Skip to main content

Union Budget : దేశ చరిత్రలో.. కేంద్ర ఆర్థిక మంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని మంత్రులు వీరే.. కార‌ణం ఇదే..?

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ 2023-24ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

ఆమె వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం విశేషమనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్‌లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం!

☛ Union Budget: రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌... పీఎం కిసాన్‌ నిధిని 6 నుంచి 8 వేలకు పెంపు..!

రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు..
బడ్జెట్‌ అనే పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రులలో మొరార్జీ దేశాయ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్‌ చెక్కు చెదరకుండా ఆయన పేరునే కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్‌ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయంటే నమ్మడమే కష్టమే. కానీ ఈ జాబితాలో ఇద్దరు ఉన్నారు. హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రిత్వ శాఖను కలిగి ఉన్నప్పటికీ, ఏ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించలేదు.

☛ Union Budget : బడ్జెట్‌ తయారీ వెనుక ఉన్న కథ ఇదే.. ఆరు నెల‌ల నుంచి..

వీరివురూ చాలా తక్కువ వ్యవధిలో పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్‌ సమర్పించే అవకాశం లేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండవ ఆర్థిక మంత్రిగా నియమితులై, కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు.

☛ Union Budget: సాయంత్రం 5 తర్వాతే బడ్జెట్‌ ప్రవేశపెట్టేవారు.. ఎందుకో తెలుసా...కేవలం 800 పదాలతో బడ్జెట్‌ను ముగించిన మంత్రి ఎవరంటే...

Published date : 28 Jan 2023 06:40PM

Photo Stories