క్రీడలు-పురస్కారాలు
- రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం:
క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు.ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడలు వంటి పలు అంతర్జాతీయ టోర్నీల్లో గత నాలుగేళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తిగత క్రీడాకారులు లేదా టీమ్‌కు దీనిని ప్రదానం చేస్తారు. అవార్డు కింద, మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.7.5 లక్షలు నగదు ను బహుకరిస్తారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మొదటి అవార్డును స్వీకరించగా ఇప్పటివరకు దాదాపు 34 మందికి దీనిని బహుకరించారు.
ఖేల్ రత్న అవార్డు విజేతలుసంవత్సరం
విజేత
విభాగం
1992
విశ్వనాథన్ ఆనంద్
చదరంగం
1993
గీత్ సేథి
బిలియర్డ్స్
1995
హోమీ డీ మోతీవాలా &పుష్పేంద్ర కుమార్ గార్గ్
యాచింగ్ (టీం)
1996
కరణం మల్లే్లశ్వరి
వెయిట్ లిఫ్టింగ్
1997
ఎస్.కుంజురాణి దేవి & లియాండర్ పేస్
వెయిట్ లిఫ్టింగ్ &టెన్నిస్
1998
సచిన్ టెండూల్కర్
క్రికెట్
1999
జ్యోతిర్మయి సికందర్
అథ్లెటిక్స్
2000
ధన్‌రాజ్ పిళ్ళై
హాకీ
2001
పుల్లెల గోపీచంద్
బ్యాడ్మింటన్
2002
అభినవ్ బింద్ర
షూటింగ్
2003
అంజలి భగవత్ & బీనామోల్
షూటింగ్ & స్నూకర్స్
2004
అంజు బాబి జార్జ్
అథ్లెటిక్స్
2005
రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్
షూటింగ్
2006
పంకజ్ అద్వానీ
బిలియర్డ్స్& స్నూకర్స్
2007
మానవ్‌జిత్ సింగ్ సంధు
షూటింగ్
2008
మహేంద్ర సింగ్ ధోనీ
క్రికెట్
2009
మేరీకోమ్, విజేందర్ సింగ్, సుశీల్ కుమార్
బాక్సింగ్, బాక్సింగ్ & రెజ్లింగ్
2010
సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్
2011
గగన్ నారంగ్
షూటింగ్
2012
విజయ్ కుమార్ & యోగేశ్వర్ దత్
షూటింగ్ & రెజ్లింగ్
2013
రంజన్ సోధీ
షూటింగ్
2015
సానియా మీర్జా
టెన్నీస్
2016
పి.వి. సింధు, దీపా కర్మాకర్,సాక్షి మాలిక్, జీతూరాయ్
బాట్మింటన్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, షూటింగ్
2017
దేవేంద్ర ఝజరియా & సర్దార్ సింగ్
జావెలిన్ త్రో & హాకీ
- ధ్యాన్ చంద్ అవార్డు
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సాధించిన భారత క్రీడాకారులనుప్రభుత్వం ఏటా ధ్యాన్ చంద్ అవార్డుతో సత్కరిస్తోంది. విజేతలకు శిల్పం, సర్టిఫికెట్ పాటు రూ.5 లక్షల నగదును బహుకరిస్తారు. 2017 సంవత్సరానికిగాను ఈ అవార్డును ముగ్గురు క్రీడాకారులు భూపేందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ) కు ప్రదానం చేశారు.
- అర్జున అవార్డు
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించడానికి యువజన, క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1961 నుంచి అర్జున అవార్డును ప్రదానం చేస్తుంది. అవార్డు గ్రహీతలను అర్జునుడి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదుతో సత్కరిస్తారు. గడిచిన నాలుగేళ్లలో మంచి క్రీడా ప్రతిభను కనబర్చటమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కలిగిని వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 2017 సంవత్సరానికిగాను ఈ అవార్డును 17 మంది క్రీడాకారులు అందుకొన్నారు.
2017 అవార్డు గ్రహీతలు
చటేశ్వర్ పుజారా (క్రికెట్), హర్మన్ ప్రీత్ కౌర్ (క్రికెట్), ఎస్‌ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్), వీజే సురేఖ (ఆర్చరీ), మరియప్పన్ తంగవేలు (హైజంప్) ఖుష్బీర్ కౌర్ (అథ్లెట్), అరోకియా రాజీవ్ (అథ్లెట్) వరుణ్ భటి (అథ్లెట్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్ బాల్), సాకేత్ మైనేనీ (టెన్నీస్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ) ప్రకాశ్ నంజప్ప (షూటింగ్) ఆంథోనీ అమల్ రాజ్(టేబుల్ టెన్నిస్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్)
- ద్రోణాచార్య అవార్డు
అంతర్జాతీయ స్థాయిలో పతక విజేతలను తయారుచేసిన ఉత్తమ క్రీడా శిక్షకులకు 1985 సంవత్సరం నుంచి ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తున్నారు. విజేతలకు ద్రోణాచార్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.7 లక్షల నగదును బహుకరిస్తారు. ఏటా హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి ఆగస్టు 29న జాతీయ క్రీడలు దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. 2017 సంవత్సరానికిగాను ఈ అవార్డును ఏడుగురికి అందించారు.
2017 అవార్డు గ్రహీతలు
దివంగత డాక్టర్ ఆర్.గాంధీ - అథ్లెటిక్స్
జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ - బ్యాడ్మింటన్
బీబీ మహంతి - బాక్సింగ్
హీరానంద్ - కబడ్డీ
రాఫెల్ - హాకీ
సంజయ్ చక్రవర్తి - షూటింగ్
రోషన్ లాల్ - రెజ్లింగ్