ఆస్ట్రేలియన్ ఓపెన్2018
Sakshi Education
2018లో తొలి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 15 నుంచి 28 వరకు మెల్‌బోర్న్‌లో జరిగింది. ఇది 106వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్.
పురుషుల సింగిల్స్
స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను అయిదు సెట్లలో ఓడించి టైటిల్ సాధించాడు. ఇది ఫెదరర్‌కు ఆరో ఆస్ట్రేలియన్ ఓపెన్, 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.
ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018.
ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009.
వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017.
యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008.
అత్యధిక గ్రాండ్‌స్లామ్ (పురుషులు) విజేతలు
రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)-20
రఫెల్ నాదల్ (స్పెయిన్)- 16
పీట్ సంప్రాస్ (అమెరికా)- 14
నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)- 12
రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా)- 12
మహిళల సింగిల్స్
మహిళల సింగిల్స్ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకి.. రొమేనియాకు చెందిన సిమోనా హాలెప్ పై మూడు సెట్లలో నెగ్గి, టైటిల్ సాధించింది. 11 ఏళ్ల పాటు శ్రమించిన కరోలిన్‌కు ఇది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆమె ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి డెన్మార్క్ క్రీడాకారిణిగా కరోలిన్ గుర్తింపు సాధించింది.
పురుషుల డబుల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఓలివర్ మరాచ్ (ఆస్ట్రియా), మేట్ పావిచ్ (క్రొయేషియా) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో వీరు కొలంబియాకు చెందిన సెబాస్టియన్ కబాల్, రాబర్ట్ ఫరా జంటను ఓడించారు.
మహిళల డబుల్స్
టిమియా బబోస్ (హంగేరీ), క్రిస్టినా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్) జంట మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. వీరు ఫైనల్లో రష్యన్ క్రీడాకారిణులు ఎకతెరినా మకరోవా, ఎలీనా వెస్నినా జంటను ఓడించారు.
మిక్స్‌డ్ డబుల్స్
మేట్ పావిచ్ (క్రొయేషియా), గాబ్రియేల్ దబ్రౌస్కీ (కెనడా) జంట ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. వీరు ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్), టిమియా బబోస్ (హంగేరీ) జంటను ఓడించారు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వారిలో ఎవరు అత్యధికంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించారు?
1) రోజర్ ఫెదరర్
2) సెరెనా
3) మార్గరెట్ కోర్ట్
4) స్టెఫీగ్రాఫ్
2. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను అత్యధికంగా ఆరుసార్లు ఎవరు గెలుచుకున్నారు?
1) రాయ్ ఎమర్సన్
2) నొవాక్ జొకోవిచ్
3) రోజర్ ఫెదరర్
4) పై అందరూ
3. 2018, జనవరిలో హాప్‌మన్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఏ దేశం విజయం సాధించింది?
1) ఫ్రాన్స్
2) బెల్జియం
3) స్విట్జర్లాండ్
4) జర్మనీ
సమాధానాలు:
1) 3; 2) 4; 3) 3

Published date : 03 Mar 2018 03:23PM