పేదరిక, నిరుద్యోగనిర్మూలన పథకాలు
1. కింది వాటిలో దేన్ని ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా భావించలేం?
ఎ) కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం
బి) ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం
సి) అటవీ ప్రాంతాల అభివృద్ధి పథకం
డి) గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ
- View Answer
- సమాధానం: డి
2. ‘సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని, తద్వారా ఆదాయ సమానతలు పెరుగుతున్నాయ’ని 2001 ఆగస్టు 15న ఎవరు అభిప్రాయపడ్డారు?
ఎ) రాజీవ్ గాంధీ
బి) వి.పి.సింగ్
సి) అటల్ బిహారీ వాజ్పేయి
డి) దేవెగౌడ
- View Answer
- సమాధానం: సి
3. వ్యవసాయరంగంలో కౌలు చట్టాలు, మిగులు భూమి పంపిణీ, కమతాల సమీకరణ మొదలైన వాటితో భూసంస్కరణలపై, వ్యవసాయదారులపై జాతీయ విధానం శ్రద్ధ వహించాలని ఎన్నో ప్రణాళిక ముసాయిదా పేర్కొంది?
ఎ) 9వ
బి) 10వ
సి) 11వ
డి) 12వ
- View Answer
- సమాధానం: సి
4. ఇందిరా ఆవాస్ యోజన ద్వారా భారత్లో ఏ ఏడాది నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది?
ఎ) 2017
బి) 2020
సి) 2025
డి) 2026
- View Answer
- సమాధానం: బి
5. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ప్రారంభించిన పథకం?
ఎ) సామాజిక అభివృద్ధి పథకం
బి) ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం
సి) కనీస అవసరాల కార్యక్రమం
డి) కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్
- View Answer
- సమాధానం: ఎ
6. ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1952
బి) 1972-73
సి) 1973-74
డి) 1975
- View Answer
- సమాధానం: బి
7. భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం?
ఎ) సామాజిక అభివృద్ధి పథకం
బి) కనీస అవసరాల కార్యక్రమం
సి) కరవు పీడిత ప్రాంతాల కార్యక్రమం
డి) ఎడారి ప్రాంత అభివృద్ధి పథకం
- View Answer
- సమాధానం: సి
8. ‘క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయిమెంట్’ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1955
బి) 1963
సి) 1970
డి) 1973
- View Answer
- సమాధానం: డి
9. సాంకేతిక, విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకం?
ఎ) ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ
బి) ఉపాధి హామీ పథకం
సి) పనికి ఆహారపథకం
డి) ఆక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లయ్
- View Answer
- సమాధానం: ఎ
10. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించిందెవరు?
ఎ) మొరార్జీదేశాయ్
బి) ఇందిరా గాంధీ
సి) రాజీవ్ గాంధీ
డి) వి.పి.సింగ్
- View Answer
- సమాధానం: బి
11. ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1965
బి) 1972
సి) 1975
డి) 1977
- View Answer
- సమాధానం: డి
12. చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ కింది ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
ఎ) 2వ
బి) 3వ
సి) 4వ
డి) 5వ
- View Answer
- సమాధానం: సి
13. అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం?
ఎ) 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం
బి) పనికి ఆహార పథకం
సి) సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: బి
14. స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ)1979
బి)1980
సి)1983
డి)1985
- View Answer
- సమాధానం: ఎ
15. గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం?
ఎ) 20 సూత్రాల ఆర్థిక పథకం
బి) చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ
సి) సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం
డి) ఉపాధి హామీ పథకం
- View Answer
- సమాధానం: సి
16. గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం?
ఎ) సామాజిక అభివృద్ధి పథకం
బి) జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం
సి) నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: బి
17. పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి ప్రారంభించిన కార్యక్రమం?
ఎ) మధ్యాహ్న భోజన పథకం
బి) విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి
సి) జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం
డి) ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన
- View Answer
- సమాధానం: సి
18. గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1983
బి) 1985
సి) 1987
డి) 1989
- View Answer
- సమాధానం: ఎ
19. గ్రామీణాభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం లక్ష్యంగా 1985లో ఏర్పాటు చేసింది?
