మానవ హక్కుల కమిషన్
Sakshi Education
ఆరు నెలలుగా పోస్టింగుల కోసం ఎదురుచూస్తూ.. అటు ఇంట్లో ఉండలేక, ఇటు సమాజంలో ముఖం చూపించలేక మానసిక వేదనకు గురవుతున్నామంటూ తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్‌పై క్విక్‌రివ్యూ...
‘పౌర స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడానికి రాజ్యం ప్రయత్నించినపుడు అడ్డుపడే తురుపు ముక్కలాంటివే మానవ హక్కులు’ అని ప్రముఖ తత్వవేత్త రొనాల్డ్ డ్వార్కిన్ అభిప్రాయపడ్డారు. మానవులు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలే మానవహక్కులు. ఇవి కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతం. దేశంలో మానవహక్కుల పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవ హక్కుల కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ 1993లో జాతీయ హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. దీన్ని 2006లో సవరించారు.
సభ్యుల నియామకం: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షునిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి(పదవిలో ఉన్నా లేదా విరమణ చేసినా), హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(పదవిలో ఉన్నా లేదా విరమణ చేసినా), మానవ హక్కుల కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఇద్దరు వ్యక్తులను సభ్యులుగా నియమిస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలో అంతరంగిక వ్యవహారాల మంత్రి, లోక్‌సభ స్పీకర్.. లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ ఉపాధ్యక్షులు సభ్యులుగా గల కమిటీ సిఫార్సు మేరకు కమిషన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్లు వచ్చేంతవరకు(ఏది ముందు సంభవిస్తే అది).
విధులు:
అధికారాలు

- కమిషన్ స్వయంగా లేదా బాధితుని ఫిర్యాదు మేరకు లేదా కోర్టు ఉత్తర్వు మేరకు...
ఎ) హక్కుల ఉల్లంఘన జరిగినపుడు
బి) ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా హక్కుల ఉల్లంఘన నివారించకుంటే విచారణ చేయడం - న్యాయస్థానం అనుమతి మేరకు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కార్యవ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం
- ప్రభుత్వ నిర్వహణలోని సంస్థలను, జైళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం
- మానవహక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, శాసన సభల చట్టాలను సమీక్షించి వాటిని ప్రభావవంతంగా అమలుచేయడానికి సూచనలివ్వడం
అధికారాలు
- సివిల్ కోర్టుకున్న అధికారాలు ఉంటాయి.
ఎ) అఫిడవిట్లు, సాక్ష్యాధారాలు సేకరించడానికి..
బి) న్యాయస్థానం, ప్రభుత్వకార్యాలయం నుంచి అవసరమైన సమాచారం పొందడానికి..
సి) సాక్ష్యాలను విచారించడానికి, అధికార ప్రతులు పరిశీలించడానికి.. - కమిషన్ తాను దర్యాప్తు చేస్తున్న కేసును మెజిస్ట్రేట్‌కు పంపడానికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు కేసును బదిలీ చేయడానికి అధికారం ఉంటుంది.
Published date : 30 Mar 2019 02:37PM