Skip to main content

TSPSC Group 4 Application Extended : గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-4 పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వినతి మేరకు దరఖాస్తు గడువునం పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

గత డిసెంబర్‌ 1న గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డిసెంబర్‌ 30న వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టిన టీఎస్‌పీఎస్సీ... అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. జనవరి 30 వరకు దరఖాస్తులకు గడువు విధించగా... ఇప్పుడు మ‌రో సారి ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడ‌గించింది.ఇప్పటివరకు 7,41,159 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 4 రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్/మే జరిగే అవకాశం ఉంది.

చదవండి: TSPSC Group-4 : పది లక్షల మంది పోటీ... ఈ మెలకువలు పాటిస్తే విజయం సాధ్యం!

దరఖాస్తు చేసుకోవాడానికి మరింత సమయం కావాలంటూ..

tspsc group 4 application last date 2023

జ‌న‌వ‌రి 28న విడుదల చేసిన గ్రూప్‌–4 అనుబంధ ప్రకటనలో మరో 141 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను జత చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వివరించింది. దీంతో పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. మరోవైపు ఓటీఆర్‌ అప్‌డేషన్, విద్యార్హతల ధ్రువపత్రాలు తదితరాలను సంబంధిత అధికారుల నుంచి తీసుకుని దరఖాస్తు చేసుకోవాడానికి మరింత సమయం కావాలంటూ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని కోరిన విష‌యం తెల్సిందే.

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 30 Jan 2023 06:53PM

Photo Stories