి) కోర్టు తీర్పును అనుసరించి చేయాలి
- View Answer
- సమాధానం: సి
31. ఆదేశ సూత్రాల సహజ స్థితి ఏమిటి?
ఎ) న్యాయ రక్షణ ఉంది
బి) న్యాయ రక్షణ లేదు
సి) కోర్టు తీర్పుకు వదిలేయాలి
డి) పరిపాలించేవారు నిర్ణయం తీసుకోవాలి
- View Answer
- సమాధానం: బి
32. పంచాయతీలను ఏ అధికరణం ప్రకారం ఏర్పాటు చేశారు?
ఎ) అధికరణ-34
బి) అధికరణ-38
సి) అధికరణ-39
డి) అధికరణ-40
- View Answer
- సమాధానం: డి
33. భారత రాజ్యాంగంలో గాంధేయ సూత్రాలు కలిగిన భాగం ఏది?
ఎ) మొదటి భాగం
బి) మూడో భాగం
సి) నాలుగో భాగం
డి) రెండో భాగం
- View Answer
- సమాధానం:సి
34. ‘సంక్షేమ రాజ్య భావన’ను ఎందులో పేర్కొన్నారు?
ఎ) ఆదేశ సూత్రాలు
బి) ప్రాథమిక హక్కులు
సి) ప్రాథమిక విధులు
డి) సమన్యాయ పాలన
- View Answer
- సమాధానం: ఎ
35. ప్రాథమిక విధుల గురించి వివరించే భారత రాజ్యాంగంలోని ఐగఅ భాగంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి?
ఎ) ఒకటి
బి) రెండు
సి) మూడు
డి) నాలుగు
- View Answer
- సమాధానం: ఎ
36. భారతదేశంలో కింది వాటిలో దేనిని రక్షించడం ప్రాథమిక విధి?
ఎ) గ్రామ పంచాయతీలు
బి) జాతీయ జెండా
సి) షెడ్యూల్డ్ కులాలు
డి) వన్యప్రాణులు
- View Answer
- సమాధానం: డి
37. బలహీన వర్గాల విద్య, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ తెలుపుతుంది?
ఎ) 40
బి) 46
సి) 75
డి) 14
- View Answer
- సమాధానం: బి
38. ‘ఆదేశ సూత్రాలు సామాజిక విప్లవ ఉద్దేశాలు కొనసాగడానికి సహాయపడే అంశాలపై దృష్టి సారిస్తాయి’ అని ఎవరు భావించారు?
ఎ) అంబేడ్కర్
బి) పణిక్కర్
సి) ఆస్టిన్
డి) బి.ఎన్. రావు
- View Answer
- సమాధానం: సి