Skip to main content

ఐపీఎల్-2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 విజేతగా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.

రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తాజా టైటిల్ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్‌లోని దుబాయ్‌లో నవంబర్ 10న జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. విజేత ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

ఐపీఎల్-2020 అవార్డులు

  • పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: ట్రెంట్ బౌల్ట్ (ముంబై); ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
  • సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ పొలార్డ్ (ముంబై); ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు
  • డ్రీమ్-11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కేఎల్ రాహుల్ (పంజాబ్); ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు
  • ఫెయిర్ ప్లే అవార్డు ముంబై ఇండియన్స్.
  • ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్) కేఎల్ రాహుల్ 670 పరుగులు-కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
  • పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) కగిసో రబడ 30 వికెట్లు- ఢిల్లీ క్యాపిటల్స్; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
  • ఎమర్జింగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ 473 పరుగులు-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు; ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్-రాజస్తాన్ రాయల్స్; ప్రైజ్‌మనీ: రూ.10 లక్షలు


మరికొన్ని విశేషాలు...

  • ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ రోహిత్ శర్మ. ఎమ్మెస్ ధోని (204 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు.
  • ఐపీఎల్‌లో ‘ఆరెంజ్ క్యాప్’ నెగ్గిన నాలుగో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2010), రాబిన్ ఉతప్ప (2014), విరాట్ కోహ్లి (2016) ఈ ఘనత సాధించారు.
  • ముంబై ఇండియన్స్ తాజా ఐపీఎల్ టైటిల్‌తో టి20 ఫార్మాట్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ (15 టైటిల్స్) గుర్తింపు పొందాడు. 14 టైటిల్స్‌తో డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును పొలార్డ్ సవరించాడు.

ఐపీఎల్ చాంపియన్స్

ఏడాది

విజేత

2008

రాజస్తాన్ రాయల్స్

2009

దక్కన్ చార్జర్స్

2010

చెన్నై సూపర్ కింగ్స్

2011

చెన్నై సూపర్ కింగ్స్

2012

కోల్‌కతా నైట్‌రైడర్స్

2013

ముంబై ఇండియన్స్

2014

కోల్‌కతా నైట్‌రైడర్స్

2015

ముంబై ఇండియన్స్

2016

సన్‌రైజర్స్ హైదరాబాద్

2017

ముంబై ఇండియన్స్

2018

చెన్నై సూపర్ కింగ్స్

2019

ముంబై ఇండియన్స్

2020

ముంబై ఇండియన్స్

Published date : 11 Nov 2020 06:08PM

Photo Stories