Bill Register: బిల్లును ఆమోదించిన పార్లమెంట్..!
ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్‌సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023ను ప్రవేశ పెట్టారు.
Should Know Hindi: అయోమయంలో ‘ఇండియా’.. అసలు ఏం జరిగిందంటే..!
ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ (పీఆర్‌బీ) చట్టం–1867 ప్రకారం పత్రికలను రిజిస్టర్ చేసుకోవాలంటే ఎనిమిదంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీనిని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునే వారు ఒకే ఒక విడతలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్ట్ 3వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది.