సింధూ నాగరికత
1.కింది వాటిలో సింధూ ప్రజలకు తెలియని లోహం ఏది?
1) బంగారం
2) ఇనుము
3) వెండి
4) రాగి
- View Answer
- సమాధానం: 2
2. హరప్పా నాగరికతకు సంబంధించిన ఏ ప్రదేశంలో వరి పండించిన ఆధారాలు లభించాయి?
1) కాలీబంగన్
2) లోథాల్
3) బన్వాలి
4) రూపార్
- View Answer
- సమాధానం: 1
3. హరప్పా నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు?
1) సుట్కజెండార్
2) అమ్రి
3) రూపార్
4) సుర్కటుడా
- View Answer
- సమాధానం: 4
4. సింధూ నాగరికతకు సంబంధించిన స్థావరాల్లో అతి చిన్నది ఏది?
1) లోథాల్
2) హరప్పా
3) కాలీబంగన్
4) అల్లాదినోహ్
- View Answer
- సమాధానం: 4
5. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవుగా చరిత్రకారులు దేన్ని పేర్కొన్నారు?
1) విశాఖపట్నం
2) లోథాల్
3) పారదీప్
4) ముంబయి
- View Answer
- సమాధానం: 2
6. సింధూ ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది?
1) పులి
2) ఎద్దు
3) ఏనుగు
4) ఖడ్గమృగం
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో కోట గోడలు లేని హరప్పా నగరం ఏది?
1) చాన్హుదారో
2) కాలీబంగన్
3) మొహంజోదారో
4) రూపార్
- View Answer
- సమాధానం: 1
8. ‘ఇండియన్ సివిలైజేషన్’ గ్రంథ రచయిత ఎవరు?
1) మార్టీమర్ వీలర్
2) సర్ జాన్ మార్షల్
3) ఎస్.ఆర్. రావు
4) స్టువర్ట పిగాట్
- View Answer
- సమాధానం: 1
9. ఏ నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించారు?
1) సుమేరియన్లు
2) మెసపటోమియన్లు
3) ఈజిప్షియన్లు
4) సింధూ ప్రజలు
- View Answer
- సమాధానం: 4
10. ‘కాలీబంగన్’ అంటే అర్థం ఏమిటి?
1) ఎర్రమట్టి
2) గోడలు లేని నగరం
3) నల్లగాజు
4) ధాన్యాగారం
- View Answer
- సమాధానం: 3
11. హరప్పా ప్రజలు కింది వాటిలో ఏ ఆట ఆడారు?
1) చదరంగం
2) నౌకా పోటీలు
3) రథం పందేలు
4) గదా యుద్ధాలు
- View Answer
- సమాధానం: 1
12. సింధూ నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో కొలతలకు సంబంధించిన ప్రమాణం లభించింది?
1) హరప్పా
2) మొహంజోదారో
3) కోట్ డిజీ
4) లోథాల్
- View Answer
- సమాధానం: 4
13. హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) జీలం
2) చీనాబ్
3) సింధూ
4) రావి
- View Answer
- సమాధానం: 4
14.కింద పేర్కొన్న వారిలో లోథాల్లో తవ్వకాలు ఎవరు చేపట్టారు?
1) ఐరావతం మహదేవన్
2) రామ్‌శరణ్ శర్మ
3) ఎస్.ఆర్. రావ్
4) ఫాదర్ హిరాస్
- View Answer
- సమాధానం: 3
15. ‘హరప్పా’ ఆనవాళ్లను ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1) 1921
2) 1929
3) 1946
4) 1950
- View Answer
- సమాధానం: 1
16. మొహంజోదారో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉంది?
1) పంజాబ్
2) సింధ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
17. కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధూ నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొన్నారు?
1) ఫర్గానా
2) ఏథెన్స్
3) ధోలవీర
4) పెర్సిపోలీస్
- View Answer
- సమాధానం: 3
18. హరప్పా ప్రజలు కింద పేర్కొన్న ఏ ప్రాంతానికి ఎక్కువగా ఎగుమతులు చేశారు?
1) ఈజిప్ట్
2) మెసపటోమియా
3) బెలూచిస్తాన్
4) అరేబియా
- View Answer
- సమాధానం: 2
19. మొహంజోదారోలో లభించిన నర్తకి విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేశారు?
1) కంచు
2) రాగి
3) బంగారం
4) స్టియటైట్
- View Answer
- సమాధానం: 1
20. హరప్పా నాగరికత పతనానికి కారణంగా కింది వాటిలో దేన్ని భావిస్తున్నారు?
