Skip to main content

PM SVAnidhi : శుభ‌వార్త‌.. ఈ స్కీమ్‌ కింద రూ.50 వేల వరకు రుణాలు..! ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా.. ఎలాంటి గ్యారెంటీ లేకుండానే..

కరోనా మహమ్మారి వ‌ల్ల‌ కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా చిరు వ్యాపారులు చాలా నష్టపోయారు.
pm svanidhi scheme details
pm svanidhi scheme

ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు కేంద్ర​ ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకంపై అవగాహన లేక చిరు వ్యాపారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు.

National Pension Scheme : రూల్స్‌ మారాయ్‌..సడలించిన నిబంధనలు ఇవే

రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు రుణాలను..
భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు చిరు వ్యాపారులుగా జీవనం కొనసాగిస్తున్నారు. కోవిడ్‌​ రాక వారికి ఆర్థిక నష్టాలను మిగిల్చి వెళ్లింది. దీంతో వ్యాపారులకు ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం కొలేటరల్ ఫ్రీ లోన్ పథకాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన మంత్రి స్వానిధి పథకం (PM SVANidhi). ఈ పథకం కింద ప్రభుత్వం చిరు వ్యాపారులకు రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు రుణాలను అందిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం..  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రారంభ రుణ మొత్తాన్ని 10,000 నుంచి 20,000కి పెంచాలని భావిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం, బ్యాంకుల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. 2020 సంవత్సరంలో, బ్యాంకులు దాదాపు 20 లక్షల మందికి మొత్తం రూ. 10,000 రుణాలు మంజూరు చేయగా, 2021లో PM స్వానిధి పథకం ద్వారా మొత్తం 9 లక్షల మంది రుణాలు పొందారు. అదే సమయంలో, సెప్టెంబర్ 2022 వరకు మొత్తం 2 లక్షల మంది రూ. 10,000 రుణాలు పొందారు.

పేదరిక, నిరుద్యోగనిర్మూలన పథకాలు

లోన్‌ వివరాలు ఇవే..

pmsvanidhi

పీఎం స్వానిధి యోజన ద్వారా లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేయడానికి.., మీకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఈ లోన్‌ ముఖ్య ఉద్దేశ్యం చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత అందివ్వడమే. ఈ పథకం కింద దరఖాస్తుకు మొదటిసారిగా సంవత్సరానికి రూ. 10,000 రుణం మంజూరు చేస్తారు. సదరు వ్యక్తి ఒక సంవత్సరంలో దీనిని తిరిగి చెల్లిస్తే 20,000 రెండో సారి రుణాన్ని తీసుకోవచ్చు. అదే సమయంలో వ్యాపారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా మూడోసారి రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ లోన్‌పై, 7% వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.  మీరు మీ నెలవారీ చెల్లింపులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేస్తే, మీరు వడ్డీ రాయితీని కూడా అందుకుంటారు. 

ద‌ర‌ఖాస్తు చేయండిలా..
☛ ముందుగా http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
☛ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి I am not a robot పైన క్లిక్ చేయాలి.
☛ ఆపై అక్కడ ఉ‍న్న Request OTP బటన్ పైన క్లిక్ చేయండి.
☛ తర్వాత మీ మొబైల్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ (Verify OTP) పైన క్లిక్ చేయాలి.
☛ ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిన తర్వాత రెండో కేటగిరీ ఉంటుంది.
☛ రెండో కేటగిరిలో ఉన్న స్ట్రీట్ వెండర్ ( street vendor) కేటగిరీ ఎంపిక చేసుకోండి.
☛ ఆ తర్వాత అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

మీ అప్లికేషన్‌ నింపి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు లోన్ రూల్స్‌ ప్రకారం మీ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఆపై మీ లోన్‌ ఆమెదించిన తర్వాత మీ ఖాతా నగదుని జమ చేస్తుంది.

AP CM YS Jagan : మరో మంచి కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం...

Published date : 19 Nov 2022 03:15PM

Photo Stories