Skip to main content

APPSC Group 2 Jobs Notification 2023 Released : బ్రేకింగ్ న్యూస్ : 897 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) స‌భ్యుడు ప‌రిగె సుధీర్ X (ట్వీట్ట‌ర్‌) వేదిక‌గా గుడ్‌న్యూస్ చెప్పాడు. అలాగే నేడు గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. డిసెంబ‌ర్‌ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
appsc group 2 jobs notification news telugu

నియామ‌క ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. నిర్ణ‌త స‌మ‌యంలోనే భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ముగించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్ – 2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published date : 07 Dec 2023 09:24PM
PDF

Photo Stories