2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధి?
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్‌ను 2019 జూలై 5న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. అపరిమిత నియంత్రణను తగ్గించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, సాంఘిక అవస్థాపన పెంపు, డిజిటల్ ఇండియా, కాలుష్య రహిత భారత్, మేక్ ఇన్ ఇండియా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉపాధి కల్పన, అవస్థాపనా సౌకర్యాలపై అధిక పెట్టుబడులు లాంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. 2018-19 బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు 2019-20 మొత్తం బడ్జెట్ వ్యయంలో పెరుగుదల 14.09 శాతం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్ల మూలధన నిధులను అందించనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్షాన్ని రూ.1.05 లక్షల కోట్లుగా ప్రకటించారు. సామాజిక సంక్షేమం లక్ష్యంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు తమ షేర్లను స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీర్ఘకాలిక రుణ పత్రాల మార్కెట్‌ను విస్తృత పరచడానికి త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉన్న చిన్న కార్పొరేట్ కంపెనీలపై విధించే కార్పొరేషన్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్ పటిష్టతకు తగిన చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
విమానయానం, మీడియా, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపునకు అవసరమైన చర్యలను పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. సమగ్ర జాతీయ హైవే కార్యక్రమం పునర్నిర్మాణం చేపడతామన్నారు. లిస్టెడ్ కంపెనీలలో పబ్లిక్ వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థికమంత్రిత్వ శాఖ సెబీకి ప్రతిపాదించింది. 2014 అక్టోబర్ 2 తర్వాత 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ప్రతి గ్రామంలో ‘ఘన వ్యర్థాల నిర్వహణ’ (ౌజీఛీ గ్చిట్ట్ఛ క్చ్చజ్ఛఝ్ఛ్ట) చేపట్టడానికి స్వచ్ఛ భారత్ మిషన్‌ను విస్తరిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారు.
నిర్మాణాత్మక సంస్కరణల ఆవశ్యకతను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి పేర్కొన్నారు. భౌతిక కనెక్టివిటీ పెంపునకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇచ్చింది. అవస్థాపనా రంగం, ఎమ్‌ఎస్‌ఈలలో ఉపాధి కల్పనకు అధిక పెట్టుబడుల అవసరం. ఎయిర్ క్రాఫ్ట్ ఫైనాన్సింగ్, లీజింగ్ కార్యకలాపాల్లో భారత్ ప్రవేశించిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2019 మేలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... సాంఘిక - ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. 2024 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం సవాలు అయినప్పటికీ సాధించగలిగిన లక్ష్యంగా మోదీ పేర్కొన్నారు. 2014లో మొదటిసారిగా అధికారం చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.85 ట్రిలియన్ డాలర్లు కాగా ప్రస్తుతం 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గంగానదిపై సరకు రవాణా వచ్చే నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరుగుతుందని ఆర్థికమంత్రి అభిలషించారు. భారత్ భవిష్యత్తుకు జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి సాధన ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. కౌలు నమూనా చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు అందించగలమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు భారత్‌లో విద్యనభ్యసించే విధంగా వారిని ప్రోత్సహించడానికి ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. నీటి భద్రత, శుభ్రమైన త్రాగునీరు అందించడం అనేది ప్రాధాన్యత కలిగిన అంశం. వివాదాలను తగ్గించడానికి శ్రామిక కోడ్‌లను సవరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ ప్రభావం, నాయకత్వం పెరుగుదల నేపథ్యంలో ఇప్పటి వరకు రెసిడెంట్ డిప్లోమాటిక్ మిషన్ లేని దేశాలలో భారత్ తన ఎంబసీలు, హైకమిషన్‌లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
2018-2030 మధ్య కాలంలో రైల్వే రంగంలో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి రూ. 50 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య ప్రాధాన్యతను పేర్కొన్నారు. ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇతర దేశాల్లో ఉపాధి పొందే విధంగా యువతకు భాషా శిక్షణతో పాటు నైపుణ్యత పెంపొందించడానికి ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్‌స, ఇంటర్నెట్ ఆఫ్ తింగ్‌స, బిగ్ డేటా, 3డి ప్రింటింగ్, రోబోటిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
మాదిరి ప్రశ్నలు :
1. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధి?
1) 5.8 శాతం
2) 5.9 శాతం
3) 6.1 శాతం
4) 6.7 శాతం
- View Answer
- సమాధానం: 1
2. సేవా పన్ను, ఎక్సైజ్ పన్ను సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి కింది ఏ పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు?
1) రుణ రిక వరీ ట్రిబ్యునల్
2) ఆమే్నిష్టి పథకం
3) జాతీయ పెన్షన్ పథకం
4) సబ్కా విశ్వాస్ లెగసీ వివాద తీర్మానం
- View Answer
- సమాధానం: 4
3. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని గృహాల నిర్మాణం లక్ష్యంగా 2019-20 బడ్జెట్‌లో ప్రతిపాదించారు?