ఎ) జవహర్ రోజ్గార్ యోజన
బి) నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్
సి) నెహ్రూ రోజ్గార్ యోజన
డి) జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం
- View Answer
- సమాధానం: బి
20. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా 1982-83లో ప్రారంభమైన పథకం?
ఎ) డ్వాక్రా
బి)ఆర్.ఎల్.ఇ.జి.పి
సి) ఎన్.ఆర్.ఇ.పి
డి) కనీస అవసరాల కార్యక్రమం
- View Answer
- సమాధానం: ఎ
21. సబ్సిడీలు, బ్యాంకు విత్తం కల్పన లక్ష్యంగా 1986లో ప్రారంభమైన పథకం?
ఎ) డ్వాక్రా
బి) పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం
సి) మహిళా సమృద్ధి యోజన
డి) గంగా కల్యాణ్ యోజన
- View Answer
- సమాధానం: బి
22. కింది వాటిలో దేన్ని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించవొచ్చు?
ఎ) జవహర్ రోజ్గార్ యోజన
బి) సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం
సి) డ్వాక్రా
డి) మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
- View Answer
- సమాధానం: ఎ
23. ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరికనిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
ఎ) 1993
బి) 1995
సి) 1997
డి) 1999
- View Answer
- సమాధానం: బి
24. కింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం?
ఎ) నెహ్రూ రోజ్గార్ యోజన
బి) జవహర్ రోజ్గార్ యోజన
సి) కమాండ్ ఏరియా అభివృద్ధి కార్యక్రమం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
25. స్పెషల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ టెన్ మిలియన్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీస్ (2002) కమిటీ అధ్యక్షుడు?
ఎ) ఎస్.పి. గుప్తా
బి) టెండూల్కర్
సి) విజయ్ కేల్కర్
డి) బరూచా
- View Answer
- సమాధానం: ఎ
26. గ్రామీణ ప్రాంతాల్లో వంద రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా 1993లో ప్రారంభించిన పథకం?
ఎ) జవహర్ రోజ్గార్ యోజన
బి) నెహ్రూ రోజ్గార్ యోజన
సి) ఉపాధి హామీ పథకం
డి) మహిళా సమృద్ధి యోజన
- View Answer
- సమాధానం: సి
27. పోస్టాఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం?
ఎ) మహిళా సమృద్ధి యోజన
బి) గంగా కల్యాణ్ యోజన
సి) కనీస అవసరాల కార్యక్రమం
డి) రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన
- View Answer
- సమాధానం: ఎ
28. స్వర్ణ జయంతి శహరీ రోజ్గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1994
బి) 1995
సి)1996
డి) 1997
- View Answer
- సమాధానం: డి
29. పేదల ఆహార భద్రత లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రారంభించిన పథకం?
ఎ) ఆశ్రమ బీమా యోజన
బి) జనశ్రీ బీమా యోజన
సి) అంత్యోదయ అన్నయోజన
డి) అన్నపూర్ణ యోజన
- View Answer
- సమాధానం: సి
30. ‘రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన (1998)’ లక్ష్యం?
ఎ) మహిళలకు విద్యావకాశాల పెంపు
బి) మహిళలకు బీమా రక్షణ
సి) మహిళలకు ఆహార భద్రత
డి) గర్భిణుల సంరక్షణ
- View Answer
- సమాధానం: బి
31. పెన్షన్ పొందని వృద్ధ్దులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం?
ఎ) శిక్షా సయోగ్ యోజన
బి) జనశ్రీ బీమా యోజన
సి) భారత్ నిర్మాణ్
డి) అన్నపూర్ణ యోజన
- View Answer
- సమాధానం: డి
32. ఇళ్లు, తాగునీరు, పరిశుభ్రత కల్పన లక్ష్యంగా 1999లో ప్రారంభించిన పథకం?
ఎ) భారత్ నిర్మాణ్
బి) స్వర్ణ జయంతి ఆవాస్ యోజన
సి) వందేమాతరం
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: బి
33. జవహర్ గ్రామీణ సమృద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభంచారు?
ఎ) 1997
బి) 1998
సి) 1999
డి) 2000
- View Answer
- సమాధానం: సి
34. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం?
ఎ) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
బి) స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన
సి) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
డి) సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన
- View Answer
- సమాధానం: ఎ
35. ‘సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన (2001)’ లక్ష్యం?
