Skip to main content

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

ఈ సంవత్సరం 2021లో సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 9న పాటిస్తారు. ఈ రోజును మొద‌టిసారి ఫిబ్రవరి 11, 2020న గుర్తించారు. అంటే ఈ రోజును ఫిబ్రవరి రెండో వారంలో రెండో రోజున నిర్వ‌హిస్తారు.

SID అనేది ఏటా ఫిబ్రవరిలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమం. అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ సమస్యలపై (సైబర్ బెదిరింపు వంటివి) ప్రజల్లో అవగాహన పెంచడం ప్రస్తుత ఆందోళనలను ప్రతిబింబించే అంశాన్ని ఎంచుకోవడం దీని ఉద్దేశం. ఈ రోజును 30 దేశాల్లో విస్తరించి ఉన్న ఇన్సాఫ్/ఇన్హోప్ అవేర్‌నెస్ సెంటర్ నెట్‌వర్క్ నిర్వ‌హిస్తుంది. యూరోపియన్ యూనియన్ "కనెక్టెడ్ యూరోపియన్ ఫెసిలిటీస్ ప్రాజెక్ట్ష‌ (సీఈఎఫ్) చేత నిధులు సమకూరుతాయి.

SID 2004లో ప్రారంభమైంది. ఇది ఈయూ "పిల్లల ఇంటర్నెట్ మంచిది" విధానంలో భాగం. ప్ర‌స్తుతం SID కార్యక్రమం ప్రపంచంలోని 150 దేశాలలో/ప్రాంతాలలో గుర్తించారు. ప్రణాళిక ప్రభావాన్ని విస్తరించడానికి, 2009లో సురక్షిత ఇంటర్నెట్ డే కమిటీని ప్రవేశపెట్టారు. న్యూ ఢిల్లీకి చెందిన ఎన్‌జీవో డీఐఎస్సీ (డెవలపింగ్ ఇంటర్నెట్ సేఫ్ కమ్యూనిటీ) ఫౌండేషన్ భారతదేశంలో సిడ్ కమిటీ.

Published date : 15 Feb 2021 03:48PM

Photo Stories