Summer Effect: 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఎండలు తగ్గేదేలే..
పలు ప్రాంతాల్లో ప్రజలు వేసవి తాపాన్ని నుంచి బయటపడేందుక ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరుసగా 35.9, 37.78 డిగ్రీల సెల్సీయస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ స్థాయి సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం 122 ఏళ్లలో ఇది నాలుగో సారి.
గత 75 ఏళ్లలో ‘అత్యంత వేడి సంవత్సరం’గా దేన్ని గుర్తించారు?
మే నెలలో ఎండ వేడి మరింత..
మార్చి, ఏప్రిల్‌లలో అధిక ఉష్ణోగ్రతలు నిరంతర తక్కువ వర్షపాతం కారణంగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దేశంలోని వాయువ్య, పశ్చిమ మధ్య భాగాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. మే నెలలో ఎండ వేడి మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా.. పలు ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అలాగే తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.