YSR Rythu bharosa Eligibility: వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులెవరు..?
Sakshi Education
భూ యజమానులతోపాటు, ఎటువంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలురైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్) రైతులకూ రైతు భరోసా వర్తిస్తుంది.
రైతు కుటుంబంలో అవివాహ కుమారుడికి కానీ, కుమార్తెకు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆ రైతుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి ప్రస్తుత, పదవీకాలం ముగిసిన మంత్రులు, ఏంపీలు, ఎంఎల్‌ఏలు, ఎమ్మెల్సీలు తప్ప మిగతా పౌరులందరూ అర్హులే.
పారదర్శకంగా అర్హుల ఎంపిక..
ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న సంకల్పంతో అర్హుల గుర్తింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తోంది. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అర్హులై ఉండి లబ్ధిపొందని వారి వివరాలను గ్రీవెన్స్ పోర్టల్‌లో పొందుపరిచి వారిలో అర్హులను గుర్తిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నివసిస్తూ మన రాష్ట్రంలో వ్యవసాయ భూములు ఉన్న 865 మంది రైతులకు కూడా ఈ ఏడాది రూ.13,500 వంతున రైతుభరోసా సాయం అందించారు.
Published date : 26 Oct 2021 01:53PM