Skip to main content

మాస్కుల‌పై మ‌ధుబ‌ని పెయింటింగ్స్

ఇటీవల, మాస్కులపై చేతితో మ‌ధుబ‌ని పెయింటింగ్స్ వేయ‌డం ద్వారా బీహారు‌లోని మధుబని జిల్లాకు చెందిన కళాకారులు దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సాధించారు. మోటిఫ్ ఒక అలంకార చిత్రం లేదా రూపకల్పన, ఒక నమూనాను ఏర్పరుస్తుంది.

ప్రధానాంశాలు

  • మూలం: మధుబని పెయింటింగ్ మూలాలు బీహార్‌లోని మిథిలా ప్రాంతంలో ఉన్నాయి.
  • ఈ పెయింటింగ్ నేపాల్ లో సైతం ఎంతో ప్రాచుర్యం పొందిన‌ పురాతన భారతీయ కళారూపాలలో ఒకటి.
  • భారతీయ ఇతిహాస‌మైన‌ రామాయణంలో సైతం మధుబని ఆనవాళ్ళు గమనించవచ్చు.
  • దీనిని మిథిలా లేదా మధుబని కళ అని కూడా అంటారు.
లక్షణాలు: ఈ పెయింటింగ్స్ గిరిజన మూలాలు, ప్రకాశవంతమైన మట్టి రంగులను ఉపయోగించడం వల్ల బాగా ప్రాచుర్యం పొందాయి.
  • గ్రామాల‌లోని మహిళలు వారి భావాలు, ఆశలు, ఆలోచనలకు అనుగుణంగా వారి ఇళ్ల గోడ‌ల‌పై వేశారు.
  • ఆ పెయింటింగ్స్ కి మంచి డిమాండ్ ఉండ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం పురుషులు సైతం వీటిని వేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.
శైలి: ఇందులో రేఖాగణిత నమూనాలు, పూల, జంతువు, పక్షి మూలాంశాలు ఉంటాయి.

రంగులు: పెయింటింగ్స్‌లో ఉపయోగించే రంగులు మొక్కలు, ఇతర సహజ వనరులు, సహజమైన పదార్దాల నుంచి సేక‌రిస్తారు. ఉదా .: ఆవు పేడకి మసి కలిపి నలుపు రంగు, ఇండిగో నుంచి నుండి నీలం; బియ్యం పొడి నుండి తెలుపు; పలాషా పువ్వుల నుండి నారింజ త‌యారు చేస్తారు.
  • ఈ పెయింటింగ్స్ లో షేడింగ్ కానీ, ఖాళీలు లేకుండా క‌ల‌ర్స్ వేస్తారు.
  • ఇవి సాధారణంగా ముదురు మరియు ప్రకాశవంతంగా ఉంటాయి. లాంప్‌బ్లాక్ (బొగ్గు నుండి పొందినవి), ఓచర్ (మట్టి పసుపు వర్ణద్రవ్యం) వంటివి.
  • ఒక‌ప్పుడు పెయింటింగ్స్ ని కొమ్మలు, అగ్గిపెట్టెలు, వేళ్ళతో వేసేవారు.
  • కానీ ఇటీవ‌ల కాలంలో చాలామంది కళాకారులు పెయింట్ చేయడానికి బ్రష్‌లు, నిబ్-పెన్నులు మరియు సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నారు.
థీమ్స్: కృష్ణ, రాముడు, లక్ష్మి, శివ, దుర్గా, సరస్వతి వంటి హిందూ దేవతల జీవితాన్ని వర్ణించే పౌరాణిక పాత్రల మీద ఆధారపడి ఉంటుంది.
  • వీటిలో ఎక్కువ‌గా తుల‌సి మొక్క, కోర్టు దృశ్యాలు, వివాహ దృశ్యాలు, సామాజిక సంఘటనలు మొదలైనవి ఉంటాయి.
  • అలాగే, సూర్యుడు మరియు చంద్రుడు పెయింటింగ్స్ వేస్తారు.
ప్రముఖ కళాకారులు: కర్పూరి దేవి, మహాలక్ష్మి మరియు దులారి.
Published date : 03 Aug 2020 07:55PM

Photo Stories