Skip to main content

Mrs India: మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ మహిళ... తొలిసారిగా రికార్డు

అందాల పోటీల్లో తొలిసారి తెలంగాణ మహిళ మెరిసింది. మిసెస్‌ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్‌గా నిలిచారు. రాజస్థాన్‌ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్‌గా నిలిచారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్‌ చేరుకోగా.. తుది పోటీల్లో కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్‌ ఇండియా తెలంగాణ రీజనల్‌ డైరెక్టర్‌ మిసెస్‌ మమతా త్రివేదీ ఆమెకు మెంటర్‌గా వ్యవహరించారు.

చ‌ద‌వండి: సాక్షిఎడ్యుకేష‌న్‌తో షేర్‌ చేసుకోండి... క్యాంపస్‌ జర్నలిస్టులుగా ఎద‌గండి
10 కేటగిరీల్లో 30 మందితో పోటీ...
వీణా పుజారి కిరణ్మయికి దుస్తులు డిజైన్‌ చేయగా... 10 కేటగిరీల్లో 30 మందితో పోటీపడ్డారు. టాలెంట్‌ రౌండ్‌ , డాన్స్‌ రౌండ్‌ , సఫారీ రౌండ్‌ తో పాటు ఫ్యాషన్‌ రౌండ్స్‌లో గట్టిపోటీ నడిచినప్పటికీ... జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్‌ కేటగిరీకి సంబంధించి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు.

చ‌ద‌వండి: శిథిలాల కిందే చిన్నారికి జననం... బిడ్డను కనులారా చూడకుండానే...!
గతంలో మిసెస్‌ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్‌ టైటిల్‌....
కిరణ్మయి గతంలో 2019 మిసెస్‌ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్‌ టైటిల్‌ గెలిచారు. వివాహం తర్వాత మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఏదైనా సాధించొచ్చు అనేది రుజువు చేసే ఉద్దేశంతో మిసెస్‌ ఇండియా పోటీలకు సిద్ధమయ్యారు.

KiranmaiAlivelu

దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్‌ అయ్యి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో తన అందంతో పాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు.

చ‌ద‌వండి: భార‌త్ మీదుగా ప్ర‌యాణించిన బెలూన్‌.. అయినా ప‌స‌గ‌ట్ట‌లేక‌పోయాం
ఇదే తొలిసారి..!
మిసెస్‌ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇదే తొలిసారి. ఈ విజయంపై కిరణ్మయి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందాల పోటీల్లో వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి తాను రోల్‌ మోడల్‌గా నిలవాలనే లక్ష్యంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెబుతున్నారు.

Published date : 08 Feb 2023 05:55PM

Photo Stories