Skip to main content

ఉమాంగ్ యాప్‌

ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలు రిజిస్టర్ చేసినందుకుగాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓకు ప్లాటినం పార్టనర్ అవార్డు లభించింది.
ఉమాంగ్ యాప్‌ను ఆవిష్కరించి 3 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ 2020, నవంబర్ 25న ఉమాంగ్ పార్టనర్ అవార్డులను ప్రకటించారు. అన్ని సేవల్లో గత ఆరు నెలల్లో జరిగిన లావాదేవీల సరాసరి ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించారు. ఇందులో 25 లక్షల లావాదేవీలు జరిపినందుకుగాను ఈపీఎఫ్‌ఓ ప్లాటినం అవార్డును గెలుచుకుంది.

ఉమాంగ్ గురించి...
ప్రజలకు సులువుగా, త్వరగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో... ఉమాంగ్ (UMANG-The Unified Mobile Application for New-age Governance) యాప్‌ను రూపొందించారు. ఎలక్టాన్రిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్(ఎన్‌ఈజీపీ) ఉమాంగ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. 2017, నవంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 163 సేవలతో ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్రస్తుతం 2039 సేవలను అందిస్తోంది.

విదేశాలలోనూ...
భారత విదేశీ మంత్రిత్వ శాఖ సహకారంతో అమెరికా, కెనడా,యూకే , ఆస్ట్రేలియా, యూఏఈ , నెథర్లాండ్స్ , సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉమాంగ్ యాప్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను విదేశాలలో చదువుతున్న విద్యార్థులు, ప్రవాస భారతీయులు, విదేశీ పర్యాటకులు పొందగలుగుతారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఉమాంగ్ ప్లాటినం పార్టనర్ అవార్డును గెలుచుకున్న సంస్థ
ఎప్పుడు : 2020, నవంబర్ 25
ఎవరు : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓ
ఎందుకు : ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలు రిజిస్టర్ చేసినందుకుగాను
Published date : 26 Nov 2020 05:55PM

Photo Stories