Skip to main content

APPSC: ఈ స‌ర్టిఫికెట్ లేకుంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌కు అన‌ర్హులే... తాజా నిబంధ‌న‌లు ఇవే

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీల‌క మార్పు ఒక‌టి వ‌చ్చి చేరింది. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Appsc

ఏపీపీఎస్‌సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఇక‌పై సీపీటీ పాస్ కావాల్సిఉంటుంది.

చ‌ద‌వండి: గుడ్‌న్యూస్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంపు
100 మార్కుల‌కు టెస్ట్‌
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు వంద మార్కుల‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో త‌ప్ప‌నిస‌రిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధిస్తేనే వారు ఉత్తీర్ణులైన‌ట్లు. ప‌రీక్ష పూర్తిగా కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానంపై ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ మీదే ఎక్కువ ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది. అయితే కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ విండోస్‌, ఇంటర్నెట్‌ తదితర అంశాల్లో ప‌రీక్ష ఉండ‌నుంది. గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవు. ఈ మేర‌కు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ విడుద‌ల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Published date : 25 Feb 2023 04:31PM

Photo Stories