103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019, 370 అధికరణ, ట్రిపుల్ తలాక్ బిట్‌బ్యాంక్
1. 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 ఎవరిని ఉద్దేశించింది?
1) ఆర్థికంగా వెనుకబడిన పేదలకు
2) ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు
3) సామాజికంగా వెనుకబడిన పేదలకు
4) రాజకీయంగా వెనుకబడిన పేదలకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా ఇప్పటికీ ఏ రిజర్వేషన్ పొందని వర్గాలకు 10% రిజర్వేషన్ అందుతుంది.
- సమాధానం: 1
2. 103వ రాజ్యాంగ సవరణ చట్టం(2019) ప్రకారం సంవత్సరానికి ఎన్ని లక్షల ఆదాయం దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు?
1) 9 లక్షలు
2) 18 లక్షలు
3) 8 లక్షలు
4) 10 లక్షలు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రిజర్వేషన్ పొందాలంటే ఆర్థికంగా పరిమితులు విధించారు. ఈ చట్టం ప్రకారం సంవత్సర ఆదాయం 8 లక్షల్లోపు ఉన్నవారికి, 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి, అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల్లోపు నివాస ఫ్లాట్ లేదా 100 చదరపు గజాలలోపు నివాస స్థలం ఉన్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 200 చ. గజాల లోపు నివాస స్థలం ఉన్నవారు అర్హులు.
- సమాధానం: 3
3. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా(2019) రాజ్యాంగంలో ఏ అధికరణలు కొత్తగా చేర్చారు?
1) 15(4), 15(5)
2) 15(4), 16(4)
3) 15(5), 16(5)
4) 15(6), 16(6)
- View Answer
- సమాధానం: 4
వివరణ: 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సమానత్వపు హక్కుకు సంబంధించిన 15, 16 అధికరణలకు సబ్ క్లాజులను చేర్చారు. 15(6) సబ్ క్లాజ్‌ను చే ర్చి వివిధ విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇప్పుడున్న రిజర్వేషన్లకు ఆదనంగా 10% కోటాను పొందుపర్చారు(మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు). 16(6) సబ్ క్లాజును చేర్చి ఉద్యోగాల్లో 10 శాతం అదనపు రిజర్వేషన్ కోటాను పొందుపర్చారు.
- సమాధానం: 4
4. 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019కిరాష్ర్టపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు?
1) 2019 జనవరి 10
2) 2019 జనవరి 11
3) 2019 జనవరి 8
4) 2019 జనవరి 12
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈ బిల్లు లోక్‌సభలో 2019 జనవరి 9న పాసయ్యింది. మొత్తం ఆ రోజు 326 మంది ఎంపీలు హాజరయ్యారు. అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజ్యసభ ఈ బిల్లును సుదీర్ఘ చర్చల తర్వాత జనవరి 10న ఆమోదించింది. అనుకూలంగా 165 ఓట్లు,వ్యతిరేకంగా 7 ఓట్లు మాత్రమే వచ్చాయి.బిల్లును రాష్ర్టపతి 2019 జనవరి 12న ఆమోదించారు. అదే రోజు గెజిట్‌లో ముద్రించారు. 2019 జనవరి 14 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
- సమాధానం: 4
5. 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 అమల్లోకి రావటంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు ఎంత శాతం అయ్యాయి?
1) 55%
2) 59.5%
3) 69.5%
4) 58.5%
- View Answer
- సమాధానం: 2
వివరణ: 103వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు భారతదేశంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం మీద 49.5% ఉండేవి. 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడంతో 10% రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి లభించింది. తద్వారా దేశంలో రిజర్వేషన్ల శాతం 59.5% పెరిగింది.
- సమాధానం: 2
6. ఏ కేసులో సుప్రీం కోర్టు ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది?
1) ఇందిరా సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా(1992)
2)చంపకం దొరై రాజన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్(1951)
3) ఎ.బి.ఎస్.కె. సిన్హా vs యూనియన్ ఆఫ్ ఇండియా(1981)
4) 1 మాత్రమే సరైంది.
