Skip to main content

APPSC Group 1 Interviews Dates 2023 : గ్రూప్‌–1 ఇంటర్వ్యూలు తేదీలు ఇవే.. ఒక్కొక్క‌ పోస్టుకు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : రాష్ట్రంలో గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది.
APPSC Group 1 Interviews Dates 2023 News Telugu
APPSC Group 1 Interviews Dates 2023

జనరల్, స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైనవారికి ఆగస్టు 2 నుంచి మౌఖిక పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. వచ్చే నెల 2న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.

☛ AP Government Jobs 2023 : ఏపీలో 590 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

పోస్టుకు..

appsc group 2 interivews dates 2023

స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైనవారికి ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్‌30న 111 గ్రూప్‌–1 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్‌ (స్క్రీనింగ్‌) నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలను వెల్లడించారు. 5,035 మంది మెయిన్స్‌ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరికి జూన్‌ 3 నుంచి 10 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నుంచి పోస్టుకు ఇద్దరు చొప్పున 110 పోస్టులకు 220 మందిని, స్పోర్ట్స్‌ కోటాలోని ఒక పోస్టుకు 39 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తక్కువ కాలంలోనే ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడం, అంతే వేగంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుండటం ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన నాటి నుంచి 19 రోజుల్లో, మెయిన్స్‌ పరీక్షలు జరిగిన నాటి నుంచి 33 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం.

చదవండి: ఏపీపీఎస్సీ Group 1&2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ |ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ ​​​​​​​

Published date : 15 Jul 2023 01:39PM

Photo Stories