ఎ) పేద వర్గాలకు బీమా
బి) ఉపాధి, ఆహారభద్రత
సి) గర్భిణుల సంరక్షణ
డి) బాలింతల సంరక్షణ
- View Answer
- సమాధానం: బి
36. పేద జిల్లాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా 2001లో ప్రారంభించిన పథకం?
ఎ) జయప్రకాశ్ నారాయణ్ రోజ్గార్ గ్యారంటీ యోజన
బి) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
సి) జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన
డి) నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్
- View Answer
- సమాధానం: ఎ
37. అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పథకం?
ఎ) జాతీయ పనికి ఆహార పథకం
బి) ఎన్ఆర్ఈపీ
సి) భారత్ నిర్మాణ్
డి) వందేమాతరం
- View Answer
- సమాధానం: ఎ
38. సోషల్ సెక్యూరిటీ పెలైట్ స్కీం (2004) లక్ష్యం?
ఎ) అనుబంధ వేతన ఉపాధి
బి) అసంఘటిత రంగంలోని శ్రామికులకు బీమా, పెన్షన్, వైద్య సదుపాయాల కల్పన
సి) గర్భిణుల సంరక్షణ
డి) పేద జిల్లాల్లో ఉపాధి కల్పన
- View Answer
- సమాధానం: బి
39. నేషనల్ సోషల్ అసిస్టెన్స ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1992
బి) 1993
సి) 1994
డి) 1995
- View Answer
- సమాధానం: డి
40. పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకం?
ఎ) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
బి) భారత్ నిర్మాణ్
సి) ఇందిరమ్మ
డి) సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన
- View Answer
- సమాధానం: ఎ
41. భూమిలేని వ్యవసాయ కార్మికులకు బీమా లక్ష్యంగా 2001లో ప్రారంభమైన పథకం?
ఎ) జనశ్రీ బీమా యోజన
బి) కేటీహార్ మజ్దూర్ బీమా యోజన
సి) జననీ సురక్ష యోజన
డి) శిక్షా సంయోగ్ యోజన
- View Answer
- సమాధానం: బి
42. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం?
ఎ) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
బి) ఇందిరా ఆవాస్ యోజన
సి) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం
డి) పీఎం గ్రామోదయ యోజన
- View Answer
- సమాధానం: ఎ
43. గర్భిణుల సంరక్షణకు ఉద్దేశించిన పథకం?
ఎ) జననీ సురక్ష యోజన
బి) జనశ్రీ బీమా యోజన
సి) వందేమాతరం
డి) గంగా కల్యాణ్ యోజన
- View Answer
- సమాధానం: సి
44. తల్లుల సంరక్షణ లక్ష్యంగా 2005లో ప్రారంభించిన పథకం?
ఎ) జననీ సురక్ష యోజన
బి) వందేమాతరం
సి) రాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన
డి) ఆశ్రయ బీమా యోజన
- View Answer
- సమాధానం: ఎ
45. ఉపాధి కోల్పోయిన వారికి నష్ట పరిహారాన్ని అందించే ఆశ్రయ బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1997
బి) 1999
సి) 2001
డి) 2005
- View Answer
- సమాధానం: సి
46. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2005 ఫిబ్రవరి 2
బి) 2006 ఫిబ్రవరి 2
సి) 2007 ఫిబ్రవరి 2
డి) 2008 ఫిబ్రవరి 2
- View Answer
- సమాధానం: బి
47. ‘ఉజ్వల’ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2005 డిసెంబర్
బి) 2006 డిసెంబర్
సి) 2007 డిసెంబర్
డి) 2008 జనవరి
- View Answer
- సమాధానం: సి
48. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పనను ‘పుర’ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2002
బి) 2003
సి)2004
డి) 2005
- View Answer
- సమాధానం: బి
49. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం కార్యక్రమాలు దేనిలో విలీనమయ్యాయి?
ఎ) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
బి) జె.ఆర్.వై.
సి) ఎన్.ఆర్.వై.
డి) ఉజ్వల
- View Answer
- సమాధానం: ఎ
50. 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం?
ఎ) భారత్ నిర్మాణ్
బి) ఆమ్ ఆద్మీ బీమా యోజన
సి) నేషనల్ రెన్యువల్ ఫండ్
డి) నేషనల్ రూరల్ హెల్త్ మిషన్
- View Answer
- సమాధానం: బి