1) అంటువ్యాధులు
2) తీవ్ర తుఫాన్లు
3) వరదలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. ‘లోథాల్’ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) సింధూ లోయ నాగరికత
2) సుమేరియన్ నాగరికత
3) బాబిలోనియా నాగరికత
4) ఈజిప్షియన్ నాగరికత
- View Answer
- సమాధానం: 1
22. కింది వాటిలో సింధూ నాగరికత ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న ప్రాచీన దేశం ఏది?
1) చైనా
2) రోమ్
3) పర్షియా
4) మెసపటోమియా
- View Answer
- సమాధానం: 4
23. కింద పేర్కొన్న హరప్పా నగరాల్లో ఏది వృత్తాకార పట్టణ ప్రణాళికను కలిగి ఉంది?
1) మొహంజోదారో
2) లోథాల్
3) చాన్హుదారో
4) బన్వాలి
- View Answer
- సమాధానం: 4
24.పురాతన రాత పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఎపిగ్రఫీ
2) జియోగ్రఫీ
3) పాలియోగ్రఫీ
4) న్యూమిస్మాటిక్స్
- View Answer
- సమాధానం: 3
25. సింధూ ప్రజల భాష ఏది?
1) సంస్కృతం
2) తమిళం
3) పాళి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
26. మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ఏది?
1) ఇత్తడి
2) తగరం
3) ఇనుము
4) రాగి
- View Answer
- సమాధానం: 4
27. హరప్పా ప్రజలు పూజించిన పక్షి ఏది?
1) పావురం
2) నెమలి
3) కాకి
4) గద్ద
- View Answer
- సమాధానం: 1
28. కింది వాటిలో సింధూ లోయ నాగరికత ప్రత్యేకత ఏది?
1) భవన నిర్మాణం
2) పట్టణ ప్రణాళిక
3) మురుగునీటి కాలువల నిర్మాణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. హరప్పా నాగరికతలో గొప్పదైన స్నాన వాటిక ఏ ప్రాంతంలో బయటపడింది?
1) రూపార్
2) హరప్పా
3) కాలీబంగన్
4) మొహంజోదారో
- View Answer
- సమాధానం: 4
30. ‘మొహంజోదారో’ అంటే అర్థం ఏమిటి?
1) మౌండ్ ఆఫ్ ది గ్రేట్
2) మౌండ్ ఆఫ్ ది లివింగ్
3) మౌండ్ ఆఫ్ ది సర్వైవర్
4) మౌండ్ ఆఫ్ ది డెడ్
- View Answer
- సమాధానం: 4
31. హరప్పా సంస్కృతికి చెందిన ప్రజల లిపి ఏ రకమైంది?
1) హీరోగ్లిఫిక్
2) క్యూనీఫారం
3) నాగవల్లికల లిపి
4) సౌహాట్
- View Answer
- సమాధానం: 3
32. కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో హరప్పా నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభించలేదు?
1) మద్రాస్
2) కాలీబంగన్
3) బన్వాలి
4) మొహంజోదారో
- View Answer
- సమాధానం: 1
33. సింధూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలను ప్రారంభించిన కాలం నాటి భారతదేశ వైస్రాయి ఎవరు?
1) లార్డ్ రిప్పన్
2) లార్డ్ కర్జన్
3) లార్డ్ రీడింగ్
4) లార్డ్ మింటో
- View Answer
- సమాధానం: 3
34. ‘లోథాల్’ అంటే అర్థం ఏమిటి?
1) రెండో మృతుల దిబ్బ
2) నల్లగాజులు
3) దున్నిన భూమి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
35. సింధూ నాగరికత ప్రజల ముఖ్య వృత్తి ఏది?
1) పశుపోషణ
2) చేనేత
3) వ్యవసాయం
4) వర్తక వాణిజ్యం
- View Answer
- సమాధానం: 3
36. సింధూ నాగరికత అత్యున్నతంగా విలసిల్లిన కాలంగా చరిత్రకారులు కింది వాటిలో దేన్ని పేర్కొంటారు?
1) క్రీ.పూ. 2300 1750
2) క్రీ.పూ. 2500 1500
3) క్రీ.పూ. 2500 1900
4) క్రీ.పూ. 600 324
- View Answer
- సమాధానం: 1
37. మెసపటోమియన్లు సింధూ ప్రజలను ఏ పేరుతో పిలిచారు?
1) శిలాజాట
2) టోటెన్లు
3) స్వస్తిక్‌లు
4) మెలోహ
- View Answer
- సమాధానం: 4
38. మొహంజోదారోలో బయల్పడిన మహా స్నానవాటిక నిర్మాణాన్ని చరిత్రకారులు దేనికి సంకేతంగా పేర్కొన్నారు?
