Group 1 Syllabus: గ్రూప్-1 సిలబస్‌పై పట్టు సాధించాలంటే..
ఆ తర్వాత సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లో బేసిక్స్‌పై పట్టు సాధించాలి. తర్వాత ఆయా అంశాల్లో అదనపు సమాచార సేకరణతో పాటు తాజా పరిణామాలపై దృష్టిసారించాలి.
☛ సిలబస్ ప్రకారం అందుబాటులో ఉన్న పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రిపరేషన్ దశ నుంచే అదనపు సమాచారాన్ని సేకరించుకుంటూ ఆయా అంశాలను అధ్యయనం చేయాలి.
☛ గ్రూప్-1 మెయిన్స్‌లో ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి 10 నుంచి 12 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఆ కొద్ది సమయంలో ముఖ్యమైన సమాచారం ఉండేలా సమాధానం రాసే నేర్పు సొంతం చేసుకోవాలి.
☛ ఒక అంశాన్ని ఏ విధంగా రాస్తే ఎక్కువ, విలువైన సమాచారం ప్రజెంట్ చేయగలమో తెలుసుకోవాలి. దానికనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి.
ఉదాహరణకు కొన్ని అంశాలకు ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ ఆధారంగా కూడా పరిపూర్ణమైన సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి విషయంలో వ్యాసాలు రాయడం కంటే చార్ట్‌ల రూపంలో ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.
☛ ఇక అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం సమయ పాలన. ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి పరీక్ష రోజు వరకు ఈ సమయ పాలన పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి.
☛ సిలబస్, తమకున్న సమయం వెసులుబాటు ప్రకారం ప్రతి రోజు ప్రతి పేపర్‌లో ఒక్కో టాపిక్/ యూనిట్ చదువుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
☛ కొన్ని సందర్భాల్లో ఒకరోజు ఒక యూనిట్ / టాపిక్ చదవలేకపోయినా.. తర్వాత రోజు ఒక గంట అదనంగా కేటాయించైనా సమయ పాలన గాడిలో ఉండేలా వ్యవహరించాలి. అప్పుడు విజయావకాశాలు మెరుగవుతాయి.
☛ టైం ప్లాన్ విషయంలో పొరపాట్లు లేదా కష్టమైన అంశాలను విస్మరించడం వంటి వాటి వల్ల చాలా మంది కొద్ది తేడాతో విజయావకాశాలు చేజార్చుకుంటారు.
☛ సిలబస్ విషయంలో ఆందోళన చెందొద్దు. వాస్తవానికి సిలబస్ అందరికీ కొత్తదే కాబట్టి ఏ కొందరికో అనుకూలం కాదు. ఇప్పటి నుంచే సరైన దిశలో ప్రిపరేషన్ సాగించి విజయానికి మార్గం వేసుకోవచ్చు.
- కె. నిఖిల, ఆర్‌డీవో
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
Groups: గ్రూప్–1&2లో ఉద్యోగం సాధించడం ఎలా ?
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..