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1991లో అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందిరా సహాని ఠిట యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% దాటరాదని తీర్పునిచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప రిజర్వేషన్లు 50% దాటరాదని చెప్పింది.
- సమాధానం: 4
7. ఏ రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడిన పేదవారికి 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాయి?
1) మహారాష్ర్ట
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం పొందడంతో మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తమ రాష్ట్రాల్లో 10% అమలు చేస్తామని ప్రకటించాయి.
- సమాధానం: 4
8. భారత రాజ్యాంగంలో ఉన్న 370 అధికరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1949 నవంబర్ 26
2) 1949 అక్టోబర్ 26
3) 1949 అక్టోబర్ 17
4) 1949 అక్టోబర్ 7
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్వతంత్ర భారతదేశంలో జమ్మూకశ్మీర్‌ను విలీనం చేసేందుకు రాజా హరిసింగ్ అంగీకరించారు. అయితే ఇందుకు కొన్ని షరతులు పెట్టారు. వీటన్నింటిని స్పష్టంగా లిఖించి ‘ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెసస్(ఐఓఏ)’ పేరుతో ధ్రువ పత్రం రాసిచ్చారు. దాని ప్రకారం ఐఓఏ ధ్రుడపరుస్తూ రాజ్యాంగంలో అర్టికల్ 370ను చేర్చారు. ఈ నిబంధన తాత్కాలిక నిబంధనగా పేర్కొంటూ 1949 అక్టోబర్ 17 నుంచి అమల్లోకి తెచ్చారు.
- సమాధానం: 3
9. 370 అధికరణ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏఏ అంశాలపై జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేయవచ్చు?
1) ఆర్థిక వ్యవహారాలు
2) రక్షణ వ్యవహారాలు
3) విదేశీ వ్యవహారాలు, సమాచార రంగం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి తప్ప మిగిలిన అంశాలకు సంబంధించిన చట్టాలు జమ్మూకశ్మీర్‌లో అమలు కావాలంటే ఆ రాష్ర్ట శాసనసభలో ఆమోదించాలి.
- సమాధానం: 4
10. అర్టికల్ 35(ఎ)ను జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేస్తూ ఎప్పుడు భారత రాష్ర్టపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేశారు?
1) 1954
2) 1952
3) 1953
4) 1955
- View Answer
- సమాధానం: 1
వివరణ: 370వ అధికరణ సవరణలు, మార్పులు చేసే అధికారం రాష్ర్టపతికి ఉంది. ఆ క్రమంలో భారత రాష్ర్టపతి 35(ఎ) అధికరణను జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి వర్తింపచేస్తూ 1954 మే 14న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేశారు. దీన్ని ఆ రాష్ర్ట రాజ్యాంగ సభ కూడా ఆమోదించింది.
- సమాధానం: 1
11. అర్టికల్ 35(ఎ) అధికరణ ద్వారా జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కులు ఏవి?
1) జమ్మూకశ్మీర్‌లో పుట్టిన వారికి మాత్రమే సర్వ హక్కులు.
2)భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడ స్థిర నివాసం ఉండరాదు. ఆస్తులు కొనరాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు పొందరాదు.
3) జమ్మూకశ్మీర్ రాష్ట్రీయులకు ప్రత్యేక పౌరసాత్వం ఉంటుంది
4)పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
వివరణ: 1954 మే 14వ తేదిన రాష్ర్టపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్లో ఆర్డర్ ప్రకారం జమ్మూకశ్మీర్‌కు పూర్తి హక్కులు లభించాయి.
- సమాధానం: 4
12. 1954లో రాష్ర్టపతి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, భారత రాజ్యాంగం ప్రకారం అన్ని చట్టాలు కశ్మీర్‌కు వర్తిస్తాయని ఎప్పుడు రాష్ర్టపతి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు?
