Skip to main content

లక్షద్వీప్

అవతరణ: నవంబర్ 1, 1956 లో లక్కదీవి, మినికాయ్, అమిందివి దీవులు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. నవంబర్ 1, 1973 లో లక్షద్వీప్‌గా పేరు మార్చుకున్నాయి.
విస్తీర్ణం: 32 చ.కి.మీ
రాజధాని: కవరట్టి
సరిహద్దు రాష్ట్రాలు: కేరళ, కర్ణాటక.
సముద్రం: అరేబియా మహా సముద్రం
జనాభా: 64,429
స్త్రీలు: 31,323
పురుషులు: 33,106
జనసాంద్రత: 2,013
లింగనిష్పత్తి: 946
అక్షరాస్యత: 92.28
స్త్రీలు: 88.25
పురుషులు: 96.11
మొత్తం జిల్లాలు: దీవులన్నింటిని కలిపి ఒకే జిల్లాగా, నాలుగు తాలుకాలుగా పరిగణిస్తున్నారు.
గ్రామాలు: 28
పట్టణాలు: 3
శాసనసభ: లేదు
పార్లమెంట్: లోక్‌సభ-1, రాజ్యసభ-లేరు.
హైకోర్టు: కేరళ
ముఖ్యభాష: జెసిరి(ద్వీప్‌భాష), మహల్, మలయాళం
ప్రధాన మతం: ఇస్లాం
ప్రధాన పట్టణం: కవరట్టి, అగటిచ మినికాయ్, అడ్రోట్ట్, కాల్‌పెని, అమిని, కడమట్టి, కిల్‌టన్
జాగ్రఫీ: లక్షద్వీప్ 32 చ.కి.మీ ఉన్న 36 దీవుల సముదాయం. అందులో 10 మాత్ర మే జన నివాసయోగ్యమైనవి. వీటిలో కేరళ తీరానికి దగ్గరగా 4.8 చ.కి.మీ ఉన్న అడ్రోత్ దీవి పెద్దది. లక్షద్వీప్ లాగోన్ ఏరియా 32 చ.కి.మీటర్లు. దీని నీటి పరిధి 20,000 చ.కి.మీ. కాగా దేశంలోనే 4 లక్షల చ.కి.మీ. ఆర్థిక మండలి పరిధి కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్.
ఖనిజాలు: సిలికా, కోరల్స్.
పరిశ్రమలు: చేపలు, పడవ నిర్మాణం (బోట్ బిల్డింగ్), చేపల రవాణా, పీచు.
వ్యవసాయోత్పత్తులు: కొబ్బరి, ఎండు కొబ్బరి, అరటి
రవాణా: లక్షద్వీప్ నుంచి కొచ్చికి నౌకమార్గం ఉంది. దాదాపు 18-20 గంటలు సమయం పడుతుంది.
విమానాశ్రయం: అగట్టి
ఓడరేవులు: కరవట్టి, మినికాయ్, అగట్టి, కడమట్టి, కల్‌పెని
Published date : 21 Nov 2012 03:29PM

Photo Stories