టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్-2017
Sakshi Education
టెన్నిస్‌లో నాలుగు అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్లను ‘గ్రాండ్‌స్లామ్స్’ లేదా ‘మేజర్స్’ అని అంటారు. వీటిని ఏటా నిర్వహిస్తారు. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను మెల్‌బోర్న్‌లో; మే/జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌ను పారిస్‌లో; జూన్/జూలైలో వింబుల్డన్‌ను లండన్‌లో; ఆగస్టు/సెప్టెంబర్‌లో యూఎస్ ఓపెన్‌ను న్యూయార్క్‌లో నిర్వహిస్తారు.
ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్‌లను హార్డ్ కోర్టులపైన; ఫ్రెంచ్ ఓపెన్‌ను క్లే కోర్టుపైన; వింబుల్డన్‌ను పచ్చికపై నిర్వహిస్తారు. ఈ నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో వింబుల్డన్ అత్యంత పురాతనమైంది. దీన్ని 1877లో ప్రారంభించారు. యూఎస్ ఓపెన్‌ను 1881లో, ఫ్రెంచ్ ఓపెన్‌ను 1891లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను 1905లో ప్రారంభించారు. ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల విజేతల వివరాలు..
ఆస్ట్రేలియన్ ఓపెన్
2017లో తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్. జనవరి 16 నుంచి 29 వరకు మెల్‌బోర్న్‌లో జరిగింది. ఇది 105వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ.
పురుషుల సింగిల్స్: స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించాడు. ఇది ఫెదరర్‌కు ఐదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2012లో వింబుల్డన్ గెలిచిన తర్వాత ఫెదరర్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో మూడు భిన్న గ్రాండ్‌స్లామ్స్‌లో ఐదేసి టైటిళ్లు గెలిచిన తొలి క్రీడాకారుడిగా ఫెదరర్ ఘనత సాధించాడు. ఇందులో ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఏడు వింబుల్డన్, ఐదు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.
మహిళల సింగిల్స్: అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన సోదరి వీనస్ విలియమ్స్‌పై ఫైనల్లో గెలుపొంది ఏడోసారి టైటిల్ సాధించింది. ఇది సెరెనాకు 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా సెరెనా కొత్త చరిత్ర సృష్టించింది. 22 టైటిల్స్‌తో స్టెఫీగ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సెరెనా విలియమ్స్ తిరగరాసింది.
పురుషుల డబుల్స్: హెన్రీ కోంటెనెన్ (ఫిన్లాండ్), జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీ.. అమెరికాకు చెందిన బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్‌లను ఫైనల్లో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించింది.
మహిళల డబుల్స్: బెథాని మాటెక్ సాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించారు. ఫైనల్లో ఆండ్రియా హ్లవకోవా (చెక్ రిపబ్లిక్), పెంగ్ షు (చైనా)ను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్: జువాన్ సెబాస్టియన్ కబాల్ (కొలంబియా), ఎబిగేల్ స్పియర్స్ (అమెరికా) జోడీ ఫైనల్లో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా), సానియా మీర్జా (భారత్)ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
ఫ్రెంచ్ ఓపెన్
గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫ్రెంచ్ ఓపెన్ రెండోది. 116వ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2017, మే 28 నుంచి జూన్ 11 వరకు పారిస్‌లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగింది.
పురుషుల సింగిల్స్: స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన స్టానిస్లాస్ వావ్రింకాను ఓడించి, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇది నాదల్‌కు పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. గతంలో 2005-2008, 2010-2014లో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో నాదల్ అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన క్రీడాకారుల జాబితాలో పీట్ సంప్రాస్ (14 టైటిళ్లు)ను వెనక్కునెట్టి 15 టైటిళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఒకే గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న క్రీడాకారిణి ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ కోర్ట్. ఈమె ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను 11 సార్లు సాధించింది. ఆమె తర్వాతి స్థానం నాదల్‌దే.
మహిళల సింగిల్స్: జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) ఫైనల్లో రొమేనియాకు చెందిన సిమోనా హాలెప్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. ఇది ఆమెకు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. 1997, జూన్ 8న లాత్వియా రాజధాని రీగాలో జన్మించిన జెస్టాపెంకో కేవలం 20 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకోవడం విశేషం. లాత్వియా నుంచి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన తొలి వ్యక్తి జెలెనా ఒస్టాపెంకో. 1933 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఒస్టాపెంకో. కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న మూడో వ్యక్తి ఒస్టాపెంకో. అంతకుముందు బార్బారా జోర్డాన్ (1979), గుస్తావో కుయెర్టన్ (1997) ఈ ఘనత సాధించారు.