1) 2019 ఆగస్టు 5
2) 2019 ఆగస్టు 6
3) 2019 ఆగస్టు 4
4) 2019 ఆగస్టు 3
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1954 మే 14న అప్పటి రాష్ర్టపతి జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ ప్రస్తుత రాష్ర్టపతి 2019 ఆగస్టు 5న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా భారత ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు జమ్మూకశ్మీర్‌కు వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. తద్వారా 35(ఎ)అధికరణ ద్వారా పొందిన అన్ని హక్కులు రద్దయ్యాయి.
- సమాధానం: 1
13. 2019 ఆగస్టు 6న భారత రాష్ర్టపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వు దేనికి సంబంధించింది?
1)370 అధికరణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు
2)జమ్మూకశ్మీర్‌ను విభజిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు
3)జమ్మూకశ్మీర్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించడం కోసం చేసిన ఉత్తర్వులు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రస్తుత భారత రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ‘370’ అధికరణ అమలును నిలుపుదల చేస్తూ 2019 ఆగస్టు 6న మరో ఉత్తర్వు జారీచేశారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ‘370’ అధికరణ పనిచేయదు. కేంద్ర ప్రభుత్వం ఇది తాత్కాలిక నిబంధన అని ప్రకటించి దాన్ని నిలుపుదల చేశారు.
- సమాధానం: 1
14. ప్రస్తుతం జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాన్ని ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు?
1) రెండు
2) మూడు
3) నాలుగు
4) ఐదు
- View Answer
- సమాధానం: 1
వివరణ: జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ, కశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్ధాఖ్ మరొక కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టం చేసింది. వీటిలో జమ్మూ, కశ్మీర్‌కు శాసన సభ ఉంటుంది. లద్ధాఖ్‌కు శాసన సభ ఉండదు.
- సమాధానం: 1
15. ‘ట్రిపుల్ తలాక్’ ద్వారా ముస్లీం మహిళలకు విడాకులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది?
1) 2017 ఆగస్టు 19
2) 2017 ఆగస్టు 22
3) 2017 ఆగస్టు 25
4) 2017 ఆగస్టు 16
- View Answer
- సమాధానం: 2
వివరణ: మొదటిసారిగా అలహాబాద్ హైకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ కేసు చివరకు సుప్రీం కోర్టులో విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఆ క్రమంలో 2019 ఫిబ్రవరిలో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్సను 2019 జూలై 30న ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంగా రూపాంతరం చెందింది.
- సమాధానం: 2
16. ‘ట్రిపుల్ తలాక్’ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది?
1) 3
2) 2
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2019 ఆగస్టు 1న ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును రాష్ర్టపతి ఆమోదించారు. తద్వారా ఈ బిల్లు చట్టంగా మారింది. ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ముస్లీం పురుషులకు గరిష్టంగా మూడు సంవత్సరాలు శిక్ష పడుతుంది. అదే విధంగా జడ్జీ నిర్ణయించిన మేరకు ఫైన్ విధిస్తారు.
- సమాధానం: 1
17. ఏ ఏ మార్గాల ద్వారా ‘తక్షణం మూడు సార్లు’ తలాక్ చెప్పడం ‘నేరం’ అని ఈ చట్టం చెబుతుంది?
1) ఎస్.ఎం.ఎస్
2) వాట్సాప్
3) రాతపూర్వకంగా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
వివరణ: మూడుసార్లు తలాక్ చెప్పడం నేరం. ఎస్.ఎం.ఎస్, వాట్సాప్ ద్వారాగానీ, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్దతిలో చెప్పిన ఆ చర్య నేరమని ఈ చట్టం తెలియజేస్తుంది. ఎవరైన ముస్లీం పురుషుడు ‘తలాక్-ఎ-బిద్దత్’ పద్దతిలో భార్యకు విడాకులిచ్చారని ఫిర్యాదు చేస్తే వారెంటీ లేకుండానే అతడిని అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకు ఈ చట్టం ఇస్తుంది. అయితే బాధిత మహిళ, ఆమె రక్త సంబంధీకులు, అత్తింటి వారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళ వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరమనుకుంటే బెయిల్ మంజూరు చేయవచ్చు. విడాకుల తర్వాత తాను తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళకు హక్కు ఉంటుంది.
- సమాధానం: 4