Skip to main content

పంచారామ క్షేత్రాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం, సోమారామం, క్షీరారామం, భీమారామం, కుమారారామం చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను భారతీయ తపాల శాఖ ప్రత్యేకంగా రూపొందించింది.

ఈ పోస్టుకార్డులను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిసెంబర్ 9న విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తపాల శాఖ సేవలు వినియోగించుకుంటామని మంత్రి వెల్లడించారు.

పంచారామ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. అవి:

ఆరామం

శివుని పేరు

పట్టణం

జిల్లా

అమరారామం

అమరేశ్వరుడు

అమరావతి

గుంటూరు

సోమారామం

సోమేశ్వరుడు

భీమవరం

పశ్చిమ గోదావరి

క్షీరారామం

రామలింగేశ్వరుడు

పాలకొల్లు

పశ్చిమ గోదావరి

ద్రాక్షారామం

భీమేశ్వరుడు

ద్రాక్షారామం

తూర్పు గోదావరి

కుమారారామం

కుమార భీమేశ్వరుడు

సామర్లకోట

తూర్పు గోదావరి

Published date : 14 Dec 2020 05:47PM

Photo Stories