Nirmala: డబ్బులు చేతిలో మిగుల్చుకోవడానికే కొత్త పన్ను విధానం తెచ్చాం : నిర్మలా
Sakshi Education
కొత్త ఆదాయపు పన్ను విధానం వల్ల మధ్య తరగతికి మేలు చేకూరుతుందని, డబ్బులు చేతిలో మిగుల్చుకోవడానికే కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడి పెట్టాలని తాము చెప్పడం లేదని, పెట్టుబడి విషయంలో వ్యక్తులకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్ అనంతరం ఆర్‌బీఐ బోర్డుతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. క్రిప్టో విషయంలో కామన్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించేందుకు జీ20 దేశాలతో చర్చిస్తున్నామని తెలిపారు. ధరల పెరుగుదల గురించి విలేకరులు లేవనెత్తిన ప్రశ్నలపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాధానం ఇచ్చారు. ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే 2023–24లో ద్రవ్యోల్బణం 5.3 శాతానికి చేరనుందని అంచనా వేశారు.
Published date : 11 Feb 2023 04:20PM