Skip to main content

దేశంలో ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఎక్కడ ఏర్పాటు కానుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలోని కోటపల్లి పంచాయతీ పరిధిలో ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఏర్పాటు అవుతోంది.

3.4 కిలోమీటర్లతో 219 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2017లో బెంగళూరుకు చెందిన నిధి మార్క్ వన్ మోటార్స్’ సంస్థతో కోటపల్లి వద్ద ఫార్ములా-3 ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అయితే నిర్మాణ పనులు ఇటీవలే మొదలయ్యాయి.

దేశంలో మూడోది...

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వద్దనున్న ‘బుద్ద ఇంటర్నేషనల్ సర్క్యూట్’ ఫార్ములా-1కు సంబంధించిన ట్రాక్.
  • తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని ఇడుంగట్టు కొటై్ట వద్ద 3.74 కిలోమీటర్ల ఫార్ములా-2 కార్ రేస్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.
  • కోటపల్లి వద్ద నిర్మిస్తున్నది ఫార్ములా-3 (ఎఫ్-3). ఇది దేశంలో మూడోది కాగా, ఏపీలో మొదటిది.


ఫార్ములా 1 (ఎఫ్-1) గురించి...

  • 1,000 హెచ్‌పీ (హార్స్ పవర్) ఇంజిన్ ఉంటుంది. రేస్‌లో వ్యత్యాసాలుంటాయి.
  • ప్రపంచ ఛాంపియన్లను దృష్టిలో పెట్టుకొని ఈ కార్లను, ట్రాక్‌లను రూపొందిస్తారు. రేస్‌లో పాల్గొనే కార్లు వివిధ రకాల డిజైన్లతో ఉంటాయి.
  • వారాంతంలో ఒకరోజు చొప్పున మూడు వారాలపాటు ఈ పోటీలు నిర్వహిస్తారు. గంటకు 1,000 కిలోమీటర్ల వేగం పరిమితి ఉంటుంది.


ఫార్ములా 2 (ఎఫ్-2) గురించి...

  • ఫార్ములా 2 రేస్‌లో పాల్గొనే కార్లకు 500 హెచ్‌పీ ఇంజిన్ ఉంటుంది.
  • కార్లు ఒకే డిజైన్ కలిగి ఉంటాయి. కార్ల రేస్ కూడా ఒకే రోజు మూడు గ్రూపులు విభజించి నిర్వహిస్తారు.
  • గంటకు 500 కిలోమీటర్ల వేగం అనుమతి ఉంటుంది.


ఫార్ములా 3 (ఎఫ్-3) గురించి...

  • ఫార్ములా 3 కార్లకు 250 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. ఇది బేసిక్ రేస్.
  • కార్లు ఒకే డిజైన్‌లో ఉంటాయి. ఒకే రోజు మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసి కార్ రేస్‌లు నిర్వహిస్తారు.
  • ఇందులో కార్ల వేగం గంటకు 250కిలోమీటర్లకు పరిమితం.
  • కార్ రేసింగ్‌తో పాటు కొత్త కార్ల పరీక్షా ప్రయోజనం కోసం ఇది ఉపయోగపడనుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫార్ములా-3 కార్ రేస్ ట్రాక్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : కోటపల్లి పంచాయతీ, తనకల్లు మండలం, కదిరి నియోజకవర్గం, అనంతపురం జిల్లా
Published date : 28 Dec 2020 06:01PM

Photo Stories