పురుషుల డబుల్స్: ర్యాన్ హారిసన్ (అమెరికా), మైఖేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గింది. వీరు ఫైనల్లో శాంటియాగో గోంజాలెజ్ (మెక్సికో), డొనాల్డ్ యంగ్ (అమెరికా)లను ఓడించారు.
మహిళల డబుల్స్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథానీ మాటెక్ శాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో వీరు ఆస్ట్రేలియాకు చెందిన యాష్లీ బార్టీ, కేసీ డెల్లాక్వాలను ఓడించింది.
మిక్స్‌డ్ డబుల్స్: భారత టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న.. గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఈ జోడీ అన్నా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా (కొలంబియా)లను ఓడించింది. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా రోహన్ బోపన్న గుర్తింపు పొందాడు. మిగిలిన ముగ్గురూ మహేశ్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా.
వింబుల్డన్ ఓపెన్
పతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు లండన్‌లో 2017, జూలై 3 నుంచి 16 వరకు జరిగాయి. ఇది 131వ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌ల తర్వాత ఈ ఏడాది జరిగిన మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్.
పురుషుల సింగిల్స్: స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫెదరర్.. క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిచ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. టోర్నీ మొత్తంలో ఫెదరర్ ఒక్క సెట్‌నూ కోల్పోకపోవడం విశేషం. ఇది ఫెదరర్‌కు 8వ వింబుల్డన్ టైటిల్, 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. ఈ రెండూ ప్రపంచ రికార్డులు కావడం విశేషం. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను కూడా రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు.
మహిళల సింగిల్స్: స్పెయిన్ క్రీడాకారిణి గార్బీన్ ముగురుజా ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌ను ఓడించి, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను తొలిసారి సాధించింది. 1994లో కాంషిటా మార్టినెజ్ తర్వాత వింబుల్డన్ గెలిచిన స్పానిష్ క్రీడాకారిణి ముగురుజా కావడం విశేషం. 23 ఏళ్ల ముగురుజాకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ దక్కించుకుంది.
పురుషుల డబుల్స్: పురుషుల డబుల్స్ టైటిల్‌ను లుకాస్ కుబోట్ (పోలండ్), మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా), మేట్ పావిచ్ (క్రొయేషియా)ను ఓడించారు.
మహిళల డబుల్స్: వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను రష్యా క్రీడాకారిణులు ఎకతెరినా మకరోవా, ఎలీనా వెస్నినా కైవసం చేసుకున్నారు. వీరు ఫైనల్లో చాన్ హా చింగ్ (చైనీస్ తైపీ), మోనికా నికులెస్క్యూ (రుమేనియా)లను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్: జేమీ ముర్రే (యూకే), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. వీరు ఫైనల్లో హెన్రీ కొంటెనెన్ (ఫిన్లాండ్), హీతర్ వాట్సన్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధించారు.
యూఎస్ ఓపెన్
ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంటైన యూఎస్ ఓపెన్.. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 10 వరకు న్యూయార్క్‌లో జరిగింది.
పురుషుల సింగిల్స్: స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ ఫైనల్లో దక్షిణాఫ్రికా క్రీడాకారుడు కెవిన్ అండర్సన్‌ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఇది నాదల్‌కు 16వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్.
మహిళల సింగిల్స్: అమెరికన్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ తన దేశానికే చెందిన మాడిసన్ కీస్‌ను ఫైనల్లో ఓడించి, కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించింది.
పురుషుల డబుల్స్: నెదర్లాండ్స్‌కు చెందిన జీన్ జులియన్ రోజర్, రొమేనియాకు చెందిన హోరియా టెకావు ద్వయం పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో వీరు ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్), మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడీని ఓడించారు.
మహిళల డబుల్స్: చాన్ యుంగ్ జాన్ (చైనీస్ తైపీ), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ టైటిల్ గెలుచుకుంది. వీరు ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రీడాకారిణులు లూసీ హ్రదేకా, కటెరినా సినికోవాలను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్: మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), జేమీ ముర్రే (యూకే) ద్వయం ఫైనల్లో చాన్ హో చింగ్ (చైనీస్ తైపీ), మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి, టైటిల్ సాధించింది.

Published date : 13 Oct 2017 11:08AM