ప్రముఖులు- ఆంధ్రకు చేసిన సేవలు
Sakshi Education
- మనిషి సాధించిన ప్రగతిపథానికి అద్దం పట్టేది చరిత్ర. చరిత్రలో సామాజిక, సాంస్కృతిక కోణం నుంచి ఆలోచన చేస్తే అనేక సంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు వ్యక్తీకరించబడతాయి. లిఖిత, పురావస్తు ఆధారాల ద్వారా కొన్ని విషయాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా మరికొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్రకు కూడా అనేక మంది మేథావులు కృషి చేశారు. తాము తమ జీవితాలను త్యాగంచేసి మన సంస్కృతిని కాపాడుకోవడానికి సాంస్కృతిక సంపదను వారసత్వంగా అందించారు.
- ‘సంస్కృతి అనేది దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకుందాం’ అని బ్రిటన్ దేశంలో తన సన్నిహితులతో సర్ థామస్ మన్రో అన్నారు. ప్రకృతి-మానవుల సమ్మేళనం సంస్కృతి. తెలుగు ప్రాంత సంస్కృతిలో సంక్రాంతి సంబరాలు, కోడిపందేలుతో పాటు, హరికథా గానాలు, బుర్ర కథలు కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు ‘ఉత్తర భారతదేశ సంస్కృతికి దక్షిణ భారత సంస్కృతికి పుట్టిన బిడ్డే భారతదేశ సంస్కృతి’. ఆ దక్షిణ భారతదేశ సంస్కృతిలో మనం కూడా భాగస్వాములైనందుకు గర్వించాలి. ధనం నష్టపోతేతిరిగి సంపాదించుకోవచ్చు. భూభాగాలు పోయినా తిరిగి దక్కించుకోవచ్చు కానీ సంస్కృతిని గాని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే సాంస్కృతిక వారసత్వ సంపద ఎంతో విలువైంది.
- ఆంధ్రులే కాకుండా, విదేశీయులు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వేనోళ్ల కొనియాడారు. సంగీతం, సాహిత్యం, కట్టడాల నిర్మాణం మొదలగు సేవా ప్రక్రియలతో వారు నేటికీ వివిధ ప్రాంతాలలో ఆరాధనా మూర్తులుగా పూజించబడతారు. రాయలసీమ ప్రాంతంలో తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రోలమ్మి అనే పేర్లు థామస్ మన్రో మీద ప్రేమను వ్యక్తీకరించుటకు గల కారణం.
- వివిధ గ్రంథాలు, శాసనాలు, కైఫియత్‌లు ఆధారంగా వార్తా పత్రికల కథనాల ప్రకారం ఈ కింది మేథావులైన ఆంధ్రులు, విదేశీయులు ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతికి శక్తి వంచన లేకుండా సేవ చేశారు. అటువంటి వారిలో ఈ కింది ప్రముఖుల సేవ మరువలేనిది, చిరస్మరణీయమైంది. సువర్ణాక్షరాలతో లిఖించదగింది.
Published date : 17 Feb 2022 12:34PM