వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు
Sakshi Education
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సమావేశాలు ఈ నెల 24 వరకు జరుగుతాయి. ఈ సంస్థ మానవాళి ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న డబ్ల్యూఈఎఫ్ గురించి తెలుసుకుందాం...
చరిత్ర:
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను యూరప్ వ్యాపారవేత్తలు 1971లో ఏర్పాటు చేశారు. యూరోపియన్ కమిషన్, యూరోపియన్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సమావేశమై డబ్ల్యూఈఎఫ్‌కు శ్రీకారం చుట్టారు. 1987 వరకు దీన్ని యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్‌గా వ్యవహరించేవారు. ఆ తర్వాత డబ్ల్యూఈఎఫ్‌గా మార్చారు. ఆర్థిక వ్యవస్థపై యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన ప్రొఫెసర్ క్లాజ్ స్క్వాబ్ రచించిన పుస్తకం ఈ సంస్థ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచింది. మొదట యూరప్‌కే పరిమితమైన డబ్ల్యూఈఎఫ్ అనంతరం అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది. ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్.
సభ్యులు:
డబ్ల్యూఈఎఫ్‌లో 1000 మంది సభ్యులు ఉంటారు. ప్రపంచంలోని ప్రఖ్యాత వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థల అధిపతులకు ఇందులో సభ్వత్వం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే నిధులతో డబ్ల్యూఈఎఫ్ కార్యకలాపాలు కొనసాగుతాయి. వీటిని ఫౌండేషన్ బోర్డు పర్యవేక్షిస్తుంది. ప్రతిఏటా దాదాపు 6 ప్రాంతీయ సమావేశాలు వివిధ దేశాల్లో నిర్వహిస్తారు. ఏటా ఒక్కో దేశంలో వార్షిక సమావేశం ఏర్పాటు చేస్తారు.
లక్ష్యాలు:
ఏర్పాటు: 1971 జనవరి
అధికార భాష: ఆంగ్లం
మ కోలొనీ, స్విట్జర్లాండ్
వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్: క్లాజ్ స్క్వాబ్
వెబ్‌సైట్: www.weforum.org

- ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలను రూపొందించడం
- సామాజిక, ఆర్థిక రంగాల్లో సమస్యలను పరిష్కరించడం
- ప్రపంచ ఆర్థికాభివృద్ధికి, మానవ ప్రగతికి సూచనలు చేయడం
- పర్యావరణ పరిరక్షణ
- లింగ వివక్షను రూపుమాపడం
- ఆర్థిక అసమానతలను అంతం చేయడం
- ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం
- మానవ హక్కులను కాపాడడం
- ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, బాధితులకు బాసటగా నిలవడం
- విద్యార్థులు, నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వర్క్‌షాప్‌ల నిర్వహణ
- అవినీతిని నిర్మూలించి, పరిపాలనలో పారదర్శకతను పెంచడం
ఏర్పాటు: 1971 జనవరి
అధికార భాష: ఆంగ్లం
మ కోలొనీ, స్విట్జర్లాండ్
వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్: క్లాజ్ స్క్వాబ్
వెబ్‌సైట్: www.weforum.org
Published date : 20 Jan 2015 12:49PM