ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020గా గుర్తింపు పొందిన భారతీయ నగరం ఏది?
Sakshi Education
పట్టణంలో అడవులను పెంచడంతో పాటు వాటిని నిబద్ధతతో నిర్వహించినందును హైదరాబాద్‌ను ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ 2020గా ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, అర్బోర్ డే ఫౌండేషన్ గుర్తించాయి.
పట్టణ, పెరి-అర్బన్ ఫారెస్ట్రీ చర్యల అభివృద్ధి, ప్రాజెక్టులు, వ్యూహాత్మక ప్రణాళికతో ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించడానికి నిబద్ధతతో చెట్లను నాటి, పెంచి పోషించిన కారణంగా ఈ గుర్తింపునిచ్చారు. ఈ జాబితాలోని నగరాల్లో ఎక్కువ భాగం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి.
Published date : 26 Feb 2021 02:27PM