Skip to main content

Test Rankings: మనమే నంబర్‌ 1... అన్ని ఫార్మాట్లలో టీం ఇండియాదే హవా

బోర్డర్‌ గవస్కర్‌ సిరీస్‌లో తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది టీం ఇండియా. ఈ తరుణంలో ఐసీసీ మరో గుడ్‌ న్యూస్‌ అందించింది.
Team India

తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌... ఆసీస్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం రోహిత్‌ సేన 115 రేటింగ్‌ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. 111 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌ (106), న్యూజిలాండ్‌ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అన్నింట్లోనూ....
టెస్టుల్లో టీమ్‌ ఇండియా టాప్‌లోకి దూసుకెళ్లడంతో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌ జట్టుగా నిలిచింది. వన్డేలు, టీ20ల్లో భారత్‌ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. భారత్, ఆసీస్‌ మధ్య ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Published date : 15 Feb 2023 04:16PM

Photo Stories