1) సింధూ ప్రజల సాంకేతిక ప్రగతి
2) సింధూ ప్రజల మత విశ్వాసం
3) సింధూ ప్రజల నిర్మాణ కౌశలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
39. ‘శిలాజాట’ అంటే అర్థం ఏమిటి?
1) వరి పొట్టు
2) ద్రాక్ష పంట
3) బొగ్గు ముక్క
4) నాట్యగత్తె
- View Answer
- సమాధానం: 3
40. ‘సింధూ ప్రజలు ఆరాధించిన పశుపతే.. బహుశా తర్వాతి శివుడి రూపం’ అని ఎవరు పేర్కొన్నారు?
1) ఎస్.ఆర్. రావు
2) సర్ జాన్ మార్షల్
3) దయారాం సహాని
4) ఆర్.డి. బెనర్జీ
- View Answer
- సమాధానం: 2
41. సింధూ నాగరికత ఏ లోహ యుగానికి సంబంధించింది?
1) రాగి
2) ఇనుము
3) కంచు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
42. ‘దస్యులు’ అంటే అర్థం ఏమిటి?
1) తెల్లనివారు
2) తూర్పు దేశ ప్రజలు
3) నల్లనివారు
4) దక్షిణ దేశ ప్రజలు
- View Answer
- సమాధానం: 3
43. యుద్ధాల్లో ఉపయోగించే ఏ వస్తువు సింధూ ప్రజలకు తెలియదు?
1) శిరస్త్రాణం
2) ఈటె
3) విల్లంబు
4) ధనస్సు
- View Answer
- సమాధానం: 1
44. ‘బంగారు (సువర్ణ) నది’ అని కింది వాటిలో దేన్ని పిలిచేవారు?
1) రావి
2) జీలం
3) గంగా
4) సింధూ
- View Answer
- సమాధానం: 4
45.‘యవలు’ అని వేటిని పిలిచేవారు?
1) బార్లీ
2) గోధుమ
3) నువ్వులు
4) వరి
- View Answer
- సమాధానం: 1
46.సింధూ ప్రజలను అంతం చేసినవారిగా కింది వారిలో ఎవరిని భావిస్తున్నారు?
1) ఆర్యులు
2) గ్రీకులు
3) అరబ్బులు
4) తురుష్కులు
- View Answer
- సమాధానం: 1
47.కింది వాటిలో ‘పశుపతి’ చుట్టూ పరివేష్టితమైన జంతువుల్లో లేనిది ఏది?
1) సింహం
2) ఖడ్గమృగం
3) పులి
4) దున్నపోతు
- View Answer
- సమాధానం: 1
48.‘హరప్పా నాగరికత’కు ఆ పేరు పెట్టిన వారెవరు?
1) మాక్స్ ముల్లర్
2) దయానంద సరస్వతి
3) సర్ జాన్ మార్షల్
4) సర్ విలియం జోన్స్
- View Answer
- సమాధానం: 3
49. కింద పేర్కొన్న వారిలో కాలీబంగన్ ప్రాంతంలో పరిశోధ నలు ఎవరు చేశారు?
1) జగపతి ఘోష్
2) ఆర్.ఎస్. బిస్త్
3) ఎస్.ఆర్. రావు
4) దయారాం సహాని
- View Answer
- సమాధానం: 1
50.హరప్పా నాగరికతకు సంబంధించి దక్షిణ ప్రాంత సరిహద్దు ఏది?
1) సుట్కజెండార్
2) అలంఘీర్‌పూర్
3) మాండ
4) దైమాబాద్
- View Answer
- సమాధానం: 4
51. సింధూ ప్రజలు ‘రాగి’ని ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తున్నారు?
1) ఖేత్రి (రాజస్థాన్)
2) కోలార్ (కర్ణాటక)
3) పర్షియా (ఇరాన్)
4) ఉమ్మ (మెసపటోమియా)
- View Answer
- సమాధానం: 1
52. సింధూ నాగరికతకు చెందిన ప్రజల దుస్తుల మూట బయటపడిన ప్రాంతం ఏది?
1) ఎరిడు
2) కిష్
3) ఉమ్మ
4) నినవే
- View Answer
- సమాధానం: 3
53. ‘ఆర్య మతాధికారులు, సింధూ మతాధికారులకు మధ్య జరిగిన పోరాటం వల్ల సింధూ నాగరికత అంతరించింది’ అని ఎవరు పేర్కొన్నారు?
1) జ్యోతిరావ్ పూలే
2) దయానంద సరస్వతి
3) బాల గంగాధర తిలక్
4) రోమిల్లా థాపర్
- View Answer
- సమాధానం: 1