1) 17.5 మిలియన్
2) 18.5 మిలియన్
3) 19.5 మిలియన్
4) 20.5 మిలియన్
- View Answer
- సమాధానం: 3
4. రక్షణ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌లో వినియోగించే మూలధన వస్తువుల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 2019-20 బడ్జెట్‌లో ఎంత శాతం ప్రతిపాదించారు?
1) సున్నా శాతం
2) మూడు శాతం
3) నాలుగు శాతం
4) ఆరు శాతం
- View Answer
- సమాధానం: 1
5. బంగారం, విలువైన మెటల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి ఎంతకు పెంచారు?
1) 10.5 శాతం
2) 11.5 శాతం
3) 12.5 శాతం
4) 13.5 శాతం
- View Answer
- సమాధానం: 3
6. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు ఎంత మొత్తం కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు?
1) రూ.100 కోట్లు
2) రూ.200 కోట్లు
3) రూ.300 కోట్లు
4) రూ.400 కోట్లు
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో ఏ రంగానికి సంబంధించి ప్రత్యేక టి.వి. చానెల్‌ను ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు?
1) తయారీ రంగం
2) స్టార్టప్‌లు
3) వ్యవసాయ రంగం
4) రవాణా రంగం
- View Answer
- సమాధానం: 2
8. లోటు బడ్జెట్‌ను భర్తీ చేయడానికి కింది వాటిలో సరైంది ఏది?
1) రుణాల స్వీకరణ
2) అదనపు పన్నుల విధింపు
3) అదనపు కరెన్సీ ముద్రణ
4) పైవన్నీ సరైన వి
- View Answer
- సమాధానం: 4
9. బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం?
1) రూ. 3,05,296 కోట్లు
2) రూ. 3,40,296 కోట్లు
3) రూ. 3,51,496 కోట్లు
4) రూ. 4,10,110 కోట్లు
- View Answer
- సమాధానం: 1
10. 2019 సంవత్సరం చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంతగా ఉంటుందని అంచనా వేశారు?
1) రెండు ట్రిలియన్ డాలర్లు
2) మూడు ట్రిలియన్ డాలర్లు
3) నాలుగు ట్రిలియన్ డాలర్లు
4) ఐదు ట్రిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
11. విదే శీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కింది ఏ రంగంపై నియంత్రణలు సడలిస్తారని 2019-2020 బడ్జెట్‌లో పేర్కొనలేదు?
1) విమానయానం
2) బీమా రంగం
3) రక్ష ణ రంగం
4) సింగిల్ బ్రాండ్ రిటైల్
- View Answer
- సమాధానం: 3
12. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన లక్ష్యం?
1) ఆహార భద్రత
2) ఫిషరీస్ రంగంలో కీలక అవస్థాపనా సౌకర్యాల లోటును తొలగించడం
3) ఫిషరీస్ ఎగుమతుల సామర్థ్యం పెంపు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
13. 3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కింది ఏ పథకం ద్వారా వర్తిస్తుంది?
1) ప్రధానమంత్రి కరమ్ యోగిమాన్ ధాన్ యోజన
2) సన్సద్ ఆదర్శ గ్రామ్ యోజన
3) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
4) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
- View Answer
- సమాధానం: 1
14. రైల్వే రంగంలో అవస్థాపనా సౌకర్యాలపై పెట్టుబడి 2018 నుంచి 2030 మధ్య కాలంలో ఎంత అవసరమవుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు?
1) రూ. 48 లక్షల కోట్లు
2) రూ. 50 లక్షల కోట్లు
3) రూ. 71 లక్షల కోట్లు
4) రూ. 81 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
15. అందరికీ గృహ వసతి లక్ష్యాన్ని కింది ఏ సంవత్సరం నాటికి సాధించాలని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు?
1) 2020
2) 2021
3) 2022
4) 2025
- View Answer
- సమాధానం: 3
16. గత సంవత్సర కేటాయింపులతో సంబంధం లేకుండా ప్రస్తుత అవసరాల దృష్ట్యా కేటాయింపులు చేసే బడ్జెట్‌ను ఏ విధంగా వ్యవహరించవచ్చు?
1) సంప్రదాయ బడ్జెట్
2) సామర్థ్య ఆధారిత బడ్జెట్
3) బహుళ బడ్జెట్
4) జీరో బేస్డ్ బడ్జెట్
- View Answer
- సమాధానం: 4
17. కింది వాటిలో పన్నేతర రాబడి కానిదేది?
1) కస్టమ్స్ సుంకం
2) బహిర్గత గ్రాంట్లు
3) డివిడెంట్లు, లాభాలు
4) వడ్డీ వసూళ్లు
- View Answer
- సమాధానం: 1
18. మూలధన రాబడిలో కింది వాటిలో దేని వాటా ఎక్కువ?
1) పెట్టుబడులు ఉపసంహరణ
2) ప్రభుత్వ రుణాల వసూళ్లు
3) మార్కెట్ రుణాలు
4) ప్రభుత్వ ఆస్తుల అమ్మకం
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో దేనిపై పెట్టుబడి నిమిత్తం గృహ అమ్మకం జరిగినప్పుడు విధించాల్సిన మూలధన రాబడి పన్నుకు 2019-20 బడ్జెట్‌లో 2021 మార్చి 31 వరకు మినహాయింపును ఇచ్చారు?
1) అవస్థాపనా రంగం
2) స్టార్టప్‌లు
3) మధ్యతరహా పరిశ్రమలు
4) అనుషంగిక పరిశ్రమలు
- View Answer
- సమాధానం: 2
20. ఏ లక్ష్యంగా పనిచేసే సంస్థలు తమ షేర్లను స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవడానికి 2019-20 బడ్జెట్‌లో ప్రభుత్వం అనుమతినిచ్చింది?
1) సామాజిక సంక్షేమం
2) ప్రాంతీయ అసమానతల నివారణ
3) గృహ నిర్మాణం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
21. 2014 అక్టోబర్ 2 తర్వాత దేశంలో మొత్తం ఎన్ని మరుగుదొడ్లు నిర్మాణం జరిగినట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్‌లో పేర్కొన్నారు?
1) 7.6 కోట్లు
2) 8.6 కోట్లు
3) 9.6 కోట్లు
4) 10.6 కోట్లు
- View Answer
- సమాధానం: 3
22. కింది ఏ కాలానికి భారత్ ‘ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ’గా ఉండగలదని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు?
1) 2019 అక్టోబర్ 2
2) 2020 అక్టోబర్ 2
3) 2021 అక్టోబర్ 2
4) 2022 అక్టోబర్ 2
- View Answer
- సమాధానం: 1
23. హౌసింగ్ ఫైనాన్స కంపెనీలను కింది ఏ సంస్థ నియంత్రిస్తుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు?
1) నేషనల్ హౌసింగ్ బ్యాంక్
2) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఐఆర్డీఏ
4) సెబీ
- View Answer
- సమాధానం: 2
24. వాణిజ్య బ్యాంక్‌ల రికవరీ కాని రుణాలు మొత్తంగా ఎంత వరకు తగ్గినట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్‌లో పేర్కొన్నారు?
1) రూ.50,000 కోట్లు
2) రూ.60,000 కోట్లు
3) రూ.72,500 కోట్లు
4) రూ.1,00,000 కోట్లు
- View Answer
- సమాధానం: 4
25. ఎలక్ట్రిక్ వాహనాలపై వస్తు, సేవల పన్ను రేటును 2019-20 బడ్జెట్‌లో ఎంత శాతం ప్రతిపాదించారు?
1) 3 శాతం
2) 4 శాతం
3) 5 శాతం
4) 6 శాతం
- View Answer
- సమాధానం: 3
26. భారత్‌లో తొలి బడ్జెట్‌ను 1947లో ఎవరు ప్రవేశపెట్టారు?
1) సి.డి. దేశ్‌ముఖ్
2) షణ్ముగం చెట్టి
3) లియాఖత్ అలీఖాన్
4) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 2
27. మూలధన రాబడిలో భాగంగా రుణ రాబడికి సంబంధించి సరికానిది ఏది?
1) రుణాల వసూళ్లు
2) విదేశీ సహాయం
3) స్వల్పకాల రుణాలు
4) మార్కెట్ రుణం
- View Answer
- సమాధానం: 1
28. కీన్స 1936లో ‘జనరల్ థియరీ’ ప్రచురించిన తర్వాత కింది వాటిలో ఏది ప్రాధాన్యత సంతరించుకుంది?
1) సంతులిత బడ్జెట్
2) ప్రణాళికేతర వ్యయం
3) లోటు బడ్జెట్
4) కోశ లోటు
- View Answer
- సమాధానం: 3
29. ‘ది ఫేమ్ ఐఐ’ పథకం ఉద్దేశం?
1) వంట గ్యాస్ పంపిణీ
2) ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రొత్సహించడం
3) పెట్టుబడిదారులను ప్రోత్సహించడం
4) అందరికీ గృహ వసతి
- View Answer
- సమాధానం: 2
30. 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంతగా ఉండగలదని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు?
1) రెండు ట్రిలియన్ డాలర్లు
2) మూడు ట్రిలియన్ డాలర్లు
3) నాలుగు ట్రిలియన్ డాలర్లు
4) ఐదు ట్రిలియన్ డాలర్ల్లు
- View Answer
- సమాధానం: 4