Skip to main content

టోక్యో ఒలింపిక్స్–2020 ముగింపు

టోక్యో ఒలింపిక్స్–2020 క్రీడలు ఘనంగా ముగిశాయి.
కరోనా సహా అన్ని అవరోధాలను అధిగమించి 2021, జూలై 23న ప్రారంభమైన విశ్వ క్రీడలు 2021, ఆగస్టు 8న ఘనంగా ముగిశాయి. టోక్యో గవర్నర్ యురికో కొయికె ఒలింపిక్ జెండాను వచ్చే ఒలింపిక్స్ జరిగే పారిస్ మేయర్ అనె హిడాల్గోకు అందించడంతో లాంఛనం పూర్తయింది. అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ‘అరిగాటో’ (జపాన్ భాషలో థ్యాంక్యూ) అనే పదాన్ని జపాన్ స్టేడియంలో ప్రదర్శించారు. ‘వరల్డ్స్ వి షేర్’ థీమ్తో సాగిన ముగింపు ఉత్సవంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రెజ్లింగ్లో కాంస్యం సాధించిన బజరంగ్ పూనియా భారత జట్టు ‘ఫ్లాగ్ బేరర్’గా ముగింపు కార్యక్రమంలో ముందుండి నడిచాడు. అద్భుత ఆటతో క్రీడాకారులు మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ థామస్ బాచ్ పేర్కొన్నారు. ఆగస్టు 24 నుంచి ఇదే టోక్యోలో దివ్యాంగుల కోసం పారాలింపిక్స్ జరుగనున్నాయి.

48వ స్థానంలో భారత్...
టోక్యోలో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్ 48వ స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్కు 33వ స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్ను పరిగణనలోకి తీసుకుంటారు.

పారిస్లో 2024 ఒలింపిక్స్...
మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్ రానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్ కేంద్రం పారిస్లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు ఈ నగరం ఒలింపిక్స్కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది.

పతకాల పట్టిక

ర్యాంక్‌

దేశం

స్వర్ణం

రజతం

కాంస్యం

మొత్తం

1

అమెరికా

39

41

33

113

2

చైనా

38

32

18

88

3

జపాన్‌

27

14

17

58

4

గ్రేట్‌ బ్రిటన్‌

22

21

22

65

5

ఆర్‌ఓసీ

20

28

23

71

6

ఆస్ట్రేలియా

17

7

22

46

7

నెదర్లాండ్స్‌

10

12

14

36

8

ఫ్రాన్స్‌

10

12

11

33

9

జర్మనీ

10

11

16

37

10

ఇటలీ

10

10

20

40

11

కెనడా

7

6

11

24

12

బ్రెజిల్‌

7

6

8

21

13

న్యూజిలాండ్‌

7

6

7

20

14

క్యూబా

7

3

5

15

15

హంగేరి

6

7

7

20

16

కొరియా

6

4

10

20

17

పోలాండ్‌

4

5

5

14

18

చెక్‌రిపబ్లిక్‌

4

4

3

11

19

కెన్యా

4

4

2

10

20

నార్వే

4

2

2

8

21

జమైకా

4

1

4

9

22

స్పెయిన్‌

3

8

6

17

23

స్వీడన్‌

3

6

0

9

24

స్విట్జర్లాండ్‌

3

4

6

13

25

డెన్మార్క్‌

3

4

4

11

26

క్రొయేషియా

3

3

2

8

27

ఇరాన్‌

3

2

2

7

28

సెర్బియా

3

1

5

9

29

బెల్జియం

3

1

3

7

30

బల్గేరియా

3

1

2

6

31

స్లొవేనియా

3

1

1

5

32

ఉజ్బెకిస్తాన్‌

3

0

2

5

33

జార్జియా

2

5

1

8

34

చైనీస్‌తైపీ

2

4

6

12

35

టర్కీ

2

2

9

13

36

గ్రీస్‌

2

1

1

4

36

ఉగాండా

2

1

1

4

38

ఈక్వెడార్‌

2

1

0

3

39

ఐర్లాండ్‌

2

0

2

4

39

ఇజ్రాయెల్‌

2

0

2

4

41

ఖతర్‌

2

0

1

3

42

బహామస్‌

2

0

0

2

42

కొసావో

2

0

0

2

44

ఉక్రెయిన్‌

1

6

12

19

45

బెలారస్‌

1

3

3

7

46

రొమేనియా

1

3

0

4

46

వెనిజులా

1

3

0

4

48

భారత్‌

1

2

4

7

49

హాంకాంగ్‌

1

2

3

6

50

ఫిలిప్పీన్స్‌

1

2

1

4

50

స్లొవేకియా

1

2

1

4

52

దక్షిణాఫ్రికా

1

2

0

3

53

ఆస్ట్రియా

1

1

5

7

54

ఈజిప్ట్‌

1

1

4

6

55

ఇండోనేషియా

1

1

3

5

56

ఇథియోపియా

1

1

2

4

56

పోర్చుగల్‌

1

1

2

4

58

ట్యునీషియా

1

1

0

2

59

ఎస్టోనియా

1

0

1

2

59

లాత్వియా

1

0

1

2

59

ఫిజీ

1

0

1

2

59

థాయ్‌లాండ్‌

1

0

1

2

63

బెర్ముడా

1

0

0

1

63

మొరాకో

1

0

0

1

63

ప్యూర్టోరికో

1

0

0

1

66

కొలంబియా

0

4

1

5

67

అజర్‌బైజాన్‌

0

3

4

7

68

డొమినికన్‌ రిపబ్లిక్‌

0

3

2

5

69

అర్మేనియా

0

2

2

4

70

కిర్గిస్తాన్‌

0

2

1

3

71

మంగోలియా

0

1

3

4

72

అర్జెంటీనా

0

1

2

3

72

సాన్‌మరినో

0

1

2

3

74

జోర్డాన్‌

0

1

1

2

74

మలేషియా

0

1

1

2

74

నైజీరియా

0

1

1

2

77

బహ్రెయిన్‌

0

1

0

1

77

సౌదీఅరేబియా

0

1

0

1

77

లిథువేనియా

0

1

0

1

77

నార్త్‌ మెసడోనియా

0

1

0

1

77

నమీబియా

0

1

0

1

77

తుర్క్‌మెనిస్తాన్‌

0

1

0

1

83

కజకిస్తాన్‌

0

0

8

8

84

మెక్సికో

0

0

4

4

85

ఫిన్లాండ్‌

0

0

2

2

86

బోట్స్‌వానా

0

0

1

1

86

బుర్కినఫాసో

0

0

1

1

86

కోట్‌డిఐవరీ

0

0

1

1

86

ఘనా

0

0

1

1

86

గ్రెనెడా

0

0

1

1

86

కువైట్‌

0

0

1

1

86

మాల్డోవా

0

0

1

1

86

సిరియా

0

0

1

1

సాధించిన స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. ఒకవేళ స్వర్ణాలు సమంగా ఉంటే రజత, కాంస్యాలను లెక్కలోకి తీసుకుంటారు. అవీ కూడా సమమైతే సంయుక్త ర్యాంక్‌ ఇస్తారు.

టోక్యో ఒలింపిక్స్‌–2020 విశేషాలు
  • టోక్యో ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలిచిన భారత్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం నెగ్గగా... మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను... పురుషుల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రవి దహియా రజత పతకాలు సాధించారు. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పీవీ సింధు... మహిళల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌... పురుషుల రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో బజరంగ్‌ పూనియా కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు కూడా కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
  • జమైకా స్ప్రింటర్‌ ఎలైన్‌ థాంప్సన్‌ 100 మీ., 200 మీ. పరుగులో రియో ఒలింపిక్స్‌ తరహాలోనే మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఒలింపిక్‌ చరిత్రలో ఒక మహిళా స్ప్రింటర్‌ ఇలా పతకాలు నిలబెట్టుకోవడం ఇదే తొలిసారి. 4గీ100 మీటర్ల రిలేలోనూ ఎలైన్‌ సభ్యురాలిగా ఉన్న జమైకా స్వర్ణం సాధించింది.
  • పురుషుల హైజంప్‌లో స్వర్ణాన్ని ఇద్దరు ఆటగాళ్లు పంచుకోవడం అరుదైన ఘటనగా నిలిచిపోయింది. పోరులో సమానంగా నిలిచిన అనంతరం ‘జంప్‌ ఆఫ్‌’ ఆడకుండా ముతాజ్‌ బర్షిమ్‌ (ఖతర్‌), గియాన్‌మార్కో తంబేరి (ఇటలీ) స్వర్ణాన్ని పంచుకున్నారు.
  • అమెరికా తరఫున ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్‌ ఫెలిక్స్‌ (11 పతకాలు) కొత్త ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఈసారి ఆమె రెండు పతకాలు సాధించింది. ఓవరాల్‌గా కార్ల్‌ లూయిస్‌ (10 పతకాలు) రికార్డును అధిగమించింది.
  • ఒకే ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు (7) సాధించిన రెండో మహిళగా ఆస్ట్రేలియన్‌ స్విమ్మర్‌ ఎమా మెక్‌కియాన్‌ నిలిచింది. 1952 హెల్సింకీలో సోవియట్‌ యూనియన్‌ జిమ్నాస్ట్‌ మారియా గొరొకొవ్‌స్కయా సాధించిన ఘనతను ఎమా సమం చేసింది.
  • పురుషుల 100 మీటర్ల పరుగులో జమైకా, అమెరికా అథ్లెట్లను దాటి ఇటలీకి చెందిన మార్సెల్‌ జాకబ్స్‌ (9.80 సెకన్లు) విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో కూడా జాకబ్స్‌ నేతృత్వంలో ఇటలీనే తొలిసారి స్వర్ణం అందుకుంది.
  • టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో మొత్తం 90 కొత్త ఒలింపిక్‌ రికార్డులు (ఆర్చరీ–3; అథ్లెటిక్స్‌–10; సైక్లింగ్‌ ట్రాక్‌–6; మోడర్న్‌ పెంటాథ్లాన్‌–7; షూటింగ్‌–11; స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌–2; స్విమ్మింగ్‌–21; వెయిట్‌లిఫ్టింగ్‌–30)... 18 కొత్త ప్రపంచ రికార్డులు (అథ్లెటిక్స్‌–3; సైక్లింగ్‌ ట్రాక్‌–3; షూటింగ్‌–1; స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌–1; స్విమ్మింగ్‌–6; వెయిట్‌లిఫ్టింగ్‌–4) నమోదయ్యాయి.
Published date : 09 Aug 2021 05:57PM

Photo Stories