Skip to main content

APPSC Group-1: గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం జూన్ 15వ తేదీ నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
ap high court
AP High Court

ఈ మేరకు నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్‌ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్‌ కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది.

Interview Tips in APPSC Group 1 (2018): ఇంటర్వ్యూల్లో రాణించేందుకు నిపుణుల సలహాలు...

Published date : 15 Jun 2022 12:22PM

Photo Stories