Skip to main content

అస్సాం వరద, కాజీరంగ పర్యావరణ వ్యవస్థ

అస్సాంలో ఇటీవల వచ్చిన వరదలు వ‌ల్ల భారీ ప్రాణనష్టం, ప్రజలు, జంతువులకి ఇబ్బందులు క‌ల‌గడంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి, ప‌ర్యావరణ న‌ష్టానికి కార‌ణం అయ్యాయి. అలాగే కాజీరంగ నేషనల్ పార్క్ 80% వ‌ర‌ద‌ల్లో మునిగిపోయింది.

ప్రధానాంశాలు
వరదలకు కారణం:

 • న‌ది కట్టలు ఆన‌క‌ట్టల‌ను స‌రిగా నిర్మించ‌క‌పోవ‌డంతో పాటు వాటిని నిర్వహ‌ణ స‌రిగ్గా లేక‌పోవ‌డం వరదలకు ప్రధాన కారణం.
 • అస్సాంలో వరద నిర్వహణకి పూర్తిగా ఆన‌కట్టలపై ఆధారపడటం.
 • అస్సాం 1960 లలో కట్టలను నిర్మించడం ప్రారంభించింది. వాటిలో ఎక్కువ భాగం వాటి జీవిత‌కాలం కంటే ఎక్కువ కాలం వినియోగంలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు 1990 ల నుండి కూలిపోతూ వ‌చ్చాయి. ముఖ్యంగా 2000 సంవ‌త్స‌రం నుంచి అది మరింత తీవ్రం అయ్యింది.
 • నదుల పరీవాహక ప్రాంతాలలో భారీగా అడవుల‌ను న‌రికేయటం, లేదా ఆనకట్టల ద్వారా జలాలను విడుదల చేయడం.
 • వాతావరణ మార్పు కూడా వరదలకు ఒక కార‌ణం.
కాజీరంగలో వరదలు:
 • వ‌ర‌దలు కాజీరంగ జీవావ‌ర‌ణ‌వ్యవస్థకు అవ‌స‌ర‌మ‌ని నిపుణుల నమ్మకం. పార్క్ వ్యవస్థ నీరు లేకుండా మనుగడ సాగించలేదు.
 • కాజీరంగ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ (కెఎన్‌పీటీఆర్) బ్రహ్మపుత్ర నది, కర్బి ఆంగ్లాంగ్ హిల్స్ మధ్య ఉంది. ఈ ప్రాంతం మొత్తం బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల ఒండ్రు నిక్షేపాల ద్వారా ఏర్పడింది.
 • వరదల వ‌ల్ల కాజీరంగ నీటి వనరులను నింపడానికి, అక్కడి చిత్తడి నేలలు, గడ్డి భూములు, సెమీ సతత హరిత ఆకురాల్చే అడవుల మిశ్రమ భూముల‌ను నిర్వహించ‌డానికి ఉపయోగ‌ప‌డ‌తాయి.
 • వరద నీరు చేపల పెంపకం కొరకు పనికొస్తుంది. వీటిలో చాలా వ‌ర‌కు బ్రహ్మపుత్ర న‌దిలోకి వెళతాయి. అంటే కాజీరంగ వరదలు బ్రహ్మపుత్ర చేపల నిల్వను పెంచుతాయి.
 • ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకునే వాటర్ హైసింత్ వంటి అవాంఛిత మొక్కలను నిర్మూలించ‌డానికి ఈ వ‌ర‌ద‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
సమస్యలు:
 • తరచుగా వరదలు: ఇంత‌కుముందు, పదేళ్ళకు ఒకసారి భారీ స్థాయిలో వరద వచ్చేది. కానీ ఇప్పుడు అవి రెండేళ్లకి ఒక‌సారి వ‌స్తున్నాయి.
 • NH-37: వరద నీరు భారీగా వ‌చ్చిన‌ప్పుడు, జంతువులు కర్బీ ఆంగ్లాంగ్ కొండలలో సురక్షితమైన, ఎత్తైన ప్రదేశానికి వెళ‌తాయి. ఈ క్రమంలో అవి NH-37 ను దాటాలి. ఇది పార్కుకు మ‌ధ్యలో ఉంటుంది. దాంతో ఎన్నో జంతువులు రోడ్డు ప్రమాదాలలో మ‌ర‌ణించేవి.
 • ఈ అవ‌కాశాన్ని ఉపయోగించుకుని వేట‌గాళ్లు ఎన్నో జంతువుల‌ను వేటాడ‌తారు.
 • మానవ-జంతు సంఘర్షణ: జంతువులు కూడా వరదల్లో గ్రామాల వైపు వెళ‌తాయి, ఇది మానవ-జంతు సంఘర్షణకు దారితీస్తుంది.
వరద సమయంలో తీసుకున్న చర్యలు:
 • అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి వచ్చిన సూచ‌న‌లు ప‌రిగ‌ణలోకి తీసుకుని, అరుణాచల్ ప్రదేశ్ లోని బ్రహ్మపుత్ర ఉపనదుల నీటి మట్టాలను పర్యవేక్షిస్తారు.
 • వరద సమయంలో అడవి జంతువులను వేటాడటం, హాని చేయడంపై అవగాహన కల్పించడానికి శిబిరాలు నిర్వహిస్తారు.
 • వరదలు వ‌చ్చినప్పుడు, సీఆర్పిసీ సెక్షన్ 144 ప్రకారం ఎన్హెచ్-37పై వాహ‌నాల వేగ పరిమితులు అమలు చేస్తారు. అవ‌స‌ర‌మైతే జరిమానాలు విధిస్తారు. జంతువులను కార్బీ ఆంగ్లాంగ్ హిల్స్కి వెళ్లేలా బారికేడ్లు కూడా ఏర్సాటు చేస్తారు.
Published date : 29 Jul 2020 06:07PM

